డాట్సన్ క్రాస్ ఎస్‌యూవీ ప్రొడక్షన్‌కు ఏర్పాట్లు పూర్తి

అత్యంత సరసమైన కార్ల తయారీ సంస్థగా పేరుగాంచిన డాట్సన్ విపణిలోకి సరికొత్త క్రాస్ ఎస్‌యూవీని విడుదల చేయడానికి సిద్దం అవుతోంది. మార్కెట్లో అత్యంత డిమాండ్ ఉన్న కాంపాక్ట్ ఎస్‌యూవీ మరియు ప్రీమియం హ్యాచ్‌బ్యా

By Anil Kumar

అత్యంత సరసమైన కార్ల తయారీ సంస్థగా పేరుగాంచిన డాట్సన్ విపణిలోకి సరికొత్త క్రాస్ ఎస్‌యూవీని విడుదల చేయడానికి సిద్దం అవుతోంది. మార్కెట్లో అత్యంత డిమాండ్ ఉన్న కాంపాక్ట్ ఎస్‌యూవీ మరియు ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ప్రస్తుతం డాట్సన్ బృందం పనిచేస్తోంది.

డాట్సన్ క్రాస్ ఎస్‌యూవీ ప్రొడక్షన్‌కు ఏర్పాట్లు పూర్తి

దేశీయంగా మైక్రా హ్యాచ్‌బ్యాక్ సేల్స్ తక్కువగా ఉండటంతో నిస్సాన్ మైక్రా హ్యాచ్‌‌బ్యాక్ ప్రొడక్షన్‌ను చెన్నై నుండి ఫ్రాన్స్‌కు తరలించింది. ఇదే ప్రొడక్షన్ ప్లాంటులో నిస్సాన్‌తో పాటు రెనో మరియు డాట్సన్ కార్ల తయారీ కూడా చేపడుతోంది.

డాట్సన్ క్రాస్ ఎస్‌యూవీ ప్రొడక్షన్‌కు ఏర్పాట్లు పూర్తి

ఈ ప్లాంటులో మైక్రా ప్రొడక్షన్ ఆగిపోవడంతో డాట్సన్‌కు చెందిన బడ్జెట్ ఫ్రెండ్లీ ఎస్‌యూవీ డాట్సన్ క్రాస్ ఉత్పత్తిని ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తోంది. అంతే కాకుండా, నిస్సాన్ తమ సన్నీ సెడాన్ ప్రొడక్షన్‌ను కూడా నిలిపివేసి, పూర్తిగా రెనో మరియు డాట్సన్ కార్లను మాత్రమే ఉత్పత్తి చేయాలని భావిస్తోంది.

డాట్సన్ క్రాస్ ఎస్‌యూవీ ప్రొడక్షన్‌కు ఏర్పాట్లు పూర్తి

ఏదేమైప్పటికీ, డాట్సన్ ఇండియాలో రెడి-గో హ్యాచ్‌బ్యాక్ విడుదలతో ఓ మోస్తారు ఫలితాలు సాధించినప్పటికీ, గో మరియు గ్రో ప్లస్ మోడళ్లతో ఆశించిన సేల్స్ సాధించలేకపోయింది. మరో ప్రయత్నంగా గతంలో ఆవిష్కరించిన క్రాస్ కాన్సెప్ట్ ఆధారిత క్రాస్ యుటిలిటి వెహికల్‌ను సిద్దం చేస్తోంది.

డాట్సన్ క్రాస్ ఎస్‌యూవీ ప్రొడక్షన్‌కు ఏర్పాట్లు పూర్తి

రెనో-నిస్సాన్ భాగస్వామ్యంలో ఉన్న సిఎమ్ఎఫ్-ఎ ప్లస్ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా రెడి-గో సిఎమ్ఎఫ్-ఎ ఛాసిస్ యొక్క పొడవాటి వెర్షన్‌లో ఈ క్రాసోవర్‌ను డాట్సన్ రూపొందించింది.

డాట్సన్ క్రాస్ ఎస్‌యూవీ ప్రొడక్షన్‌కు ఏర్పాట్లు పూర్తి

ప్రొడక్షన్ దశకు చేరుకున్న డాట్సన్ క్రాస్ క్రాసోవర్‌లో బాడీ క్లాడింగ్, హ్యాలోజియన్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, ఎల్ఇడి పొజిషన్ ల్యాంప్స్, బంపర్ మీద ఫాక్స్ స్కిడ్ ప్లేట్లు, రూఫ్ స్పాయిలర్, రియర్ వైపర్ మరియు రూఫ్ రెయిల్స్ వంటివి ఉన్నాయి.

డాట్సన్ క్రాస్ ఎస్‌యూవీ ప్రొడక్షన్‌కు ఏర్పాట్లు పూర్తి

ఇందులో 6.9-అంగుళాల పరిమాణంలో ఉన్న ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రికల్‌గా అడ్జెస్ట్ చేసుకునే వీలున్న అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్ మరియు సివిటి ట్రాన్స్‌మిషన్ వంటి ఎన్నో ఫీచర్లు రానున్నాయి.

డాట్సన్ క్రాస్ ఎస్‌యూవీ ప్రొడక్షన్‌కు ఏర్పాట్లు పూర్తి

అదనంగా, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు,యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, బ్రేక్ అసిస్ట్, స్టెబిలిటి కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, రియర్ పార్కింగ్ సెన్సార్లు మరియు మూడు వరుసల్లో ఉన్న సీట్లకు సీట్ బెల్ట్‌లను తప్పనిసరి ఫీచర్లుగా అందిస్తోంది.

డాట్సన్ క్రాస్ ఎస్‌యూవీ ప్రొడక్షన్‌కు ఏర్పాట్లు పూర్తి

సాంకేతికంగా, డాట్సన్ క్రాస్ క్రాసోవర్ 1.2-లీటర్ కెపాసిటి గల మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్‌తో రానుంది. 68బిహెచ్‌పి పవర్ మరియు 104ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగల ఈ ఇంజన్‌ను గో ప్లస్ నుండి సేకరించింది.

డాట్సన్ క్రాస్ ఎస్‌యూవీ ప్రొడక్షన్‌కు ఏర్పాట్లు పూర్తి

5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కూడా రానుంది. బ్రేకింగ్ డ్యూటీ కోసం ఫ్రంట్ వీల్స్‌కు డిస్క్ బ్రేకులు, రియర్ వీల్‌కు డ్రమ్ బ్రేకులు ఉన్నాయి.

Most Read Articles

English summary
Read In Telugu: Datsun Cross SUV’s India Launch Nears As Production Could Begin Soon
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X