దేవుడా... రీ-రిజిస్ట్రేషన్ కోసం 60 లక్షలు ఖర్చు

పాండిచ్చేరిలో మొదటి రిజిస్టర్ అయిన బెంట్లీ కాంటినెంటల్ జిటి కారు రీ-రిజిస్ట్రేషన్ కోసం రూ. 60 లక్షలు చెల్లించాడు. ఇతర రాష్ట్రాల్లో రిజిస్టర్ అయిన వాహనాల మీద కేరళ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది.

By Anil Kumar

పాండిచ్చేరిలో మొదటి రిజిస్టర్ అయిన బెంట్లీ కాంటినెంటల్ జిటి కారు రీ-రిజిస్ట్రేషన్ కోసం రూ. 60 లక్షలు చెల్లించాడు. ఇతర రాష్ట్రాల్లో రిజిస్టర్ అయిన వాహనాల మీద కేరళ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. వేరే రాష్ట్రాల్లో రిజిస్టర్ అయిన వాహనాలు ఎక్కువ కాలం పాటు కేరళ తిరిగే వాటి కోసం ప్రత్యేకంగా ఆమ్నేస్టీ స్కీమ్ ప్రవేశపెట్టింది.

రీ-రిజిస్ట్రేషన్ కోసం 60 లక్షలు ఖర్చు

ఆమ్నేస్టీ స్కీమ్ ఏప్రిల్ 30, 2018 వరకు మాత్రమే వర్తిస్తుంది. మరియు ఇతర రాష్ట్రాల్లో రిజిస్టర్ అయిన వాహనాలు కేరళ రోడ్ల మీద పరుగులు పెడితే ఖచ్చితంగా రోడ్డు ట్యాక్స్ చెల్లించాల్సిందే. కేరళతో పాటు చాలా రాష్ట్రాల్లో లగ్జరీ కార్లను కొనుగోలు చేసే కస్టమర్లు తక్కువ ఖర్చుతో రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని కేంద్రపాలిత ప్రాంతం పాండించ్చేరిలో రిజిస్టర్ చేయించుకుంటారు.

రీ-రిజిస్ట్రేషన్ కోసం 60 లక్షలు ఖర్చు

ఇటీవల రోడ్ ట్యాక్స్ చెల్లించకుండా రోడ్ల మీద తిరిగే లగ్జరీ కార్లను కేరళ రాష్ట్ర మోటార్ వెహికల్ డిపార్టెమెంట్ అధిక సంఖ్యలో సీజ్ చేసింది. తాజాగా, కేరళకు చెందిన బెంట్లీ కాంటినెంటల్ జిటి కారును సీజ్ చేశారు. దీంతో కారు యజమాని సయ్యద్ నజీర్ సుమారుగా రూ. 60 లక్షలు చెల్లించి రీ-రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు కేరళ అధికారులు తెలిపారు.

రీ-రిజిస్ట్రేషన్ కోసం 60 లక్షలు ఖర్చు

సయ్యద్ నజీర్ అత్యంత విలాసవంతమైన మరియు ఖరీదైన బెంట్లీ కాంటినెంటల్ జిటి కారును పాండిచ్చేరిలో ఆయన భార్య పేరు మీదుగా రిజిస్ట్రేషన్ జరిపించాడు. ఇప్పుడు, పాండిచ్చేరి రిజిస్ట్రేషన్‌కు కాలం చెల్లడంతో ఆ కారు మొత్తం ధరలో 20 శాతాన్ని ట్యాక్స్‌గా వసూలు చేశారు. బెంట్లీ కాంటినెంటల్ జిటి మొత్తం ధర రూ. 3 కోట్లుగా ఉంది.

మొత్తానికి 60 లక్షలు చెల్లించిన తరువాత పాండిచ్చేరి ఆర్‌టిఓ కార్యాలయం నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ రావడంతో బెంట్లీ కాంటినెంటల్ జిటి కారుకు ఎట్టకేలకు కేరళ శాస్వత రిజిస్ట్రేషన్ ప్లేటు లభించింది.

రీ-రిజిస్ట్రేషన్ కోసం 60 లక్షలు ఖర్చు

ఇతర రాష్ట్రాల్లో రిజిస్టర్ అయిన కార్లు ఎక్కువ కాలం పాటు ఇతర రాష్ట్రాల్లో తిరిగితే ఎలాంటి పరిణామాలు ఉంటాయో తెలుసా...? రూల్స్ ప్రకారం, ఒక రాష్ట్రంలో రిజిస్టర్ అయిన కారు ఇతర రాష్ట్రాల్లో 11 నెలల కంటే ఎక్కువ కాలం తిరిగినట్లయితే ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో మళ్లీ ట్యాక్స్ చెల్లించి నూతన రిజిస్ట్రేషన్ నెంబర్ పొందాల్సి ఉంటుంది.

రీ-రిజిస్ట్రేషన్ కోసం 60 లక్షలు ఖర్చు

కేరళ, కర్ణాటక మరియు మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో లగ్జరీ కార్ల రిజిస్ట్రేషన్ ట్యాక్స్ రేట్లు అధికంగా ఉండటంతో కేంద్రపాలిత ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని ఆ ఇంటిల్లో నివాసం ఉన్నట్లుగా చూపించి రిజిస్టర్ చేయించుకుని తిరిగి తమ సొంత రాష్ట్రానికి తీసుకొచ్చేస్తారు. కానీ, ఇలా చేయడం అనధికారం.

రీ-రిజిస్ట్రేషన్ కోసం 60 లక్షలు ఖర్చు

ఇలాంటి అనధికారిక చర్యలకు పుల్‌స్టాప్ పెట్టేందుకు, కేరళ ప్రభుత్వం పాండిచ్చేరి రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లు ఉన్న వాహనాల మీద స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సుమారుగా రూ. 100 కోట్ల రుపాయల వరకు ట్యాక్స్ రూపంలో వసూలు చేయాలని లక్ష్యంగా ఉంది. పాండిచ్చేరి రిజిస్ట్రేషన్ ప్లేట్లతో కేరళలో తిరిగే లగ్జరీ వాహనాల సంఖ్య సుమారుగా 1500 నుండి 2000 ఉన్నట్లు మోటార్ వెహికల్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది.

రీ-రిజిస్ట్రేషన్ కోసం 60 లక్షలు ఖర్చు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

పాండిచ్చేరి రిజిస్ట్రేషన్ గల కార్ల నుండి కేరళ రాష్ట ప్రభుత్వం రోడ్ ట్యాక్స్ కలెక్ట్ చేయడం స్వాగతించదగిన విషయమనే చెప్పాలి. భవిష్యత్తులో ఇలాంటి అనధికారిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆయా రాష్ట్ర మోటార్ వెహికల్ శాఖలు సిద్దమవడం ఖాయం.

60 లక్షలు కడితేగానీ రోడ్డెక్కనివ్వలేదు

1. వెహికల్ నెంబర్ ప్లేట్ మీద IND అని ఎందుకు ఉంటుందో తెలుసా?

2.వివిధ రకాల రంగుల్లో ఉండే నెంబర్ ప్లేట్లు దేనికి సంకేతం?

3. హెల్మెట్ పెట్టుకోలేదని కోపంలో ఏం చేశాడో తెలుసా...?

4.ఒక్కసారి ఛార్జింగ్‌తో 1,000 కిమీలు ప్రయాణించే మహీంద్రా పినిన్ఫారినా కె350

5.ఏడు మంది ప్రాణాలను బలిగొన్న చిన్న తప్పిదం

Image Courtesy: Manoramaonline

Most Read Articles

English summary
Read In Telugu: Bentley Continental GT Owner Pays Rs 60 Lakh For Re-Registration
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X