దేశవ్యాప్తంగా సర్వీస్ క్యాంప్ నిర్వహిస్తున్న షెవర్లే

షెవర్లే ఇండియా దేశవ్యాప్తంగా సర్వీస్ క్యాంప్ నిర్వహిస్తోంది. షెవర్లే కార్లను కలిగి ఉన్న కస్టమర్ల కోసం 2018 మార్చి 16 నుండి 20 వరకు ఈ సర్వీస్ క్యాంప్ కొనసాగుతుంది. దేశం మొత్తం మీద ఉన్న 170 అధీకృత షెవర్

By Anil Kumar

అమెరికన్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం జనరల్ మోటార్స్ ఇండియా విభాగం షెవర్లే గత ఏడాది ఇండియన్ మార్కెట్ నుండి వైదొలగిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఎంతో మంది షెవర్లే కస్టమర్లు ఉన్నారు. వారి వాహనాలకు సర్వీసింగ్ కోసం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సర్వీస్ క్యాంప్ ప్రారంభించింది.

Recommended Video

2018 మారుతి న్యూ స్విఫ్ట్ విడుదల | Maruti Swift 2018 - Full Specifications, Features - DriveSpark
దేశవ్యాప్తంగా సర్వీస్ క్యాంప్ నిర్వహిస్తున్న షెవర్లే

షెవర్లే ఇండియా దేశవ్యాప్తంగా సర్వీస్ క్యాంప్ నిర్వహిస్తోంది. షెవర్లే కార్లను కలిగి ఉన్న కస్టమర్ల కోసం 2018 మార్చి 16 నుండి 20 వరకు ఈ సర్వీస్ క్యాంప్ కొనసాగుతుంది. దేశం మొత్తం మీద ఉన్న 170 అధీకృత షెవర్లే సర్వీస్ సెంటర్లలో ఈ క్యాంప్ నిర్వహిస్తున్నారు.

దేశవ్యాప్తంగా సర్వీస్ క్యాంప్ నిర్వహిస్తున్న షెవర్లే

భారత్‌లో విక్రయాల నుండి నిష్క్రమించినప్పటికీ, అంత వరకు విక్రయించిన కార్ల సర్వీసింగ్ పరంగా షెవర్లే కస్టమర్లకు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికీ సర్వీస్ కొనసాగిస్తోంది. ప్రత్యేక సర్వీస్ క్యాంప్ ద్వారా నిపుణుల పర్యవేక్షణలో అధీకృత సర్వీస్ సెంటర్ల కేంద్రంగా సర్వీసింగ్ మరియు పలు రకాల రిపేరీలను నిర్వహిస్తోంది.

దేశవ్యాప్తంగా సర్వీస్ క్యాంప్ నిర్వహిస్తున్న షెవర్లే

నాలుగు రోజుల పాటు కొనసాగే ఈ సర్వీస్ క్యాంపులో సుమారుగా 15,000 మంది కస్టమర్లు షెవర్లే సర్వీస్ క్యాంపును సందర్శించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. సర్వీస్ క్యాంపులో షెవర్లే మోడళ్ల మెయింటెనెన్స్ అవసరాలు గురించి నిపుణుల సలహాలు ఇవ్వనున్నారు.

దేశవ్యాప్తంగా సర్వీస్ క్యాంప్ నిర్వహిస్తున్న షెవర్లే

అంతే కాకుండా, లేబర్ ఖర్చులు మరియు షెవర్లే ఒరిజినల్ పార్ట్స్ మరియు యాక్ససరీల మీద 25 శాతం డిస్కౌంట్ కూడా కల్పిస్తోంది. ఉచిత వెహికల్ హెల్త్ చెక్-అప్ మరియు కార్ వాష్ వంటివి అదనపు సేవలు కూడా అందిస్తోంది.

దేశవ్యాప్తంగా సర్వీస్ క్యాంప్ నిర్వహిస్తున్న షెవర్లే

షెవర్లే 1990లో ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించింది. అయితే, రెండు సుదీర్ఘ దశాబ్దాల తరువాత షెవర్లే దేశీయ మార్కెట్ నుండి శాశ్వతంగా నిష్క్రమించింది. షెవర్లే కంపెనీకి భారత్‌లో రెండు ప్రొడక్షన్ ప్లాంటులు ఉండేవి. అవి, గుజరాత్‌లోని హలోల్ మరియు మహారాష్ట్రలోని తలెగావ్.

దేశవ్యాప్తంగా సర్వీస్ క్యాంప్ నిర్వహిస్తున్న షెవర్లే

వీటిలో మహారాష్ట్రలోని తలెగావ్ ప్రొడక్షన్ ప్లాంటులో షెవర్లే ఇప్పటికీ తమ కార్లను ఉత్పత్తి చేసి, విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేస్తోంది. కానీ, గుజరాత్‌లోని హలోల్ ప్రొడక్షన్ ప్లాంటును చైనా ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం ఎస్ఐఎసి సంస్థకు విక్రయించింది.

దేశవ్యాప్తంగా సర్వీస్ క్యాంప్ నిర్వహిస్తున్న షెవర్లే

షెవర్లే ఇండియన్ మార్కెట్లో కార్యకలాపాలు నిలిపివేసినప్పటికీ, షెవర్లే కస్టమర్లకు విక్రయించిన కార్ల సర్వీసింగ్ కోసం నిబద్ధతతో దేశవ్యాప్తంగా నాలుగు రోజుల పాటు ప్రత్యేక సర్వీస్ క్యాంప్ నిర్వహిస్తోంది.

Most Read Articles

English summary
Read In Telugu: Chevrolet Service Camp Organised Across India
Story first published: Saturday, March 17, 2018, 16:12 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X