ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్

By Anil Kumar

ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వం

ప్రతిపాదించింది. తాజాగా అందిన రిపోర్ట్స్ మేరకు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో ప్రతి మూడు

కిలోమీటర్లకు ఒకటి చొప్పున మరియు జాతీయ రహదారుల్లో ప్రతి 50కిలోమీటర్లకు ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు.

ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్

ఈ ప్రతిపాదనను తొలుత పది లక్షల పైబడి జనాభా ఉన్న నగరాలు మరియు అన్ని మెట్రో నగరాల్లో అమలు చేయడానికి

కేంద్రం సిద్దమవుతోంది. అంతే కాకుండా, ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు అవసరమయ్యేభూమిని పురపాలక అధికారులకు ఇచ్చేవారికి పలు రకలా ప్రోత్సాహకాలను ఇవ్వనుంది.

ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్

ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లను విడతల వారీగా ఏర్పాటు చేయనున్నారు. రానున్ను మూడు నుండి ఐదేళ్లలోఛార్జింగ్ స్టేషన్లు విరివిగా విస్తరించనున్నారు. నగర పరిధిలో ప్రతి మూడు కిలోమీటర్లకు ఒకటి చొప్పునఏర్పాటు చేస్తున్న ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లలో రెండు హై-ఛార్జ్ పాయింట్లు మరియు ఒక ఫాస్ట్-ఛార్జ్పాయింట్ ఉంటుంది.

ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్

మొత్తం మీద 30,000 స్లో-ఛార్జింగ్ పాయింట్లు మరియు 15,000 సంఖ్యలో ఫాస్ట్-ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ కార్యదర్శి కథనం మేరకు, "ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుచేసేందుకు పురపాలక మరియు విద్యుత్ శాఖ అధికారులు భూమిని సేకరించి, అందులో దీర్ఘ-కాలం పాటు ఛార్జింగ్స్టేషన్లను నిర్వహించేలా కంపెనీలకు లీజుకు ఇవ్వనున్నారు.

ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్

ఎన్టీపీసి, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ మరియు ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వంటి కంపెనీలు ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు సిద్దమయ్యాయి. ఎన్టీపీసి ఇప్పటికే మహారాష్ట్రలో ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తోంది.

ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్

పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఇటీవల ఎల్ అండ్ టీ మెట్రో రైల్(హైదారాబాద్) లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుంకుంది. ఈఒప్పందం మేరకు హైదరాబాద్ మెట్రో స్టేషన్లకు సమీపంలో ఎలక్ట్రిక్ కార్లు మరియు త్రీ వీలర్స్, టూ వీలర్స్కోసం ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది.

ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

దేశీయంగా ఎలక్ట్రిక్ కార్ల అభివృద్ది, తయారీ మరియు విక్రయాలను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం ఎన్నో

కార్యక్రమాలను చేపడుతోంది. ఈ మధ్యనే ఎలక్ట్రిక్ కార్లను తక్కువ ధరలో అందించేందుకు ఎలక్ట్రిక్ బ్యాటరీలమీద జీఎస్టీ రేట్లను తగ్గించింది. అదే విధంగా, రోడ్ల మీద తిరిగే పెట్రోల్ మరియు డీజల్ కార్లతో పోల్చుకుంటేఎలక్ట్రిక్ వాహనాలు విభిన్నంగా ఉండేందుకు గ్రీన్ నెంబర్ ప్లేట్ విధానం అమలు చేసింది. అంతే కాకుండా,ఎలక్ట్రిక్ కార్లు, బస్సులు, త్రీ వీలర్లు మరియు టూ వీలర్లను కొనుగోలు చేసే కస్టమర్లకు30 వేల నుండి 2.5 లక్షల వరకు రాయితీ అందిస్తున్నట్లు ప్రకటించింది.

Source: Economic Times

Most Read Articles

English summary
Read In Telugu: Electric Car Charging Stations To Be Set Up Every ThreeKilometres In India —New Government Proposal
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X