బెంగళూరులో డ్రైవ్‌స్పార్క్‌ బృందానికి పట్టుబడిన కియా సెరాటో

2018 కియా సెరాటోను ఇండియన్ రోడ్ల మీద రహస్యంగా పరీక్షిస్తుండాగా పట్టుబడింది. కియా సెరాట్ కారును బెంగళూరులోని కోరమంగళ పరిసర ప్రాంతాల్లో పరీక్షిస్తుండగా డ్రైవ్‌స్పార్క్ బృందం గుర్తించింది.

By Anil Kumar

2018 కియా సెరాటోను ఇండియన్ రోడ్ల మీద రహస్యంగా పరీక్షిస్తుండాగా పట్టుబడింది. కియా సెరాటో కారును బెంగళూరులోని కోరమంగళ పరిసర ప్రాంతాల్లో పరీక్షిస్తుండగా డ్రైవ్‌స్పార్క్ బృందం గుర్తించింది.

దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్ 2019 నుండి మార్కెట్లో అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించనుంది. కియా విడుదలకు సిద్దం చేసుకుంటున్న పలు మోడళ్లలో కియా సెరాటో సెడాన్ కూడా ఒకటి.

కియా సెరాటో

కియా మోటార్స్ ఈ సెరాటో సెడాన్ కారును మొట్టమొదటిసారిగా రోడ్డకు మీదకు తీసుకొచ్చింది. వచ్చే ఏడాది నుండి ఇండియాలో తయారీ, సేల్స్ మరియు సర్వీస్ ప్రారంభిస్తున్నట్లు కియా ఇది వరకే వెల్లడించింది. కియా ఇండియాలో తయారు చేయనున్న మోడళ్లలో ఎస్‌పి కాన్సెప్ట్ మోడల్ ఆధారిత ట్రెజోర్ ఎస్‌యూవీ కూడా ఉంది.

కియా సెరాటో

కియా సెరాటో ఫ్రంట్ డిజైన్ దేశీయంగా ఇప్పటి వరకు పరిచయమైన సెడాన్ మోడళ్ల కంటే చాలా భిన్నంగా ఉంది. ఫ్రంట్ డిజైన్‌లో కియా సిగ్నేచర్ బటర్ ప్లై గ్రిల్, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్ల జోడింపుతో ఉన్న పలుచటి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అమరిక అత్యంత ఆకర్షణీయంగా ఉంది. అంతే కాకుండా ఫ్రంట్ బంపర్‌లో ఫాగ్ ల్యాంప్స్ మరియు ఎయిర్ ఇంటేకర్ గమనించవచ్చు.

కియా సెరాటో

కియా సెరాటో సైడ్ ప్రొఫైల్‌లో బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ మరియు ఇంటిగ్రేటెడ్ టర్న్ సిగ్నల్స్ గల అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్ ఉన్నాయి. స్పై ఫోటోల ద్వారా సెరాటో సెడాన్‌లో ఉన్న 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ గమనించవచ్చు. రియర్ బూట్ లిడ్‌కు ఇరువైపులా ఉన్న వ్రాప్ అరౌండ్ టెయిల్ ల్యాంప్స్ మరియు మధ్యలో కియా లోగోను అందివ్వడం జరిగింది. సెరాటో రియర్ బంపర్‌లో ఇరువైపులా రెడ్ రిఫ్లెక్టర్స్ ఉన్నాయి.

కియా సెరాటో

కియా సెరాటో ఎక్ట్సీరియర్ మొత్తానికి గమనించినప్పటికీ, ఇంటీరియర్ సాధ్యపడలేదు. కానీ, ప్రీమియం సెడాన్ సెగ్మెంట్లోకి రానున్న కియా సెరాటో ఇంటీరియర్‌లో ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ అప్లికేషన్లను సపోర్ట్ చేయగల 7-అంగుళాల పరిమాణంలో ఉన్న టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు రానున్నాయి.

కియా సెరాటో

భద్రత పరంగా కియా సెరాటో సెడాన్‌లో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, సెంట్రల్ లాకింగ్, రియర్ పార్కింగ్ సెన్సార్, రివర్స్ పార్కింగ్ కెమెరా, ఆరు ఎయిర్ బ్యాగులు మరియు హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

కియా సెరాటో

కియా సెరాటో సాంకేతికంగా రెండు ఇంజన్ ఆప్షన్‌లతో పరిచయం అయ్యే అవకాశం ఉంది. అవి, 1.6-లీటర్ పెట్రోల్ మరియు 1.6-లీటర్ టుర్బోఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్. రెండు ఇంజన్‌లు 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభించనున్నాయి.

కియా సెరాటో

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కియా మోటార్స్ 2019 ఏడాదిలో ఎలాగైనా దేశీయ విపణిలోకి ప్రవేశించేందుకు సిద్దమైంది. ఈ నేపథ్యంలో విడుదలకు సిద్దం చేస్తున్న మోడళ్లను ఒక్కొక్కటిగా పరీక్షిస్తోంది. కియా సెరాటో పూర్తి స్థాయిలో విపణిలోకి విడుదలైతే, మార్కెట్లో ఉన్న మారుతి సుజుకి సియాజ్, హ్యుందాయ్ వెర్నా మరియు హోండా సిటీ వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

Most Read Articles

English summary
Read in Telugu: Exclusive: The 2018 Kia Cerato Spotted In India For The First Time — To Rival The Hyundai Verna
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X