జూలై 2018 కార్ సేల్స్ రిపోర్ట్: టాటాకు బాగా కలిసొచ్చింది

జూలై 2018 కార్ల సేల్స్ రిపోర్ట్ వచ్చేసింది. దేశీయంగా ఉన్న అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయరీ సంస్థల గత నెలలో కాస్త ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. అగ్రగామి దిగ్గజం మారుతి విక్రయాలు కాస్త తగ్గుముఖంపట్టినప్పటిక

By Anil Kumar

జూలై 2018 కార్ల సేల్స్ రిపోర్ట్ వచ్చేసింది. దేశీయంగా ఉన్న అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయరీ సంస్థల గత నెలలో కాస్త ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. అగ్రగామి దిగ్గజం మారుతి విక్రయాలు కాస్త తగ్గుముఖంపట్టినప్పటికీ, మొదటి స్థానంలో నిలిచింది. అయతే, టాటా మోటార్స్ అనూహ్యంగా భారీ సేల్స్ సాధించింది.

కంపెనీల వారీగా సేల్స్ వివరాలు మరియు బెస్ట్ సెల్లింగ్ కార్లు ఏవేవి ఉన్నాయో చూద్దాం రండి...

జూలై 2018 కార్ సేల్స్ రిపోర్ట్: టాటాకు బాగా కలిసొచ్చింది

మారుతి సుజుకి

ఆసియా యొక్క మూడవ అతి పెద్ద మరియు భారతదేశపు అతి పెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ జూలై 2018 నెల విక్రయాల్లో స్వల్ప ఒడిదుడులకు గురయ్యింది. గత ఏడాది ఇదే నెలలో విక్రయాలతో పోల్చితే ఈ సారి ఫలితాలు కాస్త తగ్గుముఖం పట్టాయి.

జూలై 2018 కార్ సేల్స్ రిపోర్ట్: టాటాకు బాగా కలిసొచ్చింది

మారుతి అతి త్వరలో సియాజ్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ విడుదల చేస్తుండటంతో, ప్రస్తుతం ఉన్న సియాజ్ సేల్స్ ఆశించిన విధంగా నమోదు కాలేదు, దీంతో మారుతి మొత్తం విక్రయాల మీద ప్రభావం పడినట్లు తెలిసింది. జూలై 2018లో మారుతి 1,64,639 కార్లను విక్రయించింది.

జూలై 2017 సేల్స్: 1,65,346

వృద్ది శాతం: -0.6%

జూలై 2018 కార్ సేల్స్ రిపోర్ట్: టాటాకు బాగా కలిసొచ్చింది

హ్యుందాయ్

హ్యుందాయ్ కార్స్ ఇండియా లిమిటెడ్ జూలై 2018 విక్రయాలతో రెండవ స్థానాన్ని పధిలం చేసుకుంది. కొరియా దిగ్గజం హ్యుందాయ్ మోటార్స్ గత కొన్నేళ్ల నుండి డీలర్ల సామ్రజ్యాన్ని విస్తరించుకోవడం మరియు కస్టమర్ల నుండి మంచి పాపులారటీ దక్కించుకోవడంలో కంపెనీ బాగా వృద్ది చెందింది. హ్యుందాయ్ ఇండియా విపణిలో ఉన్న గ్రాండ్ ఐ10, న్యూ ఎలైట్ ఐ20, క్రెటా ఫేస్‌లిఫ్ట్ మరియు వెర్నా వంటి మోడళ్లకు అత్యధిక విక్రయాలు సాధించిపెట్టాయి.

జూలై 2018 కార్ సేల్స్ రిపోర్ట్: టాటాకు బాగా కలిసొచ్చింది

హ్యుందాయ్ ఇండియా జూలై 2018లో 43,481 కార్లను విక్రయించింది. సింహభాగంలో ఉన్న మారుతి సుజుకితో పోల్చితో రెండింటి మధ్య విపరీతమైన వ్యత్యాసం ఉంది. అయితే, హ్యుందాయ్ మోటార్స్ నెల వారీ విక్రయాలతో రెండింటి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది.

జూలై 2017 సేల్స్: 43,007 యూనిట్లు

వృద్ది శాతం: +1.1%

జూలై 2018 కార్ సేల్స్ రిపోర్ట్: టాటాకు బాగా కలిసొచ్చింది

మహీంద్రా

ఎస్‌యూవీ వాహనాల తయారీ సంస్థగా పేరుగాంచిన దేశీయ అగ్రగామి దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా జూలై 2018 సేల్స్ కొద్ది వరకు తగ్గాయి. ప్రస్తుతం, మహీంద్రా ఇండియా లైనప్‌లో ఉన్న మోడళ్లు ఆశించిన సేల్స్ సాధించలేకపోతున్నాయి. దీంతో ఈ ఏడాది చివరి నాటికి మూడు కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టేందుకు సిద్దమైంది. అందులో, మరాజొ ఎమ్‌పీవీ, ఎస్201 కాంపాక్ట్ ఎస్‌యూవీ మరియు ఎక్స్‌యూవీ700 ప్రీమియం ఎస్‌యూవీ వంటి మోడళ్లు ఉన్నాయి.

జూలై 2018 కార్ సేల్స్ రిపోర్ట్: టాటాకు బాగా కలిసొచ్చింది

మహీంద్రా అండ్ మహంద్రా జూలై 2018లో కమర్షియల్ వాహనాలతో పాటు దేశీయంగా 44,605 యూనిట్లను విక్రయించింది. వాణిజ్య వాహనాల సేల్స్ పెరిగినప్పటికీ, ప్యాసింజర్ వాహనాల సేల్స్ తగ్గుముఖం పట్టాయి.

జూలై 2017 సేల్స్: 21,034

వృద్ది శాతం: +12%

జూలై 2018 కార్ సేల్స్ రిపోర్ట్: టాటాకు బాగా కలిసొచ్చింది

హోండా కార్స్ ఇండియా

జపాన్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం హోండా మోటార్స్ ఇక మీదట ఇండియన్ మార్కెట్లోకి ప్రతి ఏడాది పలు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టేందుకు సిద్దమైంది. ప్రత్యేకించి కాంపాక్ట్ సెడాన్ మరియు కాంపాక్ట్ ఎస్‌యూవీలను తీసుకురానుంది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన 2018 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదికలో ఆవిష్కరించిన సివిర్, సిఆర్-వి మరియు హెచ్‌ఆర్-వి మోడళ్లను మరియు కొత్త తరం హోండా బ్రియో మోడళ్లను భారత్‌ కోసం ఖరారు చేసింది.

జూలై 2018 కార్ సేల్స్ రిపోర్ట్: టాటాకు బాగా కలిసొచ్చింది

హోండా మోటార్స్ జూలై 2018 నెలలో 18,970 యూనిట్లను విక్రయించింది. మొత్తం విక్రయాల్లో హోండా అమేజ్ వాటా ఎక్కువగా నమోదైంది. ఇటీవల విడుదలైన హోండా అమేజ్ గత రెండు నెలలుగా భారీ విజయాన్ని అందుకుంది. కేవలం జూలై 2018లో 10,180 యూనిట్ల అమేజ్ కార్లు అమ్ముడయ్యాయి.

జూలై 2017 సేల్స్: 17,085

వృద్ది శాతం: +17%

జూలై 2018 కార్ సేల్స్ రిపోర్ట్: టాటాకు బాగా కలిసొచ్చింది

టాటా మోటార్స్

దేశీయ అగ్రగామి వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ జూలై 2018లో ఇటు ప్యాసింజర్ కార్ సేల్స్, అటు కమర్షియల్ వెహికల్ సేల్స్ రెండు విభాగాల్లో అత్యుత్తమ ఫలితాలు కనబరిచింది. ఆసియాలో అతి పెద్ద మరియు ప్రపంచ వ్యాప్తంగా 17 వ అతి పెద్ద ప్యాసింజర్ కార్ల కంపెనీ టాటా మోటార్స్ గత రెండేళ్లలో విడుదల చేసిన టియాగో, టిగోర్, హెక్సా మరియు టాటా నెక్సాన్ వంటి మోడళ్లకు మంచి విక్రయాలు సాధిస్తోంది.

జూలై 2018 కార్ సేల్స్ రిపోర్ట్: టాటాకు బాగా కలిసొచ్చింది

టాటా మోటార్స్ గత జూలై 2018లో 17,019 యూనిట్ల ప్యాసింజర్ కార్లను ఇండియన్ మార్కెట్లో విక్రయించింది. రానున్న రోజుల్లో మరికొన్ని కొత్త ఉత్పత్తులను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అతి త్వరలో టాటా హ్యారియర్ 5 మరియు 7-సీటర్ ఎస్‌యూవీ విడుదలకు ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.

జూలై 2017 సేల్స్: 14,637

వృద్ది శాతం: +14%

జూలై 2018 కార్ సేల్స్ రిపోర్ట్: టాటాకు బాగా కలిసొచ్చింది

టయోటా మోటార్స్

టయోటా కిర్లోస్కర్ మోటార్ సేల్స్ విషయంలో గత జూలై 2018లో మంచి ఫలితాలే కనబరిచింది. ఇన్నోవా క్రిస్టా ఎమ్‌పీవీ కంపెనీకి అత్యధిక విక్రయాలు జరిపింది. వ్యక్తి గత మరియు అద్దె కార్ల అవసరాలకు టయోటా ఇన్నోవా క్రిస్టా ఎమ్‌పీవీ బాగా ప్రాచుర్యం పొందింది. దీని తర్వాత ఫార్చ్యూనర్ ప్రీమియం ఎస్‌యూవీ మరియు ఎటియోస్ లివా హ్యాచ్‌బ్యాక్ కార్లు వాటి పరిధి మేర విజయాన్ని అందుకున్నాయి.

జూలై 2018 కార్ సేల్స్ రిపోర్ట్: టాటాకు బాగా కలిసొచ్చింది

జూలై 2018లో టయోటా కిర్లోస్కర్ మొత్తం 13,677 యూనిట్లను విక్రయించింది. కంపెనీ చరిత్రలో ఇదే అత్యధికం. చివరి నెల విక్రయాలో టయోటా వృద్ది రేటు గణనీయంగా పెరిగిపోయింది.

జూలై 2017 సేల్స్: 8,754

వృద్ది రేటు: +36%

జూలై 2018 కార్ సేల్స్ రిపోర్ట్: టాటాకు బాగా కలిసొచ్చింది

ఫోర్డ్ ఇండియా

జూలై 2018లో ఫోర్డ్ ఇండియా సేల్స్ తగ్గుముఖం పట్టాయి. ఏదేమైనప్పటికీ, ఫోర్డ్ ఇటీవల విడుదల చేసిన ఫిగో ఆధారిత ఫ్రీస్టైల్ క్రాసోవర్ మరియు ఇకోస్పోర్ట్ ఎస్ మోడళ్లు మంచి ఫలితాలు సాధించాయి. ఫోర్డ్ పరిచయం చేసిన 1.0-లీటర్ ఇంజన్ మోడళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది.

జూలై 2018 కార్ సేల్స్ రిపోర్ట్: టాటాకు బాగా కలిసొచ్చింది

ఫోర్డ్ ఇండియా గడిచిన జూలై 2018లో ఎగుమతులు మినహా కేవలం దేశీయ విపణిలోనే 7,816 కార్లను విక్రయించింది. అయితే, గత ఏడాది గణాంకాలతో పోల్చితే ఫోర్డ్ కార్ల విక్రయాలు స్వల్పంగా తగ్గాయి.

జూలై 2017 సేల్స్: 8,418

వృద్ది రేటు: -7.5%

జూలై 2018 కార్ సేల్స్ రిపోర్ట్: టాటాకు బాగా కలిసొచ్చింది

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

జూలై 2018 సేల్స్ రిపోర్ట్ పరిశీలిస్తే, కార్ల కంపెనీలు విక్రయాల పరంగా స్వల్ప ఒడిదొడుకు ఎదుర్కొన్నాయి. ఇందుకు ప్రదానం కారణం, జీఎస్టీ అమలు అని చెప్పవచ్చు. కొన్ని కంపెనీలు జీఎస్టీ ప్రభావాన్ని ఎదుర్కోగలిగినప్పటికీ, కొన్నింటి మీద దీని ప్రభావం ఎక్కుగానే ఉంది. గత ఏడాది జూలైతో పోల్చుకుంటే మారుతి సుజుకి మరియు ఫోర్డ్ ఇండియా సేల్స్ తగ్గుముఖంపట్టగా, కొత్త మోడళ్లను ప్రవేశపెట్టిన టాటా, హోండా మరియు టయోటా వృద్ది రేటు గణనీయంగా పెరిగింది.

Most Read Articles

English summary
Read In Telugu: Car Sales Report July 2018: Maruti Goes Down In Sales But Still Leads The Way
Story first published: Saturday, August 4, 2018, 14:25 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X