ఆటో ఎక్స్‌పో 2018: బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ జిటి విడుదల చేసిన సచిన్

ఆటో ఎక్స్‌పో 2018: బిఎమ్‌డబ్ల్యూ ఇండియా విభాగం 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పో వేదికగా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్క్ సమక్షంలో తొలి బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ గ్రాన్ టురిస్మో లగ్జరీ సెడాన్ కారును విడుదల

By Anil

Recommended Video

Auto Expo 2018: Tata Tamo Racemo & Racemo+- Details, Specifications - DriveSpark

ఆటో ఎక్స్‌పో 2018: బిఎమ్‌డబ్ల్యూ ఇండియా విభాగం 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పో వేదికగా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్క్ సమక్షంలో తొలి బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ గ్రాన్ టురిస్మో లగ్జరీ సెడాన్ కారును విడుదల చేసింది. సరికొత్త బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ జిటి ప్రారంభ ధర రూ. 58.9 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉన్నట్లు బిఎమ్‌డబ్ల్యూ ప్రతినిధులు వెల్లిడించారు.

బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ గ్రాన్ టురిస్మో వేరియంట్లు, ధరలు, ఫీచర్లు, ప్రత్యేకతలు మరియు ఫోటోల కోసం...

బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ జిటి

ఈ సరికొత్త బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ గ్రాన్ టురిస్మో ఇండియన్ మార్కెట్లో ఇది వరకు ఉన్న 5 సిరీస్ జిటి స్థానాన్ని భర్తీ చేయనుంది. భారత్‌లో ఈ మోడల్ కేవలం 630ఐ స్పోర్ట్‌లైన్ వేరియంట్లో మాత్రమే లభ్యమవుతోంది. ఇది విపణిలో ఉన్న మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్‌కు గట్టి పోటీనిస్తుంది.

బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ జిటి

బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ గ్రాన్‌ టురిస్మొ ఇంజన్ స్పెసిఫికేషన్స్

సాంకేతికంగా బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ గ్రాన్‌ టురిస్మొ లగ్జరీ సెడాన్ కారులో 2.0-లీటర్ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల టుర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది 5,000-6,500ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 254బిహెచ్‌పి పవర్ మరియు 1,550-4,400ఆర్‌పిఎమ్ వద్ద 400ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ జిటి

బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ గ్రాన్‌ టురిస్మొ స్పీడ్

బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ జిటి కేవలం 6.3 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మరియు దీని గరిష్ట వేగం గంటకు 250కిలోమీటర్లుగా ఉంది.

బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ జిటి

బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ గ్రాన్‌ టురిస్మొ కొలతలు

బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ గ్రాన్‌ టురిస్మొ పొడవు 5,091ఎమ్ఎమ్, వెడల్పు 1,902ఎమ్ఎమ్, ఎత్తు 1,538ఎమ్ఎమ్ మరియు వీల్ బేస్ 3,070ఎమ్ఎమ్‌గా ఉంది. 600-లీటర్ల లగేజ్ స్పేస్ కలదు, అవసరాన్ని బట్టి 1800 లీటర్లకు కూడా పెంచుకోవచ్చు.

బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ జిటి

బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ గ్రాన్‌ టురిస్మొ డిజైన్

బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ గ్రాన్‌ టురిస్మొ 5సిరీస్ నుండి ఎన్నో డిజైన్ అంశాలను పొందింది. అయితే, 5 సిరీస్ మరియు 6 సిరీస్‌కు మధ్య తేడా ఏముందంటే... 6 సిరీస్ కారులో కూపే తరహా డిజైన్, డిక్కీ చివరి అంచు వరకు ఉన్న రూఫ్ ఉన్నాయి. అడాప్టివ్ ఎల్ఇడి లైట్లను కూడా 5 సిరీస్ నుండి పొందింది.

బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ జిటి

బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ గ్రాన్‌ టురిస్మొ ఇంటీరియర్

బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ గ్రాన్‌ టురిస్మొ ఇంటీరియర్‌లో లెథర్ అప్‌హోల్‌స్ట్రే, గెస్ట్చర్ కంట్రోల్స్ గల 10.25-అంగుళాల పరిమాణం ఉన్న టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మరియు సరికొత్త 6 సిరీస్ జిటి హెడ్స్-అప్ డిస్ల్పే కలదు. ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఎల్ఇడి మూడ్ లైటింగ్ బోయర్స్ అండ్ విల్కిన్స్ డైమండ్ వారి 1,400 వాట్ 16 స్పీకర్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ ఉన్నాయి.

బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ జిటి

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

బిఎమ్‌డబ్ల్యూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 5 సిరీస్ జిటి స్థానంలోకి 6 సిరీస్ జిటి కారును ప్రవేశపెట్టింది. ఏదేమైనప్పటికీ 5-సిరీస్ కంటే 6-సిరీస్‌లో బిఎమ్‌డబ్ల్యూ వారి పనితనం అద్భుతంగా ఉంది. కాబట్టి 5 సిరీస్ కస్టమర్లు ఎలాంటి తడబాటు లేకుండా 6 సిరీస్‌ను ఎంచుకోవచ్చు.

Most Read Articles

English summary
Read In Telugu: Auto Expo 2018: Sachin Launches BMW 6 Series GT In India - Priced At Rs 58.9 Lakhs
Story first published: Friday, February 9, 2018, 12:20 [IST]
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X