సింగల్ ఛార్జింగ్‌తో 177కిమీలు ప్రయాణించే ఎలక్ట్రిక్ బస్సును విడుదల చేసిన ఐషర్

వాణిజ్య వాహనాల తయారీ సంస్థ ఐషర్ ఇండియన్ మార్కెట్లోకి స్కైలైన్ ప్రొ ఎలక్ట్రిక్ బస్సులను విడుదల చేసింది. ఈ స్కైలైన్ ప్రొ ఇ బస్సు ఐషర్ యొక్క భారతదేశపు తొలి ఎలక్ట్రిక్ బస్సు.

By Anil

Recommended Video

Auto Rickshaw Explodes In Broad Daylight

వాణిజ్య వాహనాల తయారీ సంస్థ ఐషర్ ఇండియన్ మార్కెట్లోకి స్కైలైన్ ప్రొ ఎలక్ట్రిక్ బస్సులను విడుదల చేసింది. ఈ స్కైలైన్ ప్రొ ఇ బస్సు ఐషర్ యొక్క భారతదేశపు తొలి ఎలక్ట్రిక్ బస్సు. కెపిఐటి టెక్నాలజీస్ భాగస్వామ్యంతో అభివృద్ది చేసిన ఎలక్ట్రిఫికేషన్ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఐషర్ తమ స్కైలైన్ ప్రొ ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేసింది.

ఐషర్ ఎలక్ట్రిక్ బస్సులు

ఐషర్ పరిచయం చేసిన స్కైలైన్ ప్రొ ఎలక్ట్రిక్ బస్సులో ఉన్న రివోల్వో ఎలక్ట్రిఫికేషన్ సిస్టమ్‌ను పలు రకాల కార్లు మరియు బస్సుల్లో ఉపయోగించుకోవచ్చు. ఎలక్ట్రిక్ పవర్ డ్రైవ్ సిస్టమ్‌లో ఎలక్ట్రిక్ మోటార్, ఎలక్ట్రిక్ మోటార్ కంట్రోల్, బ్యాటరీ ప్యాక్ మరియు బ్యాటరీ మేనేజ్‌మెంట్ వంటి వ్యవస్థలు ఉన్నాయి.

ఐషర్ ఎలక్ట్రిక్ బస్సులు

ఐషర్ కథనం మేరకు, స్కైలైన్ ప్రొ ఎలక్ట్రిక్ బస్సులు 36 శాతం వరకు రీజనరేటివ్ పవర్‌ను వినియోగించుకుంటాయి. దీంతో ఒక్క కిలోమీటర్‌కు కేవలం 0.8 యూనిట్ల విద్యుత్‌ మాత్రమే అవసరం అవుతుంది.

ఐషర్ ఎలక్ట్రిక్ బస్సులు

ఐషర్ స్కైలైన్ ప్రొ ఎలక్ట్రిక్ బస్సు ఒక్కసారి ఛార్జింగ్‌తో గరిష్టంగా 177కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. బ్యాటరీ పవర్‌తో ఏ/సి సిస్టమ్ కూడా రన్ అవుతుంది. ఇండియన్ ఎలక్ట్రిక్ బస్సుల సెగ్మెంట్లో బివైడి సంస్థ తరువాత ఎలక్ట్రిక్ బస్సును పరిచయం చేసిన సంస్థ ఐషర్.

ఐషర్ ఎలక్ట్రిక్ బస్సులు

సరికొత్త స్కైలైన్ ప్రొ ఎలక్ట్రిక్ బస్సును స్కైలైన్ ప్రొ ఫ్లాట్‌ఫామ్ మీద తొమ్మిది మీటర్ల పొడవుతో నిర్మించారు. బస్సు మొత్తానికి ఏ/సి వ్యవస్థ కూడా ఉంది. ఈ ఎలక్ట్రిక్ బస్సులో టాప్ అప్ ఛార్జర్ మరియు తక్కువ ఓల్టేజ్ వద్ద కూడా నడిచేలా రివోల్వో టెక్నాలజీ కలిగి ఉంది.

ఐషర్ ఎలక్ట్రిక్ బస్సులు

ఐషర్ స్కైలైన్ ప్రొ ఎలక్ట్రిక్ బస్సులు భద్రత మరియు ఇండియన్ రోడ్ల మీద తిరిగేందుకు కావాల్సిన అన్ని అనుమతులను పొందింది. ఐషర్ ఇండియా విభాగం తమ స్కైలైన్ ప్రొ ఎలక్ట్రిక్ బస్సులను మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ప్రొడక్షన్ ప్లాంటులో ఉత్పత్తి చేస్తోంది.

ఐషర్ ఎలక్ట్రిక్ బస్సులు

ఐషర్ వాణిజ్య వాహనాల మేనేజింగ్ డైరక్టర్ మరియు సిఇఒ వినోద్ అగర్వాల్ మాట్లాడుతూ, " ఐషర్ మరియు కెపిఐటి టెక్నాలజీస్ లిమిటెడ్ భాగస్వామ్యంతో పూర్తి స్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ది చేసిన ఎలక్ట్రిక్ బస్సులను మార్కెట్లోకి ప్రవేశపెట్టామని తెలిపాడు."

ఐషర్ ఎలక్ట్రిక్ బస్సులు

"భారత రోడ్ల మీద తిరగడానికి మరియు సేఫ్టీ పరంగా అన్ని అనుమతులు పొందిన స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కైలైన్ ప్రొ ఇ బస్సు ఇండియన్ మార్కెట్లో కీలకపాత్ర పోషించనుంది. రోజు వారి ప్రజా రవాణా మరియు సిటీ కమ్యూటర్ అవసరాలకు ఈ బస్సులు ఎంతగానో ఉపయోగపడునున్నాయని ఆయన చెప్పుకొచ్చాడు."

ఐషర్ ఎలక్ట్రిక్ బస్సులు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

భారత ప్రభుత్వం 2030 నాటికి కేవలం ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే విక్రయాలకు అనుతించే లక్ష్యంతో ఉంది. ఈ నేపథ్యంలో వాణిజ్య ప్రజా రవాణాకు అవసరమయ్యే ఎలక్ట్రిక్ బస్సును ఐషర్ పరిచయం చేసింది.

ఐషర్ సంస్థ తమ సేల్స్ మైలురాయిని అధిగమించడంలో ఈ స్కైలైన్ ప్రొ ఎలక్ట్రిక్ బస్సు కీలకపాత్ర పోషించనుంది. ఒక్కసారి ఛార్జింగ్‌తో 177కిలోమీటర్లు ప్రయాణిస్తుంది కాబట్టి మైలేజ్ ప్రియులను ఈ బస్సు ఎంతగానో ఆకట్టుకోనుంది.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

Most Read Articles

English summary
Read In Telugu: Eicher Introduces Skyline Pro Electric Bus In India
Story first published: Tuesday, February 6, 2018, 16:55 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X