4 లక్షల ధరలో లభించే ఐదు పెట్రోల్ కార్లు

అతి తక్కువ ధరతో బెస్ట్ బడ్జెట్ కారును ఎంచుకోవాలనుకుంటున్నారు. అయితే, 4 లక్షల ధరలోపు లభించే ఐదు అత్యుత్తమ పెట్రోల్ కార్లు గురించి ఇంజన్, పవర్, మైలేజ్, ఫీచర్లు మరియు ధర వంటి వివరాలు పరంగా ఇవాళ్టి స్టో

By Anil Kumar

ఇండియన్ మార్కెట్లోకి ప్రతి నెలా కొత్త కార్లు విడుదలవుతూనే ఉన్నాయి. అయితే, లెక్కలేనన్ని మోడళ్ల విడుదలవుతుండటంతో బడ్జెట్ ధరలో చిన్న కార్లను ఎంచుకోవాలనుకునే కస్టమర్లు తికమకపడుతూనే ఉన్నారు.

అతి తక్కువ ధరతో బెస్ట్ బడ్జెట్ కారును ఎంచుకోవాలనుకుంటున్నారు. అయితే, 4 లక్షల ధరలోపు లభించే ఐదు అత్యుత్తమ పెట్రోల్ కార్లు గురించి ఇంజన్, పవర్, మైలేజ్, ఫీచర్లు మరియు ధర వంటి వివరాలు పరంగా ఇవాళ్టి స్టోరీ మీద ఓ లుక్కేసుకుందాం రండి....

4 లక్షల ధరలో ఐదు బెస్ట్ పెట్రోల్ కార్లు

5. రెనో క్విడ్

రెనో క్విడ్ తొలుత 2015లో మారుతి ఆల్టో 800 కారుకు సరాసరి పోటీగా విడుదలయ్యింది. రెనో డస్టర్ డిజైన్ శైలిలో వీల్ ఆర్చెస్ చుట్టూ బ్లాక్ ప్లాస్టిక్ క్లాడింగ్ మరియు కండలు తిరిగిన డిజైన్ ఈ హ్యాచ్‌బ్యాక్ కారు చిన్న సైజు ఎస్‌యూవీని తలపిస్తుంది. మారుతి తరహా దేశవ్యాప్తంగా విసృతమైన డీలర్‌షిప్ నెట్‌వర్క్ రెనో ఇండియాకు ఉంటే క్విడ్ దెబ్బకు ఆల్టో 800 ఎప్పుడో చతికిలపడిపోయేది.

4 లక్షల ధరలో ఐదు బెస్ట్ పెట్రోల్ కార్లు

సాంకేతికంగా రెనో క్విడ్ 53బిహెచ్‌పి పవర్ మరియు 72ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే 799సీసీ కెపాసిటి గల మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్‌, 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌‌బాక్స్ అనుసంధానంతో లభిస్తోంది. తరువాత ఆలస్యంగా 1.0-లీటర్ ఇంజన్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో క్విడ్ హ్యాచ్‌బ్యాక్‌ను పరిచయం చేసింది.

4 లక్షల ధరలో ఐదు బెస్ట్ పెట్రోల్ కార్లు

రెనో క్విడ్ 800 మైలేజ్ లీటరుకు 25.17కిలోమీటర్లుగా ఉంది. రెనో క్విడ్ ప్రారంభ వేరియంట్ ఎస్‌టిడి ధర రూ. 2.66 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉంది. ఈ ఎంట్రీ లెవల్ కారు గత రెండేళ్ల కాలంలో రెనో ఇండియాకు ఎన్నో విజయాలు సాధించిపెట్టింది.

4 లక్షల ధరలో ఐదు బెస్ట్ పెట్రోల్ కార్లు

4. మారుతి సుజుకి ఆల్టో 800

కారు కొనాలనే ఎంతో మంది మధ్య తరగతి ప్రజల కలను మారుతి ఆల్టో 800 నెరవేర్చింది. ఇండియన్ మార్కెట్లోకి మారుతి ఆల్టో 800 పరిచయమై కొన్ని సంవత్సరాలు గడిచిపోయినా... ఇప్పటికీ తిరుగులేని సేల్స్ సాధిస్తోంది. దేశీయ విపణిలోకి విడుదలైనప్పటి నుండి అత్యధికంగా అమ్ముడుపోయిన కారు మారుతి ఆల్టో. గత రెండు దశాబ్దాల కాలంలో ఏకంగా 35 లక్షల ఆల్టో కార్లు అమ్ముడయ్యాయి.

4 లక్షల ధరలో ఐదు బెస్ట్ పెట్రోల్ కార్లు

ఆల్టో 800 కు పోటీగా ఎన్నో చిన్న కార్లు వచ్చిన దారినే వెళ్లిపోయాయి. కానీ, ఆల్టో 800 సృష్టించిన సామ్రాజ్యాన్ని కూల్చలేకపోయాయి. అత్యంత ప్రాచుర్యం పొందిన ఆల్టో 800లో 48బిహెచ్‌పి పవర్-69ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే 5-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల 799సీసీ పెట్రోల్ ఇంజన్ ఉంది.

4 లక్షల ధరలో ఐదు బెస్ట్ పెట్రోల్ కార్లు

మారుతి ఆల్టో 800 మైలేజ్ లీటరుకు 24.7కిలోమీటర్లుగా ఉంది. మారుతి ఆల్టో 800 ప్రారంభ వేరియంట్ ఎస్‌టిడి ధర రూ. 2.66 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

4 లక్షల ధరలో ఐదు బెస్ట్ పెట్రోల్ కార్లు

3. డాట్సన్ రెడి-గో

అత్యంత సరసమైన కార్ల తయారీ సంస్థగా పేరుగాంచిన డాట్సన్ దేశీయంగా గో మరియు గో ప్లస్ కార్లతో ప్రవేశించింది. చిన్న హ్యాచ్‌బ్యాక్ కార్లకు ఉన్న డిమాండును పసిగట్టిన డాట్సన్ వెంటనే రెడి-గో కారును విపణిలోకి లాంచ్ చేసింది.

4 లక్షల ధరలో ఐదు బెస్ట్ పెట్రోల్ కార్లు

అన్ని రకాల మార్గాల్లో సునాయసంగా దూసుకెళ్లే డాట్సన్ రెడి-గో హ్యాచ్‌‌బ్యాక్ కారులో రెనో అభివృద్ది చేసిన 799సీసీ కెపాసిటి మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్‌ కలదు. 5-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది 53బిహెచ్‌పి పవర్ మరియు 72ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

4 లక్షల ధరలో ఐదు బెస్ట్ పెట్రోల్ కార్లు

డాట్సన్ రెడి-గో 800సీసీ ఇంజన్, 1.0-లీటర్ ఇంజన్‌‌లతో పాటు మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లలో లభ్యమవుతోంది. డాట్సన్ రెడి-గో ప్రారంభ వేరియంట్ డి(D) ధర రూ. 2.5 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉంది. రెడి-గో 800 మైలేజ్‌ 22.7కిలోమీటర్లుగా ఉంది.

4 లక్షల ధరలో ఐదు బెస్ట్ పెట్రోల్ కార్లు

2. మారుతి సుజుకి ఆల్టో కె10

మారుతి సుజుకి ఆల్టో 800 కారుకు కొనసాగింపుగా ఆల్టో కె10 మోడల్‌ను తొలిసారిగా 2010లో ప్రవేశపెట్టింది. స్టాండర్డ్ ఆల్టో 800తో పోల్చుకుంటే ఆల్టో కె10 కాస్త పెద్దదిగా ఉంటుంది. దీనికి తోడు శక్తివంతమైన 1000సీసీ ఇంజన్‌తో వచ్చింది.

4 లక్షల ధరలో ఐదు బెస్ట్ పెట్రోల్ కార్లు

సాంకేతికంగా మారుతి ఆల్టో కె10 కారులోని 1.0-లీటర్ లేదా 1000సీసీ కెపాసిటి గల మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ 67బిహెచ్‌పి పవర్ మరియు 90ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనిని 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ ఆప్షన్‌‌లో ఎంచుకోవచ్చు.

4 లక్షల ధరలో ఐదు బెస్ట్ పెట్రోల్ కార్లు

మారుతి ఆల్టో కె10 ప్రారంభ వేరియంట్ ఎల్ఎక్స్ ధర రూ. 3.45 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉంది. 1000సీసీ కెపాసిటి గల ఆల్టో కె10 మైలేజ్ లీటరుకు 24.07కిలోమీటర్లుగా ఉంది.

4 లక్షల ధరలో ఐదు బెస్ట్ పెట్రోల్ కార్లు

1. టాటా టియాగో

ఎంట్రీ లెవల్ ప్యాసింజర్ కార్ల మార్కెట్లో టాటా మోటార్స్‌కు భారీ విజయాన్ని సాధించిపెట్టిన ఏకైక మోడల్ టాటా టియాగో. సరికొత్త డిజైన్, అధునాతన ఫీచర్లు మరియు రివట్రాన్ మరియు రివోటార్క్ అనే రెండు సరికొత్త ఇంజన్ ఆప్షన్‌లో విడుదలైన టాటా టియాగో అద్భుతమైన సేల్స్‌తో ఇప్పుడు చిన్న కార్ల పరిశ్రమను శాసిస్తోంది.

4 లక్షల ధరలో ఐదు బెస్ట్ పెట్రోల్ కార్లు

టాటా టియాగో 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.05-లీటర్ డీజల్ ఇంజన్‌లతో లభ్యమవుతోంది. ఇందులో 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో లభించే పెట్రోల్ ఇంజన్ 84బిహెచ్‌పి పవర్ మరియు 114ఎన్ఎమ్ ప్రొడ్యూస్ చేస్తుంది.

4 లక్షల ధరలో ఐదు బెస్ట్ పెట్రోల్ కార్లు

టాటా టియాగో పెట్రోల్ ప్రారంభ వేరియంట్ రివట్రాన్ ఎక్స్‌బి ధర రూ. 3.46 లక్షలు. టియాగో పెట్రోల్ వేరియంట్ మైలేజ్ లీటరుకు 23.84కిలోమీటర్లుగా ఉంది.

4 లక్షల ధరలో ఐదు బెస్ట్ పెట్రోల్ కార్లు

1.కారు డ్రైవ్ చేస్తూ గొడవపడిన భార్య భర్తలు: నలుగురు స్పాట్‌

2.60 లక్షలు కడితేగానీ రోడ్డెక్కనివ్వలేదు...!!

3. దిగ్గజాలను వణికిస్తోన్న టాటా కొత్త ఎస్‌యూవీలు

4.రివర్స్ గేర్ అతిగా వాడటం ఇంజన్‌కు మంచిది కాదా...?

5.స్టీరింగ్ వీల్ మధ్యలో ఎందుకు ఉండదో తెలుసా...?

Most Read Articles

English summary
Read In Telugu: Five petrol cars you can buy under Rs 4 lakh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X