డాట్సన్ గో మరియు గో ప్లస్ రీమిక్స్ ఎడిషన్ విడుదల: ధర రూ. 4.21 లక్షలు

డాట్సన్ తమ గో హ్యాచ్‌బ్యాక్ మరియు గో ప్లస్ ఎమ్‌పీవీ కార్లను రీమిక్స్ ఎడిషన్‌లో విపణిలోకి లాంచ్ చేసింది. సరికొత్త రీమిక్స్ లిమిటెడ్ ఎడిషన్ డాటన్స్ గో ప్రారంభ ధర రూ. 4.21 లక్షలు మరియు గో ప్లస్ ప్రారంభ ధ

By Anil Kumar

చీపెస్ట్ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ, జపాన్ దిగ్గజం డాట్సన్ తమ గో హ్యాచ్‌బ్యాక్ మరియు గో ప్లస్ ఎమ్‌పీవీ కార్లను రీమిక్స్ ఎడిషన్‌లో విపణిలోకి లాంచ్ చేసింది. సరికొత్త రీమిక్స్ లిమిటెడ్ ఎడిషన్ డాటన్స్ గో ప్రారంభ ధర రూ. 4.21 లక్షలు మరియు గో ప్లస్ ప్రారంభ ధర రూ. 4.99 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉన్నాయి.

Recommended Video

2018 మారుతి న్యూ స్విఫ్ట్ విడుదల | Maruti Swift 2018 - Full Specifications, Features - DriveSpark
డాట్సన్ గో మరియు గో ప్లస్ రీమిక్స్ ఎడిషన్

కొత్తగా విడుదలైన డాట్సన్ గో మరియు గో ప్లస్ రీమిక్స్ లిమిటెడ్ ఎడిషన్ ఎక్ట్సీరియర్‌లోని బానెట్ మరియు రూఫ్ టాప్ ప్రత్యేకమైన స్టిక్కరింగ్ సొబగులు మరియు ఇంటీరియర్‌లో డ్యూయల్ టోన్ బ్లాక్ థీమ్ కలదు.

డాట్సన్ గో మరియు గో ప్లస్ రీమిక్స్ ఎడిషన్

డాట్సన్ గో రీమిక్స్ ఎడిషన్ హ్యాచ్‌బ్యాక్ ప్రత్యేకమైన ONYX బ్లాక్ కలర్ ఆకర్షణీయమైన ఆరేంజ్ కలర్ సమ్మేళనపు ఎక్ట్సీరియర్ కలర్ స్కీమ్‌లో లభిస్తోంది. మరియు డాట్సన్ గో ప్లస్ డ్యూయల్ టోన్ స్టార్మ్ వైట్‌ కలర్‌తో బ్లాక్ మరియు ఆరేంజ్ కలర్ డీకాల్స్ కాంబినేషన్‌లో లభ్యమవుతోంది.

డాట్సన్ గో మరియు గో ప్లస్ రీమిక్స్ ఎడిషన్

పైన పేర్కొన్న కలర్ ఆప్షన్‌లతో పాటు డాట్సన్ గో మరియు గో ప్లస్ రీమిక్స్ లిమిటెడ్ ఎడిషన్ కార్లు స్టార్మ్ వైట్ మరియు డ్యూయల్ టోన్ సిల్వర్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తున్నాయి.

డాట్సన్ గో మరియు గో ప్లస్ రీమిక్స్ ఎడిషన్

సరికొత్త డాట్సన్ గో మరియు గో ప్లస్ రీమిక్స్ లిమిటెడ్ ఎడిషన్ మోడళ్లలో తొమ్మి విభిన్న ఆఫర్లు వచ్చాయి. అవి, రిమోట్ కీలెస్ ఎంట్రీ, హ్యాండ్స్ ఫ్రీ బ్లూటూత్ ఆడియో, ట్రెండింగ్ సీట్ కవర్లు, ఆల్ బ్లాక్ ఫ్రంట్ గ్రిల్, స్టైలిష్ బ్లాక్ వీల్ కవర్స్, పియానో-బ్లాక్ ఇంటీరియర్స్, స్పోర్టివ్ స్పాయిలర్, స్టైలిష్ క్రోమ్ ఎగ్జాస్ ఫినిషింగ్ మరియు క్రోమ్ బంపర్ బెజెల్ వంటివి ఉన్నాయి.

డాట్సన్ గో మరియు గో ప్లస్ రీమిక్స్ ఎడిషన్

సాంకేతికంగా డాట్సన్ గో మరియు గో ప్లస్ రీమిక్స్ లిమిటెడ్ ఎడిషన్ కార్లలో 1.2-లీటర్ కెపాసిటి గల మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ద్వారా ఇంజన్ ప్రొడ్యూస్ చేసే 67బిహెచ్‍‌పి పవర్ మరియు 104ఎన్ఎమ్ టార్క్ ముందు చక్రాలకు సరఫరా అవుతుంది.

డాట్సన్ గో మరియు గో ప్లస్ రీమిక్స్ ఎడిషన్

డాట్సన్ గో ఐదు మంది ప్రయాణించే వీలున్న హ్యాచ్‌బ్యాక్ కారు కాగా, గో ప్లస్ 7-మంది ప్రయాణించే వీలున్న కాంపాక్ట్ ఫ్యామిలీ వ్యాగన్. ప్రత్యేకించి ప్రతి ఇండియన్ ఫ్యామిలీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విశాలమైన క్యాబిన్‌తో అత్యంత సరసమైన ధరతో గో ప్లస్ కారును డాట్సన్ అందుబాటులో ఉంచింది.

డాట్సన్ గో మరియు గో ప్లస్ రీమిక్స్ ఎడిషన్

డాట్సన్ గో మరియు గో ప్లస్ కార్లలో ఫాలో-మి-హోమ్ హెడ్‌ల్యాంప్స్, స్పీడ్ సెన్సిటివ్ ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్, శక్తివంతమైన ఎయిర్ కండీషనర్, ఫ్రంట్ పవర్ విండోస్, ఏయుఎక్స్, యూఎస్‌బి ఛార్జింగ్ పోర్ట్స్ మరియు సెంట్రల్ లాకింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

డాట్సన్ గో మరియు గో ప్లస్ రీమిక్స్ ఎడిషన్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

డాట్సన్ ఇండియా విపణిలో గో మరియు గో ప్లస్ కార్లతో పాటు రెడి-గో ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ మొత్తం మూడు మోడళ్లు ఉన్నాయి. రెడి-గో మోడల్‌తో పోల్చుకుంటే గో మరియు గో ప్లస్ కార్లు ఆశించి ఫలితాలు సాధించడం లేదు.

డాట్సన్ గో మరియు గో ప్లస్ రీమిక్స్ ఎడిషన్

ఈ నేపథ్యంలోనే గో మరియు గో ప్లస్ కార్లను అత్యాధునిక ఇంటీరియర్ ఫీచర్లు, ఆకర్షణీయమైన ఇంటీరియర్ కలర్ థీమ్ మరియు ఎక్ట్సీరియర్ బాడీ డీకాల్స్‌ అందించి స్టైలిష్ లుక్‌లో రీమిక్స్ లిమిటెడ్ ఎడిషన్ పేరుతో విపణిలో ప్రవేశపెట్టింది. రెగ్యులర్ వేరియంట్లతో పోల్చుకుంటే ఈ రెండు స్పెషల్ ఎడిషన్ కార్లు చాలా అట్రాక్టివ్‌గా ఉన్నాయి. వీటిని దేశవ్యాప్తంగా ఉన్న నిస్సాన్ మరియు డాట్సన్ షోరూమ్‌లలో ఎంచుకోవచ్చు.

Most Read Articles

English summary
Read In Telugu: Datsun GO And GO+ Remix Limited Edition Launched In India; Prices Start At Rs 4.21 Lakh
Story first published: Monday, March 12, 2018, 17:12 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X