ఆడి క్యూ5 పెట్రోల్ విడుదల: వేరియంట్లు, ధర, ఇంజన్, ఫీచర్లు మరియు ఫోటోలు

ఆడి ఇండియా విపణిలోకి సరికొత్త క్యూ5 ఎస్‌యూవీని పెట్రోల్ వెర్షన్‌లో లాంచ్ చేసింది. సరికొత్త ఆడి క్యూ5 పెట్రోల్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 55.27 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉంది.

By Anil Kumar

ఆడి ఇండియా విపణిలోకి సరికొత్త క్యూ5 ఎస్‌యూవీని పెట్రోల్ వెర్షన్‌లో లాంచ్ చేసింది. సరికొత్త ఆడి క్యూ5 పెట్రోల్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 55.27 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉంది.

ఆడి క్యూ5 పెట్రోల్ విడుదల

ఈ ఏడాది జనవరిలో క్యూ5 డీజల్ వెర్షన్‌ను తొలుత విడుదల చేసింది. దీనికి కొనసాగింపుగా పెట్రోల్ వెర్షన్‌ను జోడించింది. క్యూ5 పెట్రోల్ ఈ ఏడాది ఆడి ఇండియా విడుదల చేసిన మూడవ ఉత్పత్తి.

ఆడి క్యూ5 పెట్రోల్ విడుదల

ఆడి క్యూ5 డిజైన్ పరంగా పెట్రోల్ మరియు డీజల్ రెండు వెర్షన్‌లు కూడా చూడటానికి ఒకేలా ఉంటాయి. క్యూ5 పెట్రోల్ వెర్షన్‌లో ఆడి సిగ్నేచర్ సింగల్ ఫ్రేమ్ గ్రిల్ మరియు మ్యాట్రిక్స్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ ఉన్నాయి. రెండింటిలో కూడా ఒకే తరహా అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. అయితే, 45టిఎఫ్ఎస్ఐ బ్యాడ్జి పెట్రోల్ మరియు డీజల్ వేరియంట్ల మధ్య తేడాను తెలియజేస్తుంది.

ఆడి క్యూ5 పెట్రోల్ విడుదల

ఆడి క్యూ5 పెట్రోల్ వేరియంట్లలో 2-లీటర్ల సామర్థ్యం గల టుర్భోఛార్జ్‌డ్ టీఎఫ్ఎస్ఐ పెట్రోల్ ఇంజన్ కలదు. 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 248బిహెచ్‌పి పవర్ మరియు 370ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

ఆడి క్యూ5 పెట్రోల్ విడుదల

క్యూ5 డీజల్ వేరియంట్లో కూడా ఇదే తరహా గేర్‌బాక్స్ ఉంది. ఇంజన్ ప్రొడ్యూస్ చేసే పవర్ మరియు టార్క్ ఆడి క్వాట్రో ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ ద్వారా అన్ని చక్రాలకు సరఫరా అవుతుంది.

ఆడి క్యూ5 పెట్రోల్ విడుదల

సరికొత్త క్యూ5 పెట్రోల్ ఇంటీరియర్ డీజల్ అచ్చం డీజల్ వేరియంట్‌నే పోలి ఉంటుంది. ఇందులో కూడా అదే బ్లాక్ అండ్ బీజీ డ్యూయల్ టోన్ డ్యాష్‌బోర్డు ఉంది. అదే విధంగా డ్యాష్‌బోర్డ్ మరియు సెంటర్ కన్సోల్‌ను కలప సొబగులతో తీర్చిదిద్దారు. డ్యాష్‌బోర్డు మధ్యలో 8.3-అంగుళాల పరిమాణంలో ఉన్న డిస్ల్పే, న్యావిగేషన్ మరియు రోటరీ నాబ్ కంట్రోల్స్ ఉన్నాయి.

ఆడి క్యూ5 పెట్రోల్ విడుదల

అదనపు ఫీచర్లలలో 12.3-అంగుళాల పరిమాణంలో ఉన్న ఆడి వర్చువల్ కాక్‌పిట్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. ఇది, మ్యాప్స్, రియల్-టైమ్ మైలేజ్, కాంటాక్ట్స్, మ్యూజిక్ డిస్టెన్స్ టు ఎంప్టి, సగటు వేగం ఇంకా అంశాల గురించిన పూర్తి సమాచారం అందిస్తుంది.

ఆడి క్యూ5 పెట్రోల్ విడుదల

ఆడి క్యూ5 పెట్రోల్ వేరియంట్ బ్యాంగ్ అండ్ ఓలుఫ్సెన్ త్రీడీ సౌండ్ సిస్టమ్, వైర్ లెస్ ఛార్జింగ్, స్మార్ట్ ఫోన్ ఇంటిగ్రేషన్, ఇంటెలిజెంట్ వాయిస్ డైలాగ్ సిస్టమ్, 10జీబీ స్టోరేజ్ స్పేస్, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, లెథర్ సీట్ అప్‌హోల్‌స్ట్రే మరియు హెడ్స్ అప్ డిస్ల్పే తదితర అదనపు ఫీచర్లు ఉన్నాయి.

ఆడి క్యూ5 పెట్రోల్ విడుదల

సేఫ్టీ పరంగా ఆడి క్యూ5 పెట్రోల్ వేరియంట్లో ఎనిమిది ఎయిర్ బ్యాగులు, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, యాక్టివ్ లేన్ అసిస్ట్, పార్క్ అసిస్ట్, కొల్లిషన్ అవాయిడ్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ వార్నింగ్, ఆడి పార్కింగ్ సిస్టమ్ మరియు రియర్ వ్యూవ్ కెమెరాతో పాటు ఇంకా ఎన్నో ఫీచర్లు దీని సొంతం.

ఆడి క్యూ5 పెట్రోల్ విడుదల

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఆడి ఇండియా ఈ ఏడాది ప్రారంభంలో క్యూ5 డీజల్ వేరియంట్ లాంచ్ చేసింది, అయితే పెట్రోల్ ప్రియుల కోసం నేడు సరికొత్త క్యూ5 పెట్రోల్ వేరియంట్‌ను విడుదల చేసింది. ఆడి క్యూ5 ప్రీమియం లగ్జరీ ఎస్‌యూవీ విపణిలో ఉన్న మెర్సిడెస్-బెంజ్ జీఎల్‌సి, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌3 మరియు లెక్సస్ ఎన్ఎక్స్300హెచ్ మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

Most Read Articles

English summary
Read In Telugu: Audi Q5 Petrol Launched In India; Priced At Rs 55.27 Lakhs
Story first published: Thursday, June 28, 2018, 14:44 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X