ఒక్కసారి ఛార్జింగ్‌తో 200కిమీలు ప్రయాణించే ఎలక్ట్రిక్ బస్సులు విడుదల

By Anil Kumar

వాణిజ్య వాహనాల తయారీ సంస్థ గోల్డ్‌స్టోన్ బివైడి విపణిలోకి సరికొత్త ఇబజ్ కె6 బస్సును లాంచ్ చేసింది. పట్టణ ప్రజా రవాణా కోసం అభివృద్ది చేసిన ఈ ఇబజ్ కె6 ఎలక్ట్రిక్ బస్సు ఒక్కసారి ఛార్జింగ్‌తో గరిష్టంగా 200కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ పేర్కొంది.

గోల్డ్‌స్టోన్ ఎలక్ట్రిక్ బస్సులు

గోల్డ్‌స్టోన్ ఇన్‌ఫ్రాటెక్ చైనాకు చెందిన దిగ్గజ వాహన తయారీ సంస్థ బివైడి భాగస్వామ్యంతో ఇండియన్ మార్కెట్లోకి అర్బన్ ఎలక్ట్రిక్ బస్సును లాంచ్ చేసింది. ఇబజ్ కె6 పేరుతో విడుదల చేసిన దీని పొడవు 7-మీటర్లుగా ఉంది మరియు దీని గరిష్ట పరిధి 200కిలోమీటర్లు.

గోల్డ్‌స్టోన్ ఎలక్ట్రిక్ బస్సులు

ప్రపంచ వ్యాప్తంగా లిథియం-అయాన్ పాస్పేట్ బ్యాటరీలను తయారు చేస్తున్న కంపెనీలలో చైనాకు చెందిన బివైడ్ సంస్థ ఒకటి. లిథియం-అయాన్ పాస్పేట్ బ్యాటరీల అనుసంధానం గల ఎలక్ట్రిక్ మోటార్లు గరిష్టంగా 241బిహెచ్‌పి పవర్ మరియు 1500ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి.

గోల్డ్‌స్టోన్ ఎలక్ట్రిక్ బస్సులు

ఇండియాలో వాణిజ్య వాహనాల మీద ఉన్న నిభందనలకు అనుగుణంగా దీని గరిష్ట వేగాన్ని గంటకు 80కిలోమీటర్లుగా నిర్ధేశించారు. అంతే కాకుండా ఇందులో రీజనరేటివ్ బ్రేకింగ్ కలదు, ఇది బ్రేకులు అప్లే చేసినపుడు విద్యుత్ ఉత్పత్తి చేసి బ్యాటరీలను ఛార్జ్ చేస్తుంది. మరియు మెరుగైన బ్రేకింగ్ వ్యవస్థ కోసం అన్ని చక్రాలకు డిస్క్ బ్రేకులు ఉన్నాయి.

గోల్డ్‌స్టోన్ ఎలక్ట్రిక్ బస్సులు

సేఫ్టీ కోసం గోల్డ్‌స్టోన్ తమ ఇబజ్ కె6 ఎలక్ట్రిక్ బస్సులో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్‌ను తప్పనిసరిగా అందించింది. ఛార్జింగ్ పూర్తిగా అయిపోయిన బ్యాటరీలను ఏసి క్విక్ ఛార్జర్ ద్వారా కేవలం 4 గంటల్లోనే బ్యాటరీలను పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు.

గోల్డ్‌స్టోన్ ఎలక్ట్రిక్ బస్సులు

ఈ బస్సులో నలుమూలలా ఎయిర్ సస్పెన్షన్ సిస్టమ్ స్టాండర్డ్ ఫీచర్‌గా ఉంది. ప్రస్తుతం 30 శాతం దేశీయంగా తయారైన ఉత్పత్తులతో బస్సును తయారు చేస్తున్నారు. అయితే, 2020 నాటికి 70 శాతం వరకు దేశీయంగా తయారైన విడి పరికరాలతో నిర్మించే ఆలోచనలో బివైడ్ ఉంది.

గోల్డ్‌స్టోన్ ఎలక్ట్రిక్ బస్సులు

బివైడ్ సంస్థ ఇండియాలో తయారయ్యే తమ బస్సుల కోసం మాత్రమే ఎలక్ట్రిక్ బ్యాటరీలను ఉత్పత్తి చేయనుంది. అంతే కాకుండా, ఎలక్ట్రిక్ మోటార్లు వంటి ఇతర ప్రధాన విడిపరికరాల తయారీ కోసం ప్రాంతీయ సంస్థలతో చేతులు కలిపేందుకు సిద్దంగా ఉంది.

గోల్డ్‌స్టోన్ ఎలక్ట్రిక్ బస్సులు

గోల్డ్‌స్టోన్ ఇన్‌ఫ్రాటెక్ ఎక్సిక్యూటివ్ డైరక్టర్ నాగ సత్యం మాట్లాడుతూ, "దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన నగరాల్లో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించుకుంది. అందులో భాగంగానే ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ది, తయారీ మరియు విక్రయాలను ప్రోత్సహించడానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తోంది. రానున్న కాలంలో ఎలక్ట్రిక్ బస్సులు డీజల్ మరియు సిఎన్‌జి బస్సుల స్థానాన్ని ఖచ్చితంగా భర్తీ చేస్తాయమని విశ్వాసం వ్యక్తం చేశాడు."

Most Read Articles

English summary
Read In Telugu: Electric Urban Bus With Over 200 km Range Launched In India By Goldstone BYD
Story first published: Monday, June 11, 2018, 10:19 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X