లీటర్‌కు 25కిమీల కంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చే 14 కార్లు

ప్రతి ఒక్కరి లైఫ్‌లో కారు కొనాలనే ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది. అన్నీ అనుకూలిస్తే, కొందరు అనుకున్నతడువుగా కొనేస్తారు. మరికొందరు అదను, అవకాశాల కోసం ఎదురు చూస్తారు. ఏదేమైనప్పటికీ ఇండియాలో కారు కొనాలనే ఆలోచన

By Anil Kumar

ప్రతి ఒక్కరి లైఫ్‌లో కారు కొనాలనే ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది. అన్నీ అనుకూలిస్తే, కొందరు అనుకున్నతడువుగా కొనేస్తారు. మరికొందరు అదను, అవకాశాల కోసం ఎదురు చూస్తారు. ఏదేమైనప్పటికీ ఇండియాలో కారు కొనాలనే ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరిలో మైండ్‌లో మైలేజ్ ప్రధాన అంశం అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఏ కారు కొన్నా... మైలేజ్ ఇంపార్టెంట్ కాబట్టి, బడ్జెట్ ధరలో లీటరుకు 25 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్ల గురించి డ్రైవ్‌స్పార్క్ తెలుగు ప్రత్యేక కథనం.

లీటర్‌కు 25కిమీల కంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లు

14. రెనో క్విడ్

ఫ్రెంచ్ దిగ్గజం రెనో ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసిన క్విడ్ హ్యాచ్‌బ్యాక్ ఈ జాబితాలో 14 వ స్థానంలో నిలిచింది. రెనో క్విడ్ 800సీసీ పెట్రోల్ వేరియంట్ లీటరుకు 25.17కిమీల మైలేజ్ ఇస్తుంది.

  • పెట్రోల్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 2.79 లక్షలు.
  •  25కిమీల కంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లు

    13. మహీంద్రా కెయువి100

    మహీంద్రా అండ్ మహీంద్రా స్మాల్ క్రాసోవర్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి లాంచ్ చేసిన కెయువి100 లోని 1.2-లీటర్ డీజల్ వేరియంట్ లీటరుకు 25.32కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇది పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లో కూడా లభ్యమవుతోంది.

    • డీజల్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 5.65 లక్షలు.
    •  25కిమీల కంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లు

      12. హోండా సిటీ

      లీటరుకు 25కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజ్ కార్ల జాబితాలో మిడ్ సైజ్ సెడాన్ సెగ్మెంట్ నుండి కేవలం హోండా సిటీ మాత్రమే చోటు దక్కించుకుంది. హోండా సిటీలోని 1.5-లీటర్ డీజల్ వేరియంట్ లీటరు 25.6కిమీల మైలేజ్ ఇస్తుంది. మరియు ఈ వేరియంట్ ప్రారంభ ధర రూ. 11.2 లక్షలుగా ఉంది.

      • డీజల్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 11.2 లక్షలు
      •  25కిమీల కంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లు

        11. ఫోర్డో ఫిగో ఆస్పైర్

        ఫోర్డ్ ఫిగో ఆస్పైర్ కాంపాక్ట్ సెడాన్ లోని 1.5-లీటర్ డీజల్ వేరియంట్ లీటరుకు 25.83కిమీల మైలేజ్‌నిస్తుంది. ఫోర్డ్ ఇండియా అతి త్వరలో దీనిని న్యూ జనరేషన్‌లో భారీ మార్పులు చేర్పులతో లాంచ్ చేయనుంది.

        • డీజల్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 6.29 లక్షలు
        •  25కిమీల కంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లు

          10. ఫోర్డ్ ఫిగో

          ఫోర్డ్ ఇండియా తమ ఫిగో హ్యాచ్‌బ్యాక్ కారులో కూడా అదే 1.5-లీటర్ డీజల్ యూనిట్ అందించింది. ఇది లీటరుకు 25.83 కిమీల మైలేజ్ ఇవ్వగలదు. ఫోర్డ్ ఇండియా ఫిగో హ్యాచ్‌బ్యాక్ కారును కూడా అతి త్వరలో అప్‌డేటెడ్ వెర్షన్‌లో విడుదల చేయనుంది.

          • డీజల్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 6.19 లక్షలు
          •  25కిమీల కంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లు

            9. మారుతి సుజుకి ఇగ్నిస్

            మారుతి సుజుకి గత ఏడాది ప్రారంభంలో విడుదల చేసిన ఇగ్నిస్ క్రాసోవర్ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్‌లో లభ్యమవుతోంది. ఇందులోని 1.2-లీటర్ డీజల్ ఇంజన్ లీటరుకు 27కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

            • డీజల్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 6.38 లక్షలు
            •  25కిమీల కంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లు

              8. హోండా జాజ్

              హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ విక్రయిస్తున్న జాజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లోని 1.5-లీటర్ డీజల్ వేరియంట్ లీటరుకు 27.3కిమీల మైలేజ్‌తో 8 వ స్థానంలో నిలిచింది. ఇది పెట్రోల్ ఇంజన్‌తో పాటు కూడా లభ్యమవుతోంది. అతి త్వరలో దీనిని ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో లాంచ్ చేయడానికి హోండా సన్నాహాలు చేస్తోంది.

              • డీజల్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 7.44 లక్షలు
              •  25కిమీల కంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లు

                7. హోండా అమేజ్

                హోండా మోటార్స్ ఇటీవల విపణిలోకి సెకండ్ జనరేషన్ అమేజ్ కాంపాక్ట్ సెడాన్ కారును భారీ మార్పులు, చేర్పులతో మరియు అవే ఇంజన్ ఆప్షన్‌లో లాంచ్ చేసింది. హోండా అమేజ్ లోని 1.5-లీటర్ డీజల్ వేరియంట్ లీటరుకు 27.4కిమీల మైలేజ్ ఇస్తుంది. ఇది పెట్రోల్ ఇంజన్‌తో పాటు మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కూడా లభ్యమవుతోంది.

                • డీజల్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 6.7 లక్షలు
                •  25కిమీల కంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లు

                  6. టాటా టియాగో

                  టాటా మోటార్స్ సరిగ్గా రెండేళ్ల క్రితం టియాగో ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ కారును పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్‌లతో విడుదల చేసింది. టియాగో ఇప్పుడు టాటా యొక్క బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా నిలిచింది. ఇందులోని 1.05-లీటర్ డీజల్ వేరియంట్ లీటరుకు 27.28కిమీల మైలేజ్ ఇస్తోంది.

                  • డీజల్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 4.81 లక్షలు
                  •  25కిమీల కంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లు

                    5. మారుతి సుజుకి బాలెనో

                    మారుతి సుజుకి ఇండియన్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లోకి బాలెనో కారును ప్రవేశపెట్టి భారీ విజయాన్ని అందుకుంది. మూడు రకాల ఇంజన్ ఆప్షన్‌లతో లభించే బాలెనో కారులోని 1.2-లీటర్ డీజల్ వేరియంట్ లీటరుకు 27.39 కిమీల మైలేజ్ ఇస్తోంది.

                    • డీజల్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 6.63 లక్షలు
                    •  25కిమీల కంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లు

                      4. మారుతి సుజుకి డిజైర్

                      భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ కారుగా మొదటి స్థానంలో నిలిచిన న్యూ మారుతి డిజైర్ రెండు ఇంజన్ ఆప్షన్‌లతో గత ఏడాది మార్కెట్లోకి లాంచ్ అయ్యింది. న్యూ డిజైర్ కాంపాక్ట్ సెడాన్‌లోని 1.2-లీటర్ డీజల్ యూనిట్ గరిష్టంగా 28.4కిమీల మైలేజ్ ఇస్తుంది.

                      • డీజల్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 6.57 లక్షలు
                      •  25కిమీల కంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లు

                        3. మారుతి స్విఫ్ట్

                        మారుతి సుజుకి భారతదేశపు మోస్ట్ పాపులర్ హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్ కారును ఈ ఏడాది ప్రారంభంలో థర్డ్ జనరేషన్‌లో విడుదల చేసింది. అవే మునుపటి ఇంజన్ ఆప్షన్‌లతో డిజైన్ మరియు ఫీచర్ల పరంగా భారీ మార్పులకు గురయ్యింది. స్విఫ్ట్‌లోని 1.2-లీటర్ డీజల్ వేరియంట్ లీటరుకు 28.4కిమీల మైలేజ్ ఇవ్వగలదు.

                        • డీజల్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 5.99 లక్షలు
                        •  25కిమీల కంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లు

                          2. మారుతి సియాజ్ హైబ్రిడ్

                          మారుతి సుజుకి సియాజ్ హైబ్రిడ్ 28.09 కిలోమీటర్ల మైలేజ్‌తో ఈ జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది. మారుతి సియాజ్ హైబ్రిడ్ వేరియంట్ స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ లభ్యమవుతోంది. ఇది సాధారణ ఇంజన్ కంటే అధిక మైలేజ్ ఇస్తుంది.

                          • డీజల్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 9.71 లక్షలు.
                          •  25కిమీల కంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లు

                            1. మారుతి ఆల్టో

                            మారుతి సుజుకి బెస్ట్ సెల్లింగ్ మోడల్ ఆల్టో సీఎన్‌జి ఇంధన వేరియంట్ గరిష్టంగా 33.44కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు. మారుతి ఆల్టో 800సీసీ పెట్రోల్ మరియు సీఎన్‌జి ఇంజన్ ఆప్షన్‌లతో లభ్యమవుతోంది.

                            • ఆల్టో సీఎన్‌జి వేరియంట్ ప్రారంభ ధర రూ. 3.86 లక్షలు
                            • గమనిక: అన్ని మైలేజ్ వివరాలు ఆయా కంపెనీలు ఏఆర్ఏఐకి సమర్పించిన వివరాల ఆధారంగా ఇవ్వబడ్డాయి. మరియు ధరలు వివిధ పట్టణాలు, డీలర్లు మరియు వేరియంట్ల ఆధారంగా వ్యత్యాసం ఉండవచ్చు.

Most Read Articles

English summary
Read In Telugu: Cars with mileage of over 25 kmpl in india
Story first published: Monday, July 16, 2018, 19:12 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X