కాంపాక్ట్ ఎస్‌యూవీని పరీక్షిస్తున్న డాట్సన్

అత్యంత సరసమైన ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థగా పేరుగాంచిన డాట్సన్ ఇండియా విభాగం చెన్నై సమీపంలో ఓ రహస్యంగా పరీక్షిస్తోంది. ఇది, గత ఏడాది చివరలో ఇండోనేషియా మోటార్ షోలో ఆవిష్కరించిన డాట్సన్ గో క్రాస్ ఎస్‌య

By Anil Kumar

అత్యంత సరసమైన ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థగా పేరుగాంచిన డాట్సన్ ఇండియా విభాగం చెన్నై సమీపంలో ఓ రహస్యంగా పరీక్షిస్తోంది. ఇది, గత ఏడాది చివరలో ఇండోనేషియా మోటార్ షోలో ఆవిష్కరించిన డాట్సన్ గో క్రాస్ ఎస్‌యూవీ అని తెలుస్తోంది. పరీక్షలు పూర్తి చేసుకున్న అనంతరం ప్రొడక్షన్ వెర్షన్ గో క్రాస్ ఎస్‌యూవీని ఈ ఏడాది చివరికల్లా విపణిలోకి లాంచ్ చేసే అవకాశం ఉంది.

డాట్సన్ గో క్రాస్ క్రాసోవర్ ఎస్‌యూవీ

డాట్సన్ గో క్రాస్ ఎస్‌యూవీని రూ. 10 లక్షల బడ్జెట్ ధరలో సబ్-4 మీటర్ సెగ్మెంట్లోకి ప్రవేశపెట్టనుంది. టెస్టింగ్ నిర్వహిస్తున్న మోడల్‌ను పరీశీలిస్తే, ఎక్ట్సీరియర్‌లో కండలు తిరిగిన రూపాన్ని గుర్తించవచ్చు. అంటే, టాటా నెక్సాన్ ఎస్‌యూవీ తరహాలో పలు స్టైలింగ్ అంశాలతో వచ్చే అవకాశం ఉంది.

డాట్సన్ గో క్రాస్ క్రాసోవర్ ఎస్‌యూవీ

డాట్సన్ ఇండియా దీనిని ఫుల్ ఎస్‌యూవీ తరహాలో కాకుండా క్రాసోవర్ స్టైల్లో ప్రవేశపెట్టనుంది. దీంతో రెగ్యులర్ బాక్స్ ఆకారంలో కాకుండా, కాస్త విభిన్నంగా ఉండనుంది. ఫోటోలలో ఉన్న గో క్రాస్ ఎస్‌యూవీని గమనిస్తే, కొలతల పరంగా అత్యంత విశాలమైన క్యాబిన్ గుర్తించవచ్చు.

డాట్సన్ గో క్రాస్ క్రాసోవర్ ఎస్‌యూవీ

డాట్సన్ గో క్రాస్ క్రాసోవర్ ఎస్‌యూవీలో ముందు వైపున పగటి పూట వెలిగే ఎల్ఈడీ లైట్ల జోడింపుతో ఉన్న ఇంటిగ్రేటెడ్ హెడ్‌ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్, మరియు ఆకర్షణీయమైన ఎయిర్ ఇంటేకర్ ఇంకా ఎన్నో డిజైన్ ఎలిమెంట్లు ఉన్నాయి.

డాట్సన్ గో క్రాస్ క్రాసోవర్ ఎస్‌యూవీ

గో క్రాస్ ఎస్‌యూవీ రియర్ డిజైన్‌లో పెద్ద పరిమాణంలో ఉన్న బంపర్ మరియు స్పోర్టివ్ స్పాయిలర్ గుర్తించవచ్చు. అప్ కమింగ్ గో క్రాస్ ఎస్‌యూవీని రెనో-నిస్సాన్ భాగస్వామ్యంలో అభివృద్ది చేసిన సిఎమ్ఎఫ్-ఎ ఫ్లాట్‌పామ్ ఆధారంగా నిర్మించారు.

డాట్సన్ గో క్రాస్ క్రాసోవర్ ఎస్‌యూవీ

సాంకేతికంగా ఇందులో 1.0-లీటర్ కెపాసిటి గల పెట్రోల్ ఇంజన్ రానుంది,అయితే డీజల్ యూనిట్‌ను ప్రవేశపెట్టడం లేదని తెలుస్తోంది. డాట్సన్ ఇండియా గో హాచ్‌బ్యాక్ మరియు గో ప్లస్ ఎమ్‌పీవీ కార్లను ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో ప్రవేశపెడుతుందని గతంలో ఓ కథనంలో ప్రకటించాము. అయితే, ఈ రెండింటిని కూడా ఈ ఏడాది పండుగ సీజన్‌లో లాంచ్ చేసే అవకాశం ఉంది.

డాట్సన్ గో క్రాస్ క్రాసోవర్ ఎస్‌యూవీ

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇటీవల కాలంలో ఎస్‌యూవీలను ఎంచుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో డాట్సన్ అత్యంత సరసమైన మోడల్‌ను ఎస్‌యూవీ సెగ్మంట్లోకి ప్రవేశపెట్టేందుకు కసరత్తులు ప్రారంభించింది. డాట్సన్ గో క్రాస్ విడుదలతో డాట్సన్ ఇండియాలో లైనప్‌లో ఉన్న ఉత్పత్తుల సంఖ్య నాలుగుకు చేరనుంది.

Source: MotorBeam

Most Read Articles

English summary
Read In Telugu: Datsun GO Cross Caught Testing In India — Should We Expect A Launch Soon?
Story first published: Monday, July 30, 2018, 17:37 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X