షాకింగ్ న్యూస్: భారత్‌కు ఫోర్డ్ ఇకోస్పోర్ట్ ఆల్-వీల్-డ్రైవ్ వేరియంట్‌

ఫోర్డ్ ఇండియా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఇకోస్పోర్ట్ ఎస్‌యూవీని భారీ మార్పులు చేర్పులతో ఇటీవల లాంచ్ చేసింది. అయితే తాజాగా అందిన సమాచారం మేరకు, ఫోర్డ్ ఇకోస్పోర్ట్ ఆల్-వీల్-డ్రైవ్ వేరియంట్లో పరీక్షిస్తున్నట్లు

By Anil Kumar

ఇండియన్ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ ఎస్‌‌యూవీలో ఫోర్డ్ ఇకోస్పోర్ట్ ఒకటి. ఫోర్డ్ ఇండియా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఇకోస్పోర్ట్ ఎస్‌యూవీని భారీ మార్పులు చేర్పులతో ఇటీవల లాంచ్ చేసింది. అయితే తాజాగా అందిన సమాచారం మేరకు, ఫోర్డ్ ఇకోస్పోర్ట్ ఆల్-వీల్-డ్రైవ్ వేరియంట్లో పరీక్షిస్తున్నట్లు తెలిసింది.

ఫోర్డ్ ఇకోస్పోర్ట్ ఆల్ వీల్ డ్రైవ్ వేరియంట్

మీరు చదివింది నిజమే, ఫోర్డ్ ఇండియా తమ ఇకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఫోర్-వీల్-డ్రైవ్ మోడల్‌కు పాండిచ్చేరిలో పరీక్షలు నిర్వహిస్తుండగా పట్టుపడింది. సాధారణ ఇకోస్పోర్ట్ మిడిల్ వేరియంట్ ఎస్ఇ ఆధారంగా ఫోర్-వీల్-డ్రైవ్ వేరియంట్‌ను పరీక్షిస్తున్నట్లు తెలిసింది.

ఫోర్డ్ ఇకోస్పోర్ట్ ఆల్ వీల్ డ్రైవ్ వేరియంట్

ఫోర్డ్ ఇండియా ఈ ఎస్ఇ మోడల్‌ను ఎగుమతి కూడా చేస్తోంది. ప్రస్తుతం, అమెరికా వంటి పలు విదేశీ మార్కెట్లకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. వాటిలో కాంపాక్ట్ ఎస్‌యూవీ యొక్క ఫోర్-వీల్-డ్రైవ్ పెట్రోల్ వేరియంట్లను కూడా ఎగుమతి చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఫోర్డ్ ఇకోస్పోర్ట్ ఆల్ వీల్ డ్రైవ్ వేరియంట్

ఫోర్డ్ ఇకోస్పోర్ట్ ఫోర్-వీల్-డ్రైవ్ మోడల్‌లో సాంకేతికంగా అత్యంత శక్తివంతమైన 163బిహెచ్‌పి పవర్ మరియు 202ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ అనుసంధానంతో లభిస్తోంది.

ఫోర్డ్ ఇకోస్పోర్ట్ ఆల్ వీల్ డ్రైవ్ వేరియంట్

ఫోర్డ్ ఇకోస్పోర్ట్ ఫోర్-వీల్-డ్రైవ్ వేరియంట్ డిజైన్ పరంగా చూడటానికి అచ్చం రెగ్యులర్ వేరియంట్‌నే పోలి ఉన్నప్పటకీ కొలతల పరంగా కాస్త పెద్దదిగా కనిపిస్తుంది. అంతర్జాతీయ విపణిలో లభించే మోడల్‌లో రియర్ డోర్ మౌంటెడ్ స్పేర్ వీల్ లేదు, కానీ ఇండియన్ వెర్శన్‌లో వెనుక డోరు మీద స్పేర్ వీల్ అటాచ్ చేసుకునే అవకాశం ఉంది. అదే విధంగా రియర్ డిజైన్‌లో 4WD బ్యాడ్జింగ్ గుర్తించవచ్చు.

ఫోర్డ్ ఇకోస్పోర్ట్ ఆల్ వీల్ డ్రైవ్ వేరియంట్

ఇండియన్ మార్కెట్లో ఉన్న ఇకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ పలు ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ అప్‌డేట్స్‌తో విడుదలయ్యింది. అంతే కాకుండా, సరికొత్త పెట్రోల్ ఇంజన్ కూడా పరిచయం చేసారు. ఇంటీరియర్‌లో ఎన్నో అత్యాధునిక ఫీచర్లను జోడించడం జరిగింది.

ఫోర్డ్ ఇకోస్పోర్ట్ ఆల్ వీల్ డ్రైవ్ వేరియంట్

ఫోర్డ్ ఇండియా ఇకోస్పోర్ట్ ఫేస్‌పలిఫ్ట్ ఎస్‌యూవీలో సరికొత్త 1.5-లీటర్ మూడు సిలిండర్ల డ్రాగన్ సిరీస్ పెట్రోల్ ఇంజన్ పరిచయం చేసింది. 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభించే ఇది గరిష్టంగా 120బిహెచ్‌పి పవర్ మరియు 150ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

ఫోర్డ్ ఇకోస్పోర్ట్ ఆల్ వీల్ డ్రైవ్ వేరియంట్

ఫోర్డ్ ఇటీవల తమ ఇకోస్పోర్ట్ ఎస్‌యూవీలో 1-లీటర్ కెపాసిటి గల ఎకోబూస్టర్‌ పెట్రోల్ ఇంజన్ పరిచయం చేసింది. ఇది గరిష్టంగా 125బిహెచ్‌పి పవర్ మరియు 170ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

ఫోర్డ్ ఇకోస్పోర్ట్ ఆల్ వీల్ డ్రైవ్ వేరియంట్

ఫోర్డ్ ఇకోస్పోర్ట్ డీజల్ వేరియంట్ యథావిధిగా 98.6బిహెచ్‍‌పి పవర్ మరియు 215ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగల 1.5-లీటర్ డీజల్ ఇంజన్‌తో లభ్యమవుతోంది. ఇప్పటి వరకు అన్ని ఇంజన్ వేరియంట్లు కూడ్ ఫ్రట్-వీల్ డ్రైవ్‌తో మాత్రమే లభ్యమవుతున్నాయి.

ఫోర్డ్ ఇకోస్పోర్ట్ ఆల్ వీల్ డ్రైవ్ వేరియంట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఫోర్డ్ ఇండియాకు ఉన్న బెస్ట్ సెల్లింగ్ మోడళ్లలో ఇకోస్పోర్ట్ ఎస్‌యూవీ ఒకటి. అంతర్జాతీయంగా ఎగుమతి చేస్తున్న ఆల్-వీల్-డ్రైవ్ వేరియంట్‌ను తాజాగా ఇండియన్ రోడ్ల మీద పరీక్షిస్తోంది. అయితే, దీనిని దేశీయ మార్కెట్ కోసం సిద్దం చేస్తోందా... లేదా అనే విషయం ఇంకా తెలియరాలేదు.

ప్రస్తుతానికైతే, ఇండియన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఆల్-వీల్-డ్రైవ్‌తో లభించే మోడల్ లేదు.

Most Read Articles

Source: IAB

English summary
Read In Telugu: Ford EcoSport Four-Wheel-Drive Variant Spotted Testing In India
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X