సరికొత్త 2018 ఆడి క్యూ5 విడుదల: ధర, ఇంజన్, ఫీచర్లు మరియు ఫోటోలు

జర్మన్ లగ్జరీ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం ఇండియా విపణిలోకి సరికొత్త 2018 క్యూ5 ఎస్‌యూవీని లాంచ్ చేసింది. సరికొత్త ఆడి క్యూ5 ప్రారంభ వేరియంట్ ధర రూ. 53.25 లక్షలు ఎక్స్‌-షోరూమ్(ఇండియా)గా ఉంది.

By Anil

Recommended Video

Angry Bull Almost Rammed Into A Car - DriveSpark

జర్మన్ లగ్జరీ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం ఆడి ఇండియా విపణిలోకి సరికొత్త 2018 క్యూ5 ఎస్‌యూవీని లాంచ్ చేసింది. సరికొత్త ఆడి క్యూ5 ప్రారంభ వేరియంట్ ధర రూ. 53.25 లక్షలు ఎక్స్‌-షోరూమ్(ఇండియా)గా ఉంది.

ఆడి క్యూ5 విడుదల

ఇండియన్ మార్కెట్లో ఆడి లైనప్‌లోకి విడుదలైన ఈ సెకండ్ జనరేషన్ క్యూ5 మిడ్ సైజ్ లగ్జరీ ఎస్‌యూవీని 2016 ప్యారిస్ మోటార్ షోలో తొలిసారిగా ఆడి బృందం ఆవిష్కరించింది. ఆడి క్యూ5 వేరియంట్లు, ధరలు, ఫీచర్లు మరియు ఇందులో ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయో చూద్దాం రండి...

ఆడి క్యూ5 విడుదల

ఆడి క్యూ5 వేరియంట్లు మరియు ధరలు

వేరియంట్లు ధరలు
క్యూ5 ప్రీమియమ్ ప్లస్ రూ. 53,25,000 లు
క్యూ5 టెక్నాలజీ రూ. 57,60,000 లు
ఆడి క్యూ5 విడుదల

ఆడి క్యూ5 ఇంజన్ వివరాలు

సరికొత్త 2018 ఆడి క్యూ5 లగ్జరీ ఎస్‌యూవీలో అదే మునుపటి 2.0-లీటర్ కెపాసిటి గల టుర్బోఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ కలదు, ఇది 3,800-4,000ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 187బిహెచ్‌పి పవర్ మరియు 1,750-3,000ఆర్‌పిఎమ్ మధ్య గరిష్టంగా 400ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

ఆడి క్యూ5 విడుదల

నూతన 7-స్పీడ్ ఎస్ ట్రోనిక్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ద్వారా ఇంజన్ ఉత్పత్తి చేసే పవర్ మరియు టార్క్ క్వాట్రో ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ద్వారా అన్ని చక్రాలకు అందుతుంది. ఆడి ఇండియా ప్రకారం, క్యూ5 ఎస్‌యూవీ లీటర్‌కు 17.01కిమీల మైలేజ్ ఇస్తుంది.

ఆడి క్యూ5 విడుదల

ఆడి క్యూ5 కేవలం 7.9-సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది మరియు దీని గరిష్ట వేగం గంటకు 218కిలోమీటర్లుగా ఉంది. ఎమ్‌ఎల్‍‌బి ఎవో ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా క్యూ5 తో పాటు అభివృద్ది చేసిన ఏ7 నుండి సేకరించిన విడిభాగాలను సెకండ్ జనరేషన్ క్యూ5లో అందించింది.

ఆడి క్యూ5 విడుదల

నూతన ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించిన క్యూ5 మునుపటి వెర్షన్‌తో పోల్చుకుంటే 90కిలోల వరకు బరవు తగ్గింది మరియు ఎస్‌యూవీ పొడవు కూడా పెరిగింది. వెడల్పు మరియు ఎత్తు పెరగడంతో బూట్(లగేజ్) స్పేస్ కూడా పెరిగింది. దీంతో సరికొత్త ఆడి క్యూ5 మరింత విశాలమైన క్యాబిన్ కలిగి ఉంది.

ఆడి క్యూ5 విడుదల

ఆడి క్యూ5 డిజైన్

సెకండ్ జనరేషన్ క్యూ5 చూడటానికి అచ్చం ఫస్ట్ జనరేషన్ క్యూ5 ఎస్‌యూవీనే పోలి ఉంటుంది. ఆడి వారి సిగ్నేచర్ సింగల్ ఫ్రేమ్ ఫ్రంట్ గ్రిల్, అధునాతన మ్యాట్రిక్ ఎల్ఇడి హెడ్‌ల్యాంప్స్ మరియు స్పోర్టివ్ బానెట్ క్యూ5 ఫ్రంట్ డిజైన్‌కు మంచి లుక్ తీసుకొచ్చాయి.

ఆడి క్యూ5 విడుదల

క్యూ5 రియర్ డిజైన్‌లో కూడా కీలకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. రూఫ్ మీద నిర్మించిన స్పాయిలర్, రీడిజైన్ చేయబడిన బంపర్, రియర్ డిఫ్యూసర్ మరియు అధునాతన ఎల్ఇడి టెయిల్ లైట్లు ఉన్నాయి.

ఆడి క్యూ5 విడుదల

ఆడి క్యూ5 ఇంటీరియర్ ఫీచర్లు

క్యూ5 ఇంటీరియర్‌లో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే లెథర్ అప్‌హోల్‌స్ట్రే, లెథర్ తొడుగు గల త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్, ఎలక్ట్రిక్ పవర్ ద్వారా అడ్జెస్ట్ చేసుకునే సదుపాయం గల డ్రైవర్ సైడ్ సీట్ మరియు ఈ సీట్ అడ్జెస్ట్‌మెంట్‌ను గుర్తుపెట్టుకునే మెమొరీ సిస్టమ్ కూడా ఉంది.

ఆడి క్యూ5 విడుదల

సెకండ్ జనరేషన్ ఆడి క్యూ5 ఎస్‌యూవీలో క్లాజిక్ మరియు ప్రొగ్రెసివ్ వ్యూవ్ గల 12.3-అంగుళాల పరిమాణంలో ఉండే ఆడి వర్చువల్ కాక్‌పిట్ డిస్ల్పే, 8.3-అంగుళాల ఎమ్ఎమ్ఐ డిస్ల్పే, ఆపిల్ మరియు ఆండ్రాయిడ్ ఫోన్ల అనుసంధానం కోసం ఆడి స్మార్ట్‌ఫోన్ ఇంటర్‌ఫేస్, వైరెస్ ఛార్జింగ్ గల ఆడి ఫోన్ బాక్స్, 10-స్పీకర్ల ఆడి సౌండ్ సిస్టమ్ మరియు సాంగ్స్ స్టోరేజ్ కోసం 10జిబి జూక్ బాక్స్ వంటివి ఉన్నాయి.

ఆడి క్యూ5 విడుదల

వివిధ రకాల డ్రైవింగ్ పరిస్థితుల కోసం ఐదు డ్రైవింగ్ మోడ్స్ ఉన్న ఆడి డ్రైవ్ సెలెక్ట్ సిస్టమ్ కలదు, ఇందులో కంఫర్ట్, డైనమిక్, ఆటో, ఇండివిడ్యూవల్ మరియు ఆఫ్-రోడ్ అనే డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. ఇతర ఫీచర్లయిన త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, డ్యాంపిగ్ కంట్రోల్ గల ఆడాప్టివ్ సస్పెన్షన్ సిస్టమ్, ప్యానోరమిక్ సన్‌రూఫ్, ఎలక్ట్రికల్‌గా ఆపరేట్ చేయగలిగే డిక్కీ డోర్, స్పీడ్ లిమిటర్ ఫంక్షనాలిటీ గల క్రూయిజ్ కంట్రోల్ వంటివి ఉన్నాయి.

ఆడి క్యూ5 విడుదల

ఆడి క్యూ5 ఎస్‌యూవీలో భద్రత పరంగా ఎనిమిది ఎయిర్ బ్యాగులు, రియర్ వ్యూవ్ కెమెరా గల ఆడి పార్కింగ్ సిస్టమ్, యాక్టివ్ లేన్ అసిస్ట్, ప్రమాదాన్ని నివారించే అసిస్ట్, పార్క్ అసిస్ట్ మరియు బ్లైండ్ స్పాట్ వార్నింగ్ ఇంకా ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.

ఆడి క్యూ5 విడుదల

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

2018లో ఇండియన్ మార్కెట్లోకి ఆడి విడుదల చేసిన తొలి విడుదల క్యూ5 ఎస్‌యూవీ. పూర్తి రీడిజైన్ చేయబడిన ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్. ఎంటర్‌టైన్మెంట్, కంఫర్ట్ మరియు సేఫ్టీ పరంగా ఎన్నో అధునాతన ఫీచర్లను అందించి 2018 ఎడిషన్ సెకండ్ జనరేషన్ క్యూ5 మిడ్ సెజ్ లగ్జరీ ఎస్‌యూవీని లాంచ్ చేసింది.

ఆడి క్యూ5 విడుదల

సరికొత్త ఆడి క్యూ5 విపణిలో ఉన్న మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి, ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌3 మరియు కొత్తగా విడుదలైన వోల్వో ఎక్స్‌సి60 వంటి లగ్జరీ ఎస్‌యూవీలకు గట్టి పోటీనివ్వనుంది.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

Most Read Articles

English summary
Read In Telugu: New 2018 Audi Q5 Launched In India; Prices Start At Rs 53.25 Lakh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X