ఫోర్డ్ ఇకోస్పోర్ట్ గురించి గుండె పగిలే వార్త

ఫోర్డ్ ఇండియా 4,379 యూనిట్ల ఇకోస్పోర్ట్ ఎస్‌యూవీలను రీకాల్ చేసినట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. చెన్నైలోని కంపెనీ ప్రొడక్షన్ ప్లాంటులో మే మరియు జూన్ 2017 మధ్య కాలంలో తయారైన ఇకోస్పోర్ట్ ఎస్‌యూవీలను వెనక

By Anil Kumar

ఫోర్డ్ ఇండియా విక్రయిస్తున్న ఇకోస్పోర్ట్ ఎస్‌‌యూవీకి ఉన్న క్రేజ్ అందిరికీ తెలిసిందే. మార్కెట్లోకి ఎన్ని కొత్త ఎస్‌యూవీలు వచ్చినా ఇకోస్పోర్ట్ ప్రేమికుల మనసు మాత్రం మరల్చలేకపోతున్నాయి. ప్రతి నెలా మంచి విక్రయాలు సాధిస్తున్న ఫోర్డ్ ఇకోస్పోర్ట్ విషయంలో గుండె పగిలే వార్తను ప్రకటించింది.

ఫోర్డ్ ఇకోస్పోర్ట్ రీకాల్

ఫోర్డ్ ఇండియా 4,379 యూనిట్ల ఇకోస్పోర్ట్ ఎస్‌యూవీలను రీకాల్ చేసినట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. చెన్నైలోని కంపెనీ ప్రొడక్షన్ ప్లాంటులో మే మరియు జూన్ 2017 మధ్య కాలంలో తయారైన ఇకోస్పోర్ట్ ఎస్‌యూవీలను వెనక్కి పిలిచింది.

ఫోర్డ్ ఇకోస్పోర్ట్ రీకాల్

ఇకోస్పోర్ట్ ఎస్‌యూవీకి ముందు వైపునున్న లోయర్ కంట్రోల్ ఆర్మ్ వెల్డింగ్ ఇంటిగ్రిటినీ పరీక్షించడానికి రీకాల్ చేసినట్లు ప్రకటించింది. ఫోర్డ్ కథనం మేరకు, రీకాల్‌కు గురైన ఎస్‌యూవీలలో వెల్డింగ్ సామర్థ్యం చాలా తక్కువగా ఉన్నట్లు తెలిసింది. దీని వలన స్టీరింగ్ కంట్రోల్ మీద ప్రభావం పడే అవకాశం ఉంది.

ఫోర్డ్ ఇకోస్పోర్ట్ రీకాల్

అంతే కాకుండా నవంబరు మరియు డిసెంబరు 2017 మధ్య కాలంలో తయారైన 1,018 ఇకోస్పోర్ట్ వాహనాల ఓనర్లకు రీకాల్‌కు సంభందించిన వివరాలతో ప్రత్యేక లెటర్లను వ్రాసింది. ఈ వాహనాలలో డ్రైవర్ మరియు ఫ్రంట్ ప్యాసింజర్ల సీట్ రిక్లైనర్ లాక్‌లను పరిశీలించనున్నారు.

ఫోర్డ్ ఇకోస్పోర్ట్ రీకాల్

ఫోర్డ్ ఇండియా ఇటీవల ఇకోస్పోర్ట్ ఎస్‌యూవీ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను లాంచ్ చేసింది. జూన్ 2018లో కంపెనీ 37 శాతం వృద్దిని నమోదు చేసుకుంది. గత ఏడాది జూన్‌లో 6,149 యూనిట్లను విక్రయించగా, ఈ ఏడాది అదే నెలలో 8,444 యూనిట్లను విక్రయించింది.

ఫోర్డ్ ఇకోస్పోర్ట్ రీకాల్

ఏదేమైనప్పటికీ, ఫోర్డ్ విదేశీ ఎగుమతులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. జూన్ 2017లో 14,649 యూనిట్లను ఎగుమతి చేయగా, ఈ యేడు అదే నెలలో 10,386 యూనిట్లకు పడిపోయాయి.

ఫోర్డ్ ఇకోస్పోర్ట్ రీకాల్

అంతే కాకుండా, ఫోర్డ్ ఇండియా సేల్స్ పది లక్షల మైలురాయిని అందుకున్నాయి. ఈ సందర్భంగా ఫోర్డ్ ఇండియా ప్రెసిడెంట్ మరియు మేనేజింగ్ డైరక్టర్ అనురాగ్ మెహ్రోత్రా మాట్లాడుతూ, "దేశీయ విక్రయాల్లో ఫోర్డ్ ఇండియా పది లక్షల యూనిట్ల విక్రయాలతో ఒక కొత్త రికార్డును నెలకొల్పడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు."

ఫోర్డ్ ఇకోస్పోర్ట్ రీకాల్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

రీకాల్‌కు గురైన ఇకోస్పోర్ట్ ఎస్‌యూవీలకు స్వచ్చందంగా పరీక్షలు నిర్వహించడానికి ఫోర్డ్ ఇండియా ముందుకొచ్చింది. కంపెనీ యొక్క నిబద్ధతలో భాగంగా ప్రపంచ స్థాయి నాణ్యతను తమ కస్టమర్లకు అందివ్వడం కోసం ఈ రీకాల్ ప్రకటించింది.

Most Read Articles

English summary
Read In Telugu: Ford India Recalls Over 4000 EcoSport SUVs For Voluntary Inspection
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X