Just In
- 8 hrs ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 11 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 13 hrs ago కారు ప్రియులకు గుడ్‌న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 17 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
Don't Miss
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Movies Paarijatha Parvam Review సునీల్, చైతన్య రావు క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే? పారిజాత పర్వం రివ్యూ
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
బెంట్లీ బెంట్యాగా వి8 విడుదల: ధర రూ. 3.78 కోట్లు
బెంట్లీ బెంట్యాగా వి8 లగ్జరీ కారు ఇండియన్ మార్కెట్లోకి విడుదలయ్యింది. బెంట్లీ మోటర్స్ ఇండియా విడుదల డేసిన వి8 వెర్షన్ బెంట్యాగా ఎస్యూవీ ప్రారంభ ధర రూ. 3.78 కోట్లు ఎక్స్-షోరూమ్ (ముంబాయ్)గా ఉంది.
బెంట్లీ బెంట్యాగా వి8 లగ్జరీ కారు ఇండియన్ మార్కెట్లోకి విడుదలయ్యింది. బెంట్లీ మోటర్స్ ఇండియా విడుదల డేసిన వి8 వెర్షన్ బెంట్యాగా ఎస్యూవీ ప్రారంభ ధర రూ. 3.78 కోట్లు ఎక్స్-షోరూమ్ (ముంబాయ్)గా ఉంది.
బెంట్లీ బెంట్యాగా లగ్జరీ ఎస్‌యూవీలో 4.0-లీటర్ సామర్థ్యం ఉన్న టుర్భోఛార్జ్‌డ్ వి8 పెట్రోల్ ఇంజన్ కలదు. 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 542బిహెచ్పి పవర్ మరియు 770ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.
బెంట్యాగా ఎస్‌యూవీలో పర్మినెంట్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ఉంది. ఇది ఇంజన్ ఉత్పత్తి చేసే టార్క్‌ను 40:60 నిష్పత్తిలో ఫ్రంట్ మరియు రియర్ వీల్స్‌కు సరఫరా చేస్తుంది. బెంట్యాగా గరిష్ట వేగం గంటకు 290కిలోమీటర్లు మరియు కేవలం 4 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
బెంట్యాగా వి8 ఎక్ట్సీరియర్ చూడటానికి అచ్చం డబ్ల్యూ12 వేరియంట్‌నే పోలి ఉంటుంది. వి8 వేరియంట్లో రెడ్-పెయింట్ గల ఫ్రంట్ బ్రేక్ కాలిపర్లు మరియు 21-అంగుళాల పరిమాణంలో ఉన్న అల్లాయ్ వీల్స్ స్టాండర్డ్‌గా వచ్చాయి. అయితే, కస్టమర్లు 20 లేదా 22 అంగుళాల అల్లాయ్ వీల్స్ కూడా ఎంచుకోవచ్చు. ఇవి మినహాయిస్తే బెంట్యాగా వి8 లో అప్డేటెడ్ ఫ్రంట్ గ్రిల్ మరియు టెయిల్-పైప్ డిజైన్ ఉన్నాయి.
బెంట్లీ బెంట్యాగా వి8 ఇంటీరియర్‌లో కలప మరియు లెథర్ ఫినిషింగ్‌లో ఉన్న స్టీరింగ్ వీల్, గ్లాస్ బ్లాక్ ఫైబర్ ఫినిషింగ్ డోర్లు, డ్యాష్‌బోర్డ్ మరియు సెంటర్ కన్సోల్ ఉన్నాయి. అంతే కాకుండా, హెడ్స్-అప్ డిస్ల్పే గల 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మరియు రియర్ ప్యాసింజర్ల ఎంటర్టైన్మెంట్ కోసం రిమూవబుల్ 12-అంగుళాల టాబ్లెట్ అందివ్వడం జరిగింది.
ఈ సందర్భంగా ఎక్స్‌క్లూజివ్ మోటార్స్ మేనేజింగ్ డైరక్టర్ సత్య బాగ్లా మాట్లాడుతూ, "లగ్జరీ వాహన పరిశ్రమలో బెంట్లీ వరల్డ్ లీడర్‌గా రాణిస్తోంది. విలాసవంతమైన వాహన పరిశ్రమకు బెంట్లీ ఎప్పటికప్పుడు ఒక కొత్త నిర్వచనమిస్తోందని తెలిపాడు." బెంట్లీ బెంట్యాగా వి8 చూడటానికి అచ్చం ఇతర మోడళ్లనే పోలి ఉంటుంది. కానీ, ఎక్ట్సీరియర్‌లో డిజైన్ పరంగా పలు మార్పులు సంతరించుకున్నాయి.
బెంట్లీ లగ్జరీ కారును కొనుగోలు చేయాలనుకునే ఔత్సాహికు కస్టమర్లకు బెంట్యాగా వి8 పరిష్కారం కానుంది. బెంట్లీ బెంట్యాగా వి8 విపణిలో ఉన్న రోల్స్ రాయిస్ కుల్లినన్ మరియు రేంజ్ రోవర్ ఎస్వి ఆటోబయోగ్రఫీ వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.