Just In
- 5 hrs ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 6 hrs ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 7 hrs ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 8 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- News జగన్ సంచలనం..వైఎస్ భారతికి కీలక బాధ్యతలు
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్‌పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Movies విడాకులు దిశగా మరో స్టార్ కపుల్.. ఇండస్ట్రీలో షాకింగ్‌గా..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
లీటర్‌కు 25కిమీల కంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చే 14 కార్లు
ప్రతి ఒక్కరి లైఫ్‌లో కారు కొనాలనే ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది. అన్నీ అనుకూలిస్తే, కొందరు అనుకున్నతడువుగా కొనేస్తారు. మరికొందరు అదను, అవకాశాల కోసం ఎదురు చూస్తారు. ఏదేమైనప్పటికీ ఇండియాలో కారు కొనాలనే ఆలోచన
ప్రతి ఒక్కరి లైఫ్‌లో కారు కొనాలనే ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది. అన్నీ అనుకూలిస్తే, కొందరు అనుకున్నతడువుగా కొనేస్తారు. మరికొందరు అదను, అవకాశాల కోసం ఎదురు చూస్తారు. ఏదేమైనప్పటికీ ఇండియాలో కారు కొనాలనే ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరిలో మైండ్‌లో మైలేజ్ ప్రధాన అంశం అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఏ కారు కొన్నా... మైలేజ్ ఇంపార్టెంట్ కాబట్టి, బడ్జెట్ ధరలో లీటరుకు 25 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్ల గురించి డ్రైవ్స్పార్క్ తెలుగు ప్రత్యేక కథనం.
14. రెనో క్విడ్
ఫ్రెంచ్ దిగ్గజం రెనో ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసిన క్విడ్ హ్యాచ్‌బ్యాక్ ఈ జాబితాలో 14 వ స్థానంలో నిలిచింది. రెనో క్విడ్ 800సీసీ పెట్రోల్ వేరియంట్ లీటరుకు 25.17కిమీల మైలేజ్ ఇస్తుంది.
- పెట్రోల్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 2.79 లక్షలు.
- డీజల్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 5.65 లక్షలు.
- డీజల్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 11.2 లక్షలు
- డీజల్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 6.29 లక్షలు
- డీజల్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 6.19 లక్షలు
- డీజల్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 6.38 లక్షలు
- డీజల్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 7.44 లక్షలు
- డీజల్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 6.7 లక్షలు
- డీజల్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 4.81 లక్షలు
- డీజల్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 6.63 లక్షలు
- డీజల్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 6.57 లక్షలు
- డీజల్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 5.99 లక్షలు
- డీజల్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 9.71 లక్షలు.
- ఆల్టో సీఎన్‌జి వేరియంట్ ప్రారంభ ధర రూ. 3.86 లక్షలు గమనిక: అన్ని మైలేజ్ వివరాలు ఆయా కంపెనీలు ఏఆర్ఏఐకి సమర్పించిన వివరాల ఆధారంగా ఇవ్వబడ్డాయి. మరియు ధరలు వివిధ పట్టణాలు, డీలర్లు మరియు వేరియంట్ల ఆధారంగా వ్యత్యాసం ఉండవచ్చు.
13. మహీంద్రా కెయువి100
మహీంద్రా అండ్ మహీంద్రా స్మాల్ క్రాసోవర్ ఎస్యూవీ సెగ్మెంట్లోకి లాంచ్ చేసిన కెయువి100 లోని 1.2-లీటర్ డీజల్ వేరియంట్ లీటరుకు 25.32కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇది పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లో కూడా లభ్యమవుతోంది.
12. హోండా సిటీ
లీటరుకు 25కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజ్ కార్ల జాబితాలో మిడ్ సైజ్ సెడాన్ సెగ్మెంట్ నుండి కేవలం హోండా సిటీ మాత్రమే చోటు దక్కించుకుంది. హోండా సిటీలోని 1.5-లీటర్ డీజల్ వేరియంట్ లీటరు 25.6కిమీల మైలేజ్ ఇస్తుంది. మరియు ఈ వేరియంట్ ప్రారంభ ధర రూ. 11.2 లక్షలుగా ఉంది.
11. ఫోర్డో ఫిగో ఆస్పైర్
ఫోర్డ్ ఫిగో ఆస్పైర్ కాంపాక్ట్ సెడాన్ లోని 1.5-లీటర్ డీజల్ వేరియంట్ లీటరుకు 25.83కిమీల మైలేజ్‌నిస్తుంది. ఫోర్డ్ ఇండియా అతి త్వరలో దీనిని న్యూ జనరేషన్లో భారీ మార్పులు చేర్పులతో లాంచ్ చేయనుంది.
10. ఫోర్డ్ ఫిగో
ఫోర్డ్ ఇండియా తమ ఫిగో హ్యాచ్‌బ్యాక్ కారులో కూడా అదే 1.5-లీటర్ డీజల్ యూనిట్ అందించింది. ఇది లీటరుకు 25.83 కిమీల మైలేజ్ ఇవ్వగలదు. ఫోర్డ్ ఇండియా ఫిగో హ్యాచ్‌బ్యాక్ కారును కూడా అతి త్వరలో అప్డేటెడ్ వెర్షన్లో విడుదల చేయనుంది.
9. మారుతి సుజుకి ఇగ్నిస్
మారుతి సుజుకి గత ఏడాది ప్రారంభంలో విడుదల చేసిన ఇగ్నిస్ క్రాసోవర్ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్లో లభ్యమవుతోంది. ఇందులోని 1.2-లీటర్ డీజల్ ఇంజన్ లీటరుకు 27కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.
8. హోండా జాజ్
హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ విక్రయిస్తున్న జాజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లోని 1.5-లీటర్ డీజల్ వేరియంట్ లీటరుకు 27.3కిమీల మైలేజ్‌తో 8 వ స్థానంలో నిలిచింది. ఇది పెట్రోల్ ఇంజన్‌తో పాటు కూడా లభ్యమవుతోంది. అతి త్వరలో దీనిని ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లో లాంచ్ చేయడానికి హోండా సన్నాహాలు చేస్తోంది.
7. హోండా అమేజ్
హోండా మోటార్స్ ఇటీవల విపణిలోకి సెకండ్ జనరేషన్ అమేజ్ కాంపాక్ట్ సెడాన్ కారును భారీ మార్పులు, చేర్పులతో మరియు అవే ఇంజన్ ఆప్షన్లో లాంచ్ చేసింది. హోండా అమేజ్ లోని 1.5-లీటర్ డీజల్ వేరియంట్ లీటరుకు 27.4కిమీల మైలేజ్ ఇస్తుంది. ఇది పెట్రోల్ ఇంజన్‌తో పాటు మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కూడా లభ్యమవుతోంది.
6. టాటా టియాగో
టాటా మోటార్స్ సరిగ్గా రెండేళ్ల క్రితం టియాగో ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ కారును పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్లతో విడుదల చేసింది. టియాగో ఇప్పుడు టాటా యొక్క బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా నిలిచింది. ఇందులోని 1.05-లీటర్ డీజల్ వేరియంట్ లీటరుకు 27.28కిమీల మైలేజ్ ఇస్తోంది.
5. మారుతి సుజుకి బాలెనో
మారుతి సుజుకి ఇండియన్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లోకి బాలెనో కారును ప్రవేశపెట్టి భారీ విజయాన్ని అందుకుంది. మూడు రకాల ఇంజన్ ఆప్షన్లతో లభించే బాలెనో కారులోని 1.2-లీటర్ డీజల్ వేరియంట్ లీటరుకు 27.39 కిమీల మైలేజ్ ఇస్తోంది.
4. మారుతి సుజుకి డిజైర్
భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ కారుగా మొదటి స్థానంలో నిలిచిన న్యూ మారుతి డిజైర్ రెండు ఇంజన్ ఆప్షన్లతో గత ఏడాది మార్కెట్లోకి లాంచ్ అయ్యింది. న్యూ డిజైర్ కాంపాక్ట్ సెడాన్‌లోని 1.2-లీటర్ డీజల్ యూనిట్ గరిష్టంగా 28.4కిమీల మైలేజ్ ఇస్తుంది.
3. మారుతి స్విఫ్ట్
మారుతి సుజుకి భారతదేశపు మోస్ట్ పాపులర్ హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్ కారును ఈ ఏడాది ప్రారంభంలో థర్డ్ జనరేషన్లో విడుదల చేసింది. అవే మునుపటి ఇంజన్ ఆప్షన్లతో డిజైన్ మరియు ఫీచర్ల పరంగా భారీ మార్పులకు గురయ్యింది. స్విఫ్ట్‌లోని 1.2-లీటర్ డీజల్ వేరియంట్ లీటరుకు 28.4కిమీల మైలేజ్ ఇవ్వగలదు.
2. మారుతి సియాజ్ హైబ్రిడ్
మారుతి సుజుకి సియాజ్ హైబ్రిడ్ 28.09 కిలోమీటర్ల మైలేజ్‌తో ఈ జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది. మారుతి సియాజ్ హైబ్రిడ్ వేరియంట్ స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ లభ్యమవుతోంది. ఇది సాధారణ ఇంజన్ కంటే అధిక మైలేజ్ ఇస్తుంది.
1. మారుతి ఆల్టో
మారుతి సుజుకి బెస్ట్ సెల్లింగ్ మోడల్ ఆల్టో సీఎన్‌జి ఇంధన వేరియంట్ గరిష్టంగా 33.44కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు. మారుతి ఆల్టో 800సీసీ పెట్రోల్ మరియు సీఎన్‌జి ఇంజన్ ఆప్షన్లతో లభ్యమవుతోంది.