Just In
- 12 hrs ago
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- 14 hrs ago
మీకు తెలుసా.. ఇది ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ట్రైన్ కానుంది
- 1 day ago
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- 1 day ago
డిసెంబర్లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..
Don't Miss
- News
‘హీరా బెన్’ జీ మీరైనా మీ కొడుక్కి చెప్పండి: ప్రధాని మోడీ తల్లికి ఓ రైతు లేఖ
- Movies
ట్రెండింగ్ : ఆమె నా తల్లి కాదు.. ప్రైవేట్ పార్టు చూపిస్తూ.. పర్సనల్ సీక్రెట్ లీక్ చేసిన దీపిక పదుకొనే
- Sports
Sri Lanka vs England: జోరూట్ జోరు.. శ్రీలంక బేజారు!
- Finance
బడ్జెట్, మొబైల్ యాప్‌లో 14 డాక్యుమెంట్ల పూర్తి వివరాలు
- Lifestyle
రాత్రుల్లో లోదుస్తులు ధరించకుండా ఒక వారం పాటు నిద్రించండి,ఏం జరుగుతుందో చూడండి, ఆశ్చర్యపోతారు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
డిజిలాకర్‌లో చూపించే డాక్యుమెంట్స్ చెల్లుతాయి: రాష్ట్ర పోలీస్ శాఖలకు సూచించిన కేంద్రం
ట్రాఫిక్ పోలీసులు డ్రైవింగ్ లైసెన్స్ చూపించమన్నపుడు చాలా మంది ఇంట్లో మరిచిపోయామని చెబుతుంటారు. నిజంగానే ఇంట్లో మరిచిపోయినా కూడా పోలీసులు అడిగినపుడు చూపెట్టకపోతే చట్ట పరంగా మీకు డ్రైవింగ్ రాదని అర్థం. ఈ సమస్య ఒక్క డ్రైవింగ్ లైసెన్స్‌తోనే కాదు, ఆర్సీ మరియు ఇన్సూరెన్స్ మరియు ఇంకా ఎన్నో పత్రాలను వెంటతీసుకెళ్లాల్సిన ప్రతిసారీ మరిచిపోతుంటాం.

పాలనలో డిజిటల్ విప్లవాన్ని తీసుకొచ్చిన భారత ప్రభుత్వం ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు డిజిలాకర్ అనే మొబైల్ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రజలు ఈ యాప్‌లో తమకు సంభందించిన అన్ని పత్రాలను భద్రపరుచుకుని అధికారులు అడిగినపుడు వాటిని చూపించవచ్చు.

అయితే, ఈ డిజిలాకర్ గతంలోనే అందుబాటులోకి వచ్చినప్పటికీ డిజిలాకర్ గురించి సరైన అవగాహన లేని ట్రాఫిక్ పోలీసు అధికారులు డిజిలాకర్‌లో చూపించే డాక్యుమెంట్లను పరిగణలోకి తీసుకునేవారు కాదు. ల్యామినేటెడ్ రూపంలో ఉన్న డీఎల్, ఆర్‌సిలను మాత్రమే చూపించాలని పట్టుబట్టేవారు.

ఓ వ్యక్తి ట్రాఫిక్ పోలీసులు ఆపినపుడు వాహనానికి సంభందించిన పత్రాలను చూపించమంటే డిజి లాకర్ ఓపెన్ చేసి అందులో భద్రపరిచిన అన్ని డాక్యుమెంట్లను చూపించాడు. ఇలాంటి చెల్లవు, ఒరిజినల్ పత్రాలను చూపించాలని కోరాడు. దేశ ప్రధానే దీనిని ఆవిష్కరించి, పోలీసులకు ఇందులో పత్రాలను చూపించండి అంటుంటే మీకేంటి సమస్య అని ప్రశ్నించినందుకు మోడీకి వెళ్లి చూపించి నాకు కాదు అన్ని సంఘటన ఒకటి జరిగింది. ఇలాంటి ఎన్నో సంఘటనలో ఎన్నో నమోదయ్యాయి.

అయితే, తాజాగా కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలు మరియు ఆయా రాష్ట్రాల పోలీసు శాఖలకు డిజి లాకర్‌లో చూపించే పత్రాలు చెల్లుతాయని సూచించింది. ల్యామినేటెడ్ రూపంలో ఉన్న పత్రాలను స్కాన్ చేసి, సాఫ్ట్ కాపీల రూపంలో డిజి లాకర్‌లో భద్రత పరుచుకున్న అన్ని ప్రభుత్వం కార్యాలయాల్లో చెల్లుబాటు అవుతాయని కేంద్రం సూచించింది.

భారత సమాచార సాంకేతిక చట్టం 2000 ప్రకారం డిజి లాకర్‌లో ఉన్న పత్రాలు చెల్లుబాటు అవుతాయి. కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఈ సందర్భంగా మాట్లాడుతూ, "రాష్ట్ర ప్రభుత్వాలు మోటార్ వాహనాల చట్టం 1988 ప్రకారం జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మరియు ఇతర పత్రాలు డిజి లాకర్ లేదా ఎమ్‌పరివాహన్ మొబైల్ యాప్ ద్వారా ఎలక్ట్రానిక్ రూపంలో చెల్లుబాటు అవుతాయని పేర్కొంది."

తాజా ప్రకటన మేరకు, పోలీసులు డిజి లాకర్ మరియు ఎమ్‌పరివాహన్ మొబైల్ అప్లికేషన్ల ద్వారా చూపించే పత్రాలను అంగీకరించడం లేదని నమోదవుతున్న ఎన్నో ఫిర్యాదుల సమాధానం ఇచ్చింది. ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్న వెహికల్ డాక్యుమెంట్లు మోటార్ వాహనాల చట్టం 1988 మరియు కేంద్ర మోటార్ వాహనాల నియమావళి 1989 యొక్క నియమ నిభందనలను పాటిస్తాయి.

వెహికల్ ఇన్సూరెన్స్ మరియు దాని రెన్యువల్‌కు సంభందించిన డాటాను ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బోర్డ్ (IIB) ప్రభుత్వ వాహన్ (VAHAN) డాటా బేస్‌లోకి పొందుపరుస్తుంది. ఇది ఆటోమేటిక్‌గా డిజిలాకర్ మరియు ఎమ్‌పరివాహన్ అప్లికేషన్లలో అప్‌లోడ్ అవుతుంది.

అధికారులు ఫిజకల్ డాక్యుమెంట్లను కోరాల్సిన అవసరం లేదు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారిత ఆన్‌లైన్ వెరిఫికేషన్ ద్వారా అప్‌లోడ్ అయ్యే పత్రాలను అధికారులు పరిగణలోకి తీసుకోవచ్చని ఆ ప్రకటనలో వెల్లడించింది. మెరుగైన మరియు పారదర్శక సేవలను అందించేందుకు డిజిలాకర్ ఎంతో చక్కగా ఉపయోగపడుతుందని కేంద్రం పేర్కొంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
డిజిలాకర్ మరియు ఎమ్‌పరివాహన్ యాప్‌లో ఉన్న డిజిటల్ పత్రాలు చట్టపరంగా చెల్లుబాటు అవుతాయని కేంద్రం విడుదల చేసిన ప్రకటన, ఇటీవల ప్రాచుర్యం పొందిన భారతదేశపు ప్రఖ్యాత నినాదం - "డిజిటల్ ఇండియా" నిజమని నిరూపించింది. ప్రజలు ఇక మీదట తమ స్మార్ట్ ఫోన్‌లలో అన్ని ఒరిజనల్ పత్రాలను భద్రత పరుచుకుని అవసరం వచ్చినపుడు ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు.
భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మీ అభిప్రాయాన్ని క్రింది కామెంట్ బాక్స్ ద్వారా మాతో పంచుకోండి...