పార్కింగ్ చేసిన కారులో మద్యం సేవిస్తూ పోలీసులకు దొరికిపోతే..?

పార్కింగ్ చేసిన లేదా రోడ్డు ప్రక్కన నిలబెట్టిన కారులో మందు కొట్టడం చట్టపరంగా నేరమేనా...? ఇలాంటి సందర్భంలో పోలీసులకు దొరికితే ఏంటి పరిస్థితి...? పూర్తి వివరాలు ఇవాళ్టి కథనంలో చూద్దాం రండి....

By Anil Kumar

భారత్‌లో అత్యధికంగా ఉల్లంఘిస్తున్న ట్రాఫిక్ రూల్స్‌లో డ్రింకింగ్ అండ్ డ్రైవింగ్. అవును, మద్యం సేవించి వాహనం నడపకూడదంటూ అన్ని కఠినమైన చట్టాలు తీసుకొచ్చినా మందు బాబుల్లో ఎలాంటి మార్పు రాలేదు. అంతే కాకుండా, ఈ మధ్య కాలంలో పార్కింగ్ చేసిన వాహనంలో మందు కొట్టడం ఫ్యాషన్ అయిపోయింది. రోడ్డు ప్రక్కన వాహనాలు నిలుపుకొని అందులో మద్యం సేవించే సంఘటనలు అక్కడక్కడా నమోదువుతున్నాయి.

పార్కింగ్ చేసిన కారులో మద్యం సేవించడం

మరి పార్కింగ్ చేసిన లేదా రోడ్డు ప్రక్కన నిలబెట్టిన కారులో మందు కొట్టడం చట్టపరంగా నేరమేనా...? ఇలాంటి సందర్భంలో పోలీసులకు దొరికితే ఏంటి పరిస్థితి...? పూర్తి వివరాలు ఇవాళ్టి కథనంలో చూద్దాం రండి....

పార్కింగ్ చేసిన కారులో మద్యం సేవించడం

డ్రంక్ డ్రైవ్ కేసులను అరికట్టేందుకు ఒక్కో రాష్ట్రం ఒక్కో చట్టాన్ని అమలు చేస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో అయితే మునుపెన్నడూ వినని చట్టాలు ఉన్నాయి. అసలు ఇలాంటి రూల్స్ ఉంటాయా అనే అనుమానం కలగక మానదు. ఏదేమైనప్పటికీ, మద్యం సేవించి డ్రైవింగ్ చేసే మందు బాబుల ఆటకట్టించేందుకు దేశంలోని పలు రాష్ట్రాల పోలీసులు చేయని ప్రయత్నాలంటూ ఏవీ లేవు.

పార్కింగ్ చేసిన కారులో మద్యం సేవించడం

పంజాబ్‌లో అయితే, పార్కింగ్ చేసిన కారులో లేదా రోడ్డు ప్రక్కన వాహనాలను నిలిపి అందులో కూర్చుని మద్యం సేవిస్తూ పోలీసులకు పట్టుబడితే అందరినీ అరెస్ట్ చేయడంతో పాటు ఆ వాహనాన్ని సీజ్ చేస్తారు.

పార్కింగ్ చేసిన కారులో మద్యం సేవించడం

పంజాబ్ పోలీస్ చట్టం 2007 క్రింద పోలీసులు నిందితులను అరెస్ట్ చేసే మరియు వారి వాహనాలను సీజ్ చేసి, స్వాధీనం చేసుకునే పవర్ కలిగి ఉన్నారు. ఈ సెక్షన్ క్రింది అరెస్ట్ అయిన నిందితులు కోర్టు విచారణకు వెళ్లి తమ వాహనాలను విడిపించుకోవాల్సి ఉంటుంది.

పార్కింగ్ చేసిన కారులో మద్యం సేవించడం

ఇటీవల చంఢీగర్ పోలీసులు 27 మందిని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తుండగా అరెస్ట్ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మరియు పార్కింగ్ కోసం కేటాయించిన ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్ట పరంగా నేరం. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన 24 మందిని అరెస్ట్ చేయగా, కారు లేదా బైకుల మీద మద్యం సేవిస్తూ పట్టుబడిన మరో ముగ్గురుని అరెస్ట్ చేసి, ఆ వాహనాలను సీజ్ చేశారు.

పార్కింగ్ చేసిన కారులో మద్యం సేవించడం

అక్కడెక్కడో చంఢీగర్‌లో జరిగిన సంఘటనలు మరియు అరెస్టుల గోల మనకెందుకు అనుకునేరు. బహిరంగ ప్రదేశాల్లో మరియు పార్కింగ్ చేసిన కార్లలో కూర్చుని మందు కొట్టడం చట్ట పరంగా నేరం వివరించడానికి ఒక ఉదాహరణగా పేర్కొనడం జరిగింది.

పార్కింగ్ చేసిన కారులో మద్యం సేవించడం

డ్రంక్ అండ్ డ్రైవ్ చాలా ప్రమాదకరమైనది, ఏ చిన్న తేడా జరిగినా కోలుకోలేని ప్రమాదానికి దారి తీస్తుంది. భారత్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా జరిగే ప్రమాదాల సంఖ్య ప్రతి ఏడాది అధికంగానే ఉంది. ఒక్క ఛండీగర్ పోలీసులు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల పోలీస్ వ్యవస్థలు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు తగ్గించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.

పార్కింగ్ చేసిన కారులో మద్యం సేవించడం

ఎవరెన్ని చేసినా... మన జీవితం మనదే. మనల్ని కోల్పోతే మన కుంటుంబానికి భరోసా కల్పించేవారు ఎవ్వరూ ఉండరు. కాబట్టి, సురక్షితమైన ప్రయాణ మీకు మాత్రమే కాదు, మీ కుంటుంబ సభ్యులకు కూడా సంతోషాన్ని కలిగిస్తుంది.

Most Read Articles

English summary
Read In Telugu: Drinking in car will get your vehicle impounded: Cops
Story first published: Saturday, July 28, 2018, 18:45 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X