మార్కెట్లోకి మళ్లీ వస్తున్న బజాజ్ చేతక్ స్కూటర్లు: విడుదల వివరాలు!!

బజాజ్ ఆటో కంపెనీ చేతక్ స్కూటర్‌ను తిరిగి మార్కెట్లోకి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ... ఇదే నిజమైతే బజాజ్ చేతక్ ఎలాంటి డిజైన్ స్టైల్లో, ఎలాంటి ఇంజన్ మరియు ఫీచర్లతో

By Anil Kumar

దేశీయ దిగ్గజ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటోకు పల్సర్ బ్రాండ్ పేరు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. కానీ దీనికంటే ముందు సుమారుగా రెండు దశాబ్దాల క్రితమే బజాజ్ ఆటోకు చేతక్ పేరు ప్రాణం పోసింది. పరిచయం అవసరం లేని బజాజ్ చేతక్ స్కూటర్ ఆటోమొబైల్ పరిశ్రమలో చోటు చేసుకున్న విప్లవాత్మక మార్పుల కారణంగా అనతి కాలంలోనే కాలగర్భంలో కలిసిపోయింది.

బజాజ్ చేతక్ స్కూటర్

ఇప్పుడు బజాజ్ ఆటో కంపెనీ చేతక్ స్కూటర్‌ను తిరిగి మార్కెట్లోకి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ... ఇదే నిజమైతే బజాజ్ చేతక్ ఎలాంటి డిజైన్ స్టైల్లో, ఎలాంటి ఇంజన్ మరియు ఫీచర్లతో వస్తుందో అని పరిశ్రమ వర్గాలు ఆలోచనలో పడ్డాయి.

బజాజ్ చేతక్ స్కూటర్

తాజాగా అందిన సమాచారం మేరకు, బజాజ్ ఆటో 2019లో దేశీయంగా తమ చేతక్ స్కూటర్లను అధికారికంగా విడుదల చేసేందుకు సన్నద్దమవుతున్నట్లు తెలిసింది. అంతే కాకుండా, 125సీసీ సామర్థ్యం గల ఇంజన్‌తో వచ్చే దీని ధర సుమారుగా రూ. 70,000 ఉంటుందని సమాచారం.

బజాజ్ చేతక్ స్కూటర్

బజాజ్ చేతక్ స్కూటర్లు తమ విభిన్నమైన డిజైన్‌కు పెట్టింది పేరు. అప్పట్లో స్టేటస్‌కు సింబల్‌గా మార్కెట్లో సంచలనం సృష్టించిన చేతక్ స్కూటర్‌ను ఇప్పుడు అదే పాత డిజైన్ శైలిలో ప్రవేశపెట్టి క్లాసిక్ స్కూటర్ల విభాగంలో క్యాష్ చేసుకోవాలని బజాజ్ భావిస్తోంది.

బజాజ్ చేతక్ స్కూటర్

ప్రస్తుతం మోడ్రన్ డిజైన్ కంటే పాత డిజైన్ శైలిలో ఉన్న క్లాసిక్ స్కూటర్లకే డిమాండ్ ఎక్కువగా ఉంది. కాబట్టి, క్లాసిక్ డిజైన్ అంశాలు, మైలేజ్ మరియు పర్ఫామెన్స్ సమపాళ్లలో ఇచ్చే 125సీసీ సింగల్ సిలిండర్ ఫోర్-స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్‌తో చేతక్ స్కూటర్‌కు మళ్లీ ప్రాణం పోసే అవకాశాలు ఉన్నాయి.

బజాజ్ చేతక్ స్కూటర్

కొత్త తరం బజాజ్ చేతక్ స్కూటర్ అత్యాధునిక బ్లూటూత్ కనెక్టివిటి గల ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, యుఎస్‌బి మొబైల్ ఛార్జింగ్ పోర్ట్, అల్లాయ్ వీల్స్, పలు విభిన్న స్టోరేజ్ స్పేస్‌లు, విశాలమైన సీటు మరియు అండర్ సీట్ స్టోరేజీతో పాటు భద్రత పరంగా కాంబి బ్రేకింగ్ సిస్టమ్‌ మరియు ఫ్రంట్ డిస్క్ బ్రేక్ కూడా అందించే అవకాశం ఉంది.

బజాజ్ చేతక్ స్కూటర్

1960లో రాజస్థాన్‌కు చెందిన "రాహుల్ బజాజ్" అనే ఓ యువ పారిశ్రామిక వేత్త బజాజ్ స్కూటర్లకు ప్రాణం పోశారు. ఇటలీ కంపెనీ నుంచి తెచ్చుకున్న ఆజ్ఞాపత్రం (లైసెన్స్)తో స్కూటర్ల తయారీకి శ్రీకారం చుట్టారు.

బజాజ్ చేతక్ స్కూటర్

స్కూటర్ల తయారీకి ఒకానొక కాలంలోనే రాహుల్ బజాజ్ సంసిద్ధిత వ్యక్తం చేసినప్పటికీ, అతని కుమారుడు రాజీవ్ బజాజ్ మాత్రం సుముఖంగా లేరని సమాచారం. గతంలో 2015లో బజాజ్ మేనేజింగ్ డైరక్టర్ రాజీవ్ బజాజ్ మాట్లాడుతూ, "బజాజ్ ఆటో ఇప్పట్లో ఆటోమేటిక్ స్కూటర్లను విడుదల చేసే ఆలోచనలోలేదని వెల్లడించాడు." ప్రపంచ మోటార్‌సైకిల్ పరిశ్రమలో సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకోవడంలో భాగంగానే స్కూటర్ విపణిలోకి వెళ్లడం లేదని తెలుస్తోంది.

బజాజ్ చేతక్ స్కూటర్

కానీ, తాజాగా ఉన్న సమాచారం మేరకు, దేశీయ మరియు అంతర్జాతీయ విపణిలోని స్కూటర్ల మార్కెట్లో ఉన్న అవకాశాల దృష్ట్యా ఎట్టకేలకు ఆటోమేటిక్ స్కూటర్ల పరిశ్రమలోకి ప్రవేశించేందుకు బజాజ్ ఆటో సుముఖంగా ఉన్నట్లు తెలిసింది.

బజాజ్ చేతక్ స్కూటర్

బజాజ్ చేతక్ స్కూటర్ పూర్తి స్థాయిలో మార్కెట్లోకి విడుదలైతే, ప్రస్తుతం పర్ఫామెన్స్ మరియు క్లాసిక్ స్కూటర్ల సెగ్మెంట్లో ఉన్న హోండా యాక్టివా, పియాజియో వెస్పా, అప్రిలియా ఎస్ఆర్150 మరియు టీవీఎస్ ఎన్‌టార్క్125 వంటి స్కూటర్లకు గట్టి పోటీనివ్వడం ఖాయం.

బజాజ్ చేతక్ స్కూటర్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

భారతదేశపు అత్యంత ప్రజాదరణ కలిగిన పురాతణ స్కూటర్ బ్రాండ్ బజాజ్ చేతక్ పునరాగమనానికి సిద్దమైంది. బజాజ్ ఆటో తమ లెజెండరీ స్కూటర్ చేతక్ మోడల్‌ను రీలాంచ్ చేసేందుకు కసరత్తులు చేస్తోంది. క్లాసిక్ రెట్రో డిజైన్ శైలి మరియు మోడ్రన్ ఫీచర్లతో వస్తోన్న బజాజ్ చేతక్ కోసం అందరం ఎదురుచూడక తప్పదు.

Most Read Articles

Read more on: #బజాజ్
English summary
Read In Telugu: Bajaj Chetak Scooter To Make A Comeback — Launch Details Revealed
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X