బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 ఎస్‌డ్రైవ్20డి ఎమ్ స్పోర్ట్ విడుదల

బిఎమ్‌డబ్ల్యూ ఇండియా విపణిలోకి సరికొత్త ఎక్స్1 ఎస్‌డ్రైవ్ 20డి మోడల్ యొక్క ఎమ్-స్పోర్ట్ వేరియంట్‌ను లాంచ్ చేసింది. బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 ఎస్‌‌డ్రైవ్20డి ఎమ్-స్పోర్ట్ ధర రూ. 41.50 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢి

By Anil Kumar

బిఎమ్‌డబ్ల్యూ ఇండియా విపణిలోకి సరికొత్త ఎక్స్1 ఎస్‌డ్రైవ్ 20డి మోడల్ యొక్క ఎమ్-స్పోర్ట్ వేరియంట్‌ను లాంచ్ చేసింది. బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 ఎస్‌‌డ్రైవ్20డి ఎమ్-స్పోర్ట్ ధర రూ. 41.50 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 ఎస్‌డ్రైవ్20డి ఎమ్ స్పోర్ట్

ఎమ్-స్పోర్ట్ వేరియంట్ ద్వారా ఎక్స్1 ఎస్‌యూవీ ఇప్పుడు ఎమ్ ఏరోడైనమిక్ ప్యాకేజీలో లభ్యమవుతోంది. బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 ఎమ్-ప్యాకేజీలో ఫ్రంట్ బంపర్‌లోని పెద్ద పెద్ద ఎయిర్ వెంట్స్ మరియు ఇంటిగ్రేటెడ్ డిఫ్యూజర్ గల రియర్ బంపర్ ఉన్నాయి.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 ఎస్‌డ్రైవ్20డి ఎమ్ స్పోర్ట్

ఎక్స్1 ఎమ్ స్పోర్ట్ వేరియంట్లో సైడ్ స్కర్ట్స్, చక్రాల మీద బాడీ కలర్ క్లాడింగ్, డోర్ల మీద్ ఎమ్- బ్రాండింగ్ వంటి అదనపు యాక్ససరీలు ఉన్నాయి. అంతే కాకుండా ఎక్స్1 ఎమ్-స్పోర్ట్ ముందు వైపున గ్లాస్ బ్లాక్ స్లాట్లు గల సిగ్నేచేర్ కిడ్నీ గ్రిల్ ఉంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 ఎస్‌డ్రైవ్20డి ఎమ్ స్పోర్ట్

అదనపు ఫీచర్లతో పాటు బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 ఎమ్-స్పోర్ట్ వేరియంట్లో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, పగటి పూట వెలిగే ఎల్ఈడీ లైట్లు మరియు 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ వంటి కామన్ ఫీచర్లు యథావిధిగా వచ్చాయి.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 ఎస్‌డ్రైవ్20డి ఎమ్ స్పోర్ట్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 ఎస్‌డ్రైవ్20డి ఎమ్-స్పోర్ట్ ఇంటీరియర్‌లో టు-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఆంబియంట్ లైటింగ్, మల్టీ-ఫంక్షన్ స్పోర్ట్స్ లెథర్ స్టీరింగ్ వీల్, హెడ్స్ అప్ డిస్ల్పే మరియు పానరోమిక్ సన్ రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 ఎస్‌డ్రైవ్20డి ఎమ్ స్పోర్ట్

ఎక్స్1 ఎస్‌యూవీ లభించే అన్ని వేరియంట్లలో సాధారణంగా వచ్చే, ఐడ్రైవ్ న్యావిగేషన్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు బిఎమ్‌డబ్ల్యూ అప్లికేషన్లతో వచ్చే 6.5-అంగుళాల పరిమాణంలో గల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఎమ్-స్పోర్ట్ వేరియంట్లో కూడా వచ్చింది.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 ఎస్‌డ్రైవ్20డి ఎమ్ స్పోర్ట్

సాంకేతికంగా, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 ఎస్‌డ్రైవ్20డి ఎమ్-స్పోర్ట్ వేరియంట్లో 2.0-లీటర్ సామర్థ్యం గల నాలుగు సిలిండర్ల టుర్బోఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ కలదు. 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుంధానం గల ఇది గరిష్టంగా 187బిహెచ్‌పి పవర్ మరియు 400ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. పెడల్ షిఫ్ట మరియు లాంచ్ కంట్రోల్స్ స్టాండర్డ్‌‌గా వచ్చాయి.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 ఎస్‌డ్రైవ్20డి ఎమ్ స్పోర్ట్

సేఫ్టీ పరంగా బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 ఎంట్రీ లెవల్ లగ్జరీ ఎస్‌యూవీలో ఆరు ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, బ్రేక్ అసిస్ట, డైనమిక్ స్టెబిలిటి కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, ఐఎస్ఒఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్ మరియు రన్-ఫ్లాట్ టైర్లు ఉన్నాయి.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 ఎస్‌డ్రైవ్20డి ఎమ్ స్పోర్ట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

జర్మనీ లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం బిఎమ్‌డబ్ల్యూ, ఇండియన్ ఎంట్రీ లెవల్ లగ్జరీ ఎస్‌యూవీల సెగ్మెంట్లో తన అధిపత్యాన్ని పెంచుకునేందుకు ఎక్స్ మోడల్‌లో ఎమ్-స్పోర్ట్ ప్యాకేజీని పరిచయం చేసింది. ఇది విపణిలో ఉన్న మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎ, ఆడి క్యూ3 మరియు వోల్వో ఎక్స్‌సి40 వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

Most Read Articles

English summary
Read In Telugu: BMW X1 sDrive20d M-Sport Launched In India; Priced At Rs 41.50 Lakh
Story first published: Wednesday, August 1, 2018, 10:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X