బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ జిటి స్పోర్ట్ విడుదల: ధర, ఇంజన్, ఫీచర్లు మరియు ప్రత్యేకతలు

బిఎమ్‌డబ్ల్యూ ఇండియన్ మార్కెట్లోకి 3 సిరీస్ గ్రాన్ టురిస్మో బేస్ వేరియంట్ 320డి జిటి స్పోర్ట్ కారును లాంచ్ చేసింది. సరికొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ జిటి స్పోర్ట్ ప్రారంభ ధర రూ. 46.60 లక్షలు ఎక్స్-షోరూ

By Anil Kumar

బిఎమ్‌డబ్ల్యూ ఇండియన్ మార్కెట్లోకి 3 సిరీస్ గ్రాన్ టురిస్మో బేస్ వేరియంట్ 320డి జిటి స్పోర్ట్ కారును లాంచ్ చేసింది. సరికొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ జిటి స్పోర్ట్ ప్రారంభ ధర రూ. 46.60 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉంది.

బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ టురిస్మో స్పోర్ట్ విడుదల

బిఎమ్‌‌డబ్ల్యూ 3 సిరీస్ జిటి స్పోర్ట్ చూడటానికి అచ్చం లగ్జరీ లైన్ మరియు టాప్ ఎండ్ వేరియంట్ ఎమ్ స్పోర్ట్ తరహాలోనే ఉంటుంది. బిఎమ్‌‌డబ్ల్యూ 3 సిరీస్ జిటి స్పోర్ట్ ఫ్రంట్ డిజైన్‌లో శాటినైస్డ్ అల్యూమినియం ఫినిషింగ్ గల ఎయిర్ ఇంటేకర్ మరియు హై గ్లాస్ బ్లాక్ 9-స్లాట్ కిడ్నీ గ్రిల్ ఉన్నాయి. ఈ రెండింటిని కూడా ఎమ్ స్పోర్ట్ వేరియంట్ నుండి సేకరించారు.

బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ టురిస్మో స్పోర్ట్ విడుదల

కొత్తగా విడుదలైన బిఎమ్‌‌డబ్ల్యూ 3 సిరీస్ జిటి స్పోర్ట్ కారులో ఫ్రంట్ మరియు రియర్ డిజైన్‌లో హై గ్లాస్ బ్లాక్ ఎలిమెంట్లు ఉన్నాయి. ఫ్రంట్ డోర్ల అంచుల వద్ద బిఎమ్‌డబ్ల్యూ బ్రాండింగ్ గల అల్యూమినియం ప్లేట్లు మరియు బ్లాక్ క్రోమ్ ఫినిషింగ్‌‌లో ఉన్న టెయిల్ వైపు ఉన్నాయి. ఇంటీరియర్‌లో ఎర్రటి దారంతో కుట్టబడిన లెథర్ తొడుగు గల స్టీరింగ్ వీల్ ఉంది.

బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ టురిస్మో స్పోర్ట్ విడుదల

బిఎమ్‌‌డబ్ల్యూ 3 సిరీస్ జిటి స్పోర్ట్ వేరియంట్లో అడాప్టివ్ ఎల్ఈడీ హెడ్‌లైట్లు మరియు పలు డ్రైవింగ్ మోడ్స్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన అడాప్టివ్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి ఇందులో మిస్సయ్యాయి. జిసి స్పోర్ట్ వేరియంట్లో హై-రిజల్యూషన్ ఇంస్ట్రుమెంట్ డిస్ల్పే వచ్చింది.

బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ టురిస్మో స్పోర్ట్ విడుదల

బిఎమ్‌‌డబ్ల్యూ 3 సిరీస్ జిటి స్పోర్ట్ ఇంటీరియర్‌లో యాష్ గ్రెయిన్ ఫినిషింగ్ గల ఫైన్-వుడ్ సొబగులు లోహపు మేళవింపులతో ఎంతో చక్కగా ఉంది. సీట్ అప్‌హోల్‌స్ట్రేను రెడ్ హైలెట్స్ గల సెన్సాటెక్ బ్లాక్ మరియు సెన్సాటెక్ వెనెటో బీజీ ఛాయిస్‌లో ఎంచుకోవచ్చు.

బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ టురిస్మో స్పోర్ట్ విడుదల

18-అంగుళాల అల్లాయ్ వీల్స్ మీద పరుగులు పెట్టే బిఎమ్‌‌డబ్ల్యూ 3 సిరీస్ జిటి స్పోర్ట్ మూడు విభిన్న రంగుల్లో లభ్యమవుతుంది. అవి, అల్పైన్ వైట్, బ్ల్యాక్ సఫైర్ (మెటాలిక్) మరియు ఇంపీరియల్ బ్లూ బ్రిలియంట్ ఎఫెక్ట్ (మెటాలిక్).

బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ టురిస్మో స్పోర్ట్ విడుదల

సాంకేతికంగా బిఎమ్‌‌డబ్ల్యూ 3 సిరీస్ జిటి స్పోర్ట్ వేరియంట్లో ఉన్న 2-లీటర్ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల టర్భోఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ గరిష్టంగా 190బిహెచ్‌పి పవర్ మరియు 400ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ టురిస్మో స్పోర్ట్ విడుదల

ఇంజన్ ఉత్పత్తి చేసే పవర్ మరియు టార్క్ 8-స్పీడ్ స్టెప్‌ట్రోనిక్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా వెనుక చక్రాలకు చేరుతుంది. జిటి స్పోర్ట్ కేవలం 7.7 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ టురిస్మో స్పోర్ట్ విడుదల

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

బిఎమ్‌డబ్ల్యూ తమ 3 సిరీస్ గ్రాన్ టురిస్మో లగ్జరీ సెడాన్ కారును స్పోర్ట్ అనే ఎంట్రీ లెవల్ వేరియంట్లో లాంచ్ చేసింది. 320డి స్పోర్ట్ వేరియంట్ ఇదే శ్రేణిలో ఉన్న లగ్జరీ లైన్ మరియు ఎమ్ స్పోర్ట్ వేరియంట్లతో సహా లభ్యమవుతుంది. డిజైన్ మరియు ఇంజన్ స్పెసిఫికేషన్స్ పరంగా మూడు వేరియంట్లు ఒక్కటే కానీ, వేరియంట్ల ఆధాంగా కొన్ని ఫీచర్లు వచ్చి ఉండవు. బిఎమ్‌‌డబ్ల్యూ 3 సిరీస్ జిటి స్పోర్ట్ దేశవ్యాప్తంగా ఉన్న బిఎమ్‌డబ్ల్యూ అధీకృత డీలర్ల వద్ద లభ్యమవుతోంది.

Most Read Articles

English summary
Read In Telugu: BMW 3 Series Gran Turismo Sport Launched In India; Priced At Rs 46.60 Lakh
Story first published: Friday, July 13, 2018, 10:03 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X