ఫోర్డ్ ఇకోస్పోర్ట్ ఇప్పుడు మరో రెండు కొత్త వేరియంట్లలో

ఫోర్డ్ ఇండియా తమ ఇకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని మరో రెండు కొత్త వేరియంట్లలో విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ఫోర్డ్ ఇకోస్పోర్ట్ అతి త్వరలో టైటానియం ఎస్ మరియు సిగ్నేచర్ ఎడిషన్ వేరియంట్లలో

By Anil Kumar

ఫోర్డ్ ఇండియా తమ ఇకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని మరో రెండు కొత్త వేరియంట్లలో విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ఫోర్డ్ ఇకోస్పోర్ట్ అతి త్వరలో టైటానియం ఎస్ మరియు సిగ్నేచర్ ఎడిషన్ వేరియంట్లలో పరిచయం కానుంది. తాజాగా అందిన సమాచారం మేరకు, దేశవ్యాప్తంగా ఉన్న ఫోర్డ్ డీలర్లు ఈ రెండు వేరియంట్ల మీద బిల్లులు కూడా వేస్తున్నారు.

ఫోర్డ్ ఇకోస్పోర్ట్ ఇప్పుడు మరో రెండు కొత్త వేరియంట్లలో

ఫోర్డ్ ఇకోస్పోర్ట్ టైటానియం ఎస్ మరియు సిగ్నేచర్ ఎడిషన్ డెమో కార్లను ఈ నెల మొదటి లేదా రెండవ వారంలో అందుబాటులో ఉంచే అవకాశం ఉంది. ఈ రెండు కొత్త వేరియంట్లలో పలు కాస్మొటిక్ అప్‌డేట్స్ మరియు అదనపు ఫీచర్లు రానున్నాయి.

ఫోర్డ్ ఇకోస్పోర్ట్ ఇప్పుడు మరో రెండు కొత్త వేరియంట్లలో

ఫోర్డ్ ఇకోస్పోర్ట్ టైటానియం ఎస్ మరియు సిగ్నేచర్ ఎడిషన్ వేరియంట్లలో 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ మరియు ఎలక్ట్రిక్ సన్‌‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇకోస్పోర్ట్ టైటానియం ఎస్ వేరియంట్ ఎక్ట్సీరియర్‌లో స్మోక్డ్ ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, ఫాగ్ ల్యాంప్స్, బ్లాక్ పెయింటెడ్ రూఫ్ మరియు డార్క్ ఫినిషింగ్ గల ఫ్రంట్ గ్రిల్ వంటివి ఉన్నాయి.

ఫోర్డ్ ఇకోస్పోర్ట్ ఇప్పుడు మరో రెండు కొత్త వేరియంట్లలో

ఇకోస్పోర్ట్ టైటానియం ఎస్ వేరియంట్ ఇంటీరియర్‌లో బ్లాక్ థీమ్ డ్యాష్‌బోర్డ్, ఆరేంజ్ సొబగులున్న సీట్లు, డ్యాష్‍‌బోర్డ్ మరియు డోర్ ప్యాడ్స్ ఉన్నాయి. టైటానియం ప్లస్ వేరియంట్ ఆధారంతో వచ్చిన కొత్త వేరియంట్ టైటానియం ఎస్ వేరియంట్ అని సూచించే విధంగా, క్యాబిన్ మీద ఎస్ బ్యాడ్జింగ్ ఉంది. అదే విధంగా ఈ నూతన వేరియంట్లో టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఉంది.

ఫోర్డ్ ఇకోస్పోర్ట్ ఇప్పుడు మరో రెండు కొత్త వేరియంట్లలో

ఫోర్డ్ సిగ్నేచర్ ఎడిషన్ వేరియంట్లో రియర్ స్పాయిలర్, బ్లూ ఇంటీరియర్ మరియు సీట్ స్టిట్చింగ్ వంటి ప్రత్యేకతలున్నాయి. సిగ్నేచర్ ఎడిషన్‌లో ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రోల్ మరియు హిల్ లాంచ్ అసిస్ట్ వంటి అదనపు సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

ఫోర్డ్ ఇకోస్పోర్ట్ ఇప్పుడు మరో రెండు కొత్త వేరియంట్లలో

ఫోర్డ్ ఇకోస్పోర్ట్ టైటానియం ప్లస్ వేరియంట్ 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో ఎక్కువ కాలం పాటు లభించలేదు. వీటికి బదులుగా, 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నయి. ఏదేమైనప్పటికీ ఇకోస్పోర్ట్ టైటానియం ప్లస్ వేరియంట్ ధరలలో ఎలాంటి మార్పు జరగలేదు. వీటికి సంభందించిన బ్రోచర్లు ఫోర్డ్ వెబ్‌సైట్లో అతి త్వరలో లభించనున్నాయి.

ఫోర్డ్ ఇకోస్పోర్ట్ ఇప్పుడు మరో రెండు కొత్త వేరియంట్లలో

సాంకేతికంగా ఫోర్డ్ ఇకోస్పోర్ట్ రెండు కొత్త వేరియంట్లు కూడా 1.5-లీటర్ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లతో లభ్యం కానున్నాయి. పెట్రోల్ ఇంజన్ 123బిహెచ్‌పి పవర్ మరియు 150ఎన్ఎమ్ టార్క్, అదే విధంగా డీజల్ ఇంజన్ 99బిహెచ్‌పి పవర్ మరియు 205ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి. వీటిని మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లలో ఎంచుకోవచ్చు.

TeamBHPఫోర్డ్ ఇకోస్పోర్ట్ ఇప్పుడు మరో రెండు కొత్త వేరియంట్లలో

డ్రైవ్‍‌‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఫోర్డ్ ఇండియా ఇకోస్పోర్ట్ ఎస్‌యూవీ పలు ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ అప్‌డేట్స్‌తో మరో రెండు కొత్త వేరియంట్లలో లాంచ్ చేయడానికి సర్వం సిద్దం చేసుకుంది. రెండు వేరియంట్లు కూడా ఇకోస్పోర్ట్ లైనప్‌లో టాప్ ఎండ్ వేరియంట్లుగా ఉండనున్నాయి. ఇకోస్పోర్ట్ టైటానియం ఎస్ మరియు సిగ్నేచర్ ఎడిషన్ వేరియంట్లు మే 2018లో విడుదల చేసే అవకాశం ఉంది. కస్టమర్లు ఇప్పుడు బడ్జెట్ ధరలో మరిన్ని అదనపు ఆప్షన్‌లలో ఇకోస్పోర్ట్ ఎస్‌యూవీని ఎంచుకునే అవకాశం కల్పించింది.

Source: TeamBHP

Most Read Articles

Read more on: #ford #ఫోర్డ్
English summary
Read In Telugu: Ford EcoSport To Get Two New Variants — More Details Revealed
Story first published: Monday, May 7, 2018, 17:55 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X