హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న మొన్న విడుదలైన ఆడి లగ్జరీ కారు

ఆడి ఇండియా జనవరిలో విడుదల చేసిన క్యూ5 లగ్జరీ ఎస్‌యూవీకి ఊహించని డిమాండ్ లభించింది. అనతి కాలంలోనే ఏకంగా 500 బుకింగ్స్ నమోదు చేసుకుని రికార్డ్ సృష్టించింది.

By Anil

Recommended Video

Mahindra Rexton Quick Look; Specs, Interior And Exterior - DriveSpark

ఆడి కార్లంటే ఆషామాషీ కాదు. ఆడి కార్ల డీల్ లక్షల్లో ఉంటుంది. ఒక్క ఆడి కారు ధరతో కొన్ని గ్రామాలకు పట్టుకున్న ధరిద్రాన్ని ఇట్టే కడిగేయవచ్చు. ఇదంతా ఎందుకంటే ఆడి కార్లు ఇండియన్ మార్కెట్లో ఎంత ఖరీదైనవో తెలపడానికే. ఆడి కార్లకు విపరీతమైన ఫ్యాన్స్ ఉంటారు, కాని అందులో వాటిని కొనేవారు కేవలం ఒక్క శాతమే ఉంటారు.

ఆడి క్యూ5 సేల్స్

ఈ మధ్య కాలంలోనే ఆడి క్యూ5 లగ్జరీ ఎస్‌యూవీ విడుదలైంది. చూసిన వారంతా ఇంత ఖరీదైన కార్లను ఎవరు కొంటారులే అనుకుంటారు. కానీ, ఊహించని విధంగా ఇది విడుదలైన నెల రోజుల్లోనే ఏకంగా 500 కార్లకు బుకింగ్స్ నమోదయ్యాయి.

ఆడి క్యూ5 సేల్స్

మీరు చదివింది అక్షరాలా నిజమే, ఆడి ఇండియా జనవరిలో విడుదల చేసిన క్యూ5 లగ్జరీ ఎస్‌యూవీకి ఊహించని డిమాండ్ లభించింది. అనతి కాలంలోనే ఏకంగా 500 బుకింగ్స్ నమోదు చేసుకుని రికార్డ్ సృష్టించింది.

ఆడి క్యూ5 సేల్స్

జనవరి 18, 2018లో విడుదలైన సరికొత్త సెకండ్ జనరషన్ ఆడి క్యూ5 ప్రారంభ వేరియంట్ ధర రూ. 53.25 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉంది. ఆడి క్యూ5 ప్రీమియమ్ ప్లస్ మరియు టెక్నాలజీ అనే రెండు వేరియంట్లలో లభ్యమవుతోంది.

ఆడి క్యూ5 సేల్స్

కొత్త తరం ఆడి క్యూ7 ఎస్‌యూవీని నిర్మించిన ఎమ్‌ఎల్‌బి ఎవో ఫ్లాట్‌ఫామ్ మీద ఆడి ఈ రెండవ తరానికి చెందిన క్యూ5 లగ్జరీ ఎస్‌యూవీని నిర్మించింది. సరికొత్త క్యూ5 కొలతలు పెరిగినప్పటికీ బరువు పరంగా 100కిలోల వరకు తగ్గింది.

ఆడి క్యూ5 సేల్స్

రెండవ తరానికి చెందిన ఆడి క్యూ5 విపణిలో ఉన్న బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3, మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి, ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ మరియు సరికొత్త వోల్వో ఎక్స్‌సి60 వంటి ఎస్‌యూవీలకు గట్టి పోటీనిస్తుంది.

ఆడి క్యూ5 సేల్స్

ఆడి క్యూ5 పనితీరు కూడా దీనికి పోటీగా ఉన్న ఇతర మోడళ్లకు దాదాపు దగ్గరగానే ఉంటుంది. ఆడి క్యూ5 కేవలం 7.9 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మరియు దీని గరిష్ట వేగం గంటకు 218కిలోమీటర్లుగా ఉంది. సరికొత్త క్యూ5 లీటర్‌కు 17.01కిమీల మైలేజ్ ఇస్తుందని ఆడి వెల్లడించింది.

ఆడి క్యూ5 సేల్స్

ఆడి ఇండియా విభాగాధిపతి రాహిల్ అన్సారీ మాట్లాడుతూ, "ఆడి క్యూ5 మీద అనతి కాలంలో లభించిన డిమాండ్ చూస్తే, సరికొత్త ఆడి క్యూ5 ఈ సెగ్మెంట్ లీడర్‌గా నిలిచిందని పేర్కొన్నాడు. భారత్‌లో ఈ శ్రేణిలో బెస్ట్ సెల్లింగ్ లగ్జరీ ఎస్‌యూవీగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు."

ఆడి క్యూ5 సేల్స్

ఇంటీరియర్‌లో ప్రతి ఆడి కస్టమర్‌ను ఆకట్టుకునేలా అత్యాధునిక ప్రీమియమ్ ఫీచర్లు ఉన్నాయి. ఆడి క్యూ5 ఇంటీరియర్‌లో ఫుల్లీ డిజిటల్ ఆడి వర్చువల్ కాక్‌పిట్ కలదు, ఇది హై-రిజల్యూషన్ 12.3-అంగుళాల పరిమాణంలో ఉన్న స్క్రీన్ మీద గ్రాఫిక్స్ డిస్ల్పే చేస్తుంది. అదే విధంగా క్యూ5 టాప్ ఎండ్ వేరియంట్లో హెడ్స్ అప్ డిస్ల్పే తరహాలో సమాచారాన్ని ముందు వైపు అద్దం మీద పడేలా చేస్తుంది.

ఆడి క్యూ5 సేల్స్

సాంకేతికంగా, 2018 ఆడి క్యూ5 లగ్జరీ ఎస్‌యూవీలో 2.0-లీటర్ కెపాసిటి గల టిడిఐ డీజల్ ఇంజన్ కలదు. ఇంజన్ ఉత్పత్తి చేసే 187బిహెచ్‌పి పవర్ మరియు 400ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఆడి పేటెంట్ పొందిన క్వాట్రో ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్ ద్వారా అన్ని చక్రాలకు సరఫరా అవుతుంది.

ఆడి క్యూ5 సేల్స్

ఆడి క్యూ5 లభించే రెండు విభిన్న వేరియంట్లలో కూడా క్వాట్రో ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్ తప్పనిసరిగా వచ్చింది. కొత్త తరం క్యూ5 ప్రస్తుతం డీజల్ ఇంజన్‌తో మాత్రమే లభ్యమవుతోంది. అతి త్వరలో దీనిని పెట్రోల్ వేరియంట్లో కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

ఆడి క్యూ5 సేల్స్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

సరికొత్త ఆడి క్యూ56 మీద వచ్చిన 500 బుకింగ్స్ భారత్‌లో దీనికి ఉన్న ప్రజాదరణ ఏంటో చూపిస్తుంది. అత్యాధునిక ఇంటీరియర్ మరియు సేఫ్టీ ఫీచర్లతో నిండిన తేలికపాటి బరువున్న మరియు శక్తివంతమైన క్యూ5 విజయ పరంపర ఇలాగే కొనసాగుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పవచ్చు.

Most Read Articles

Read more on: #audi #ఆడి
English summary
Read In Telugu: New Audi Q5 Bookings Reach 500 Within A Month Of Launch In India
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X