ఫోర్డ్ ఫ్రీస్టైల్ కోసం ఎదురుచూస్తున్నారా...? అయితే ఇక స్వస్తి పలకండి

ఫోర్డ్ ఇండియా తమ నూతన వేరియంట్ ఫ్రీస్టైల్ క్రాసోవర్ కారును ప్రత్యేకంగా అమెజాన్ ఇండియా ఈ-కామర్స్ వెబ్‌సైట్లో బుకింగ్స్ ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. ఇక మీదట షోరూములకు వెళ్లకుండా, కస్టమర్లు 24 గంటల

By Anil Kumar

ఫోర్డ్ ఇండియా తమ నూతన వేరియంట్ ఫ్రీస్టైల్ క్రాసోవర్ కారును ప్రత్యేకంగా అమెజాన్ ఇండియా ఈ-కామర్స్ వెబ్‌సైట్లో బుకింగ్స్ ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. ఇక మీదట షోరూములకు వెళ్లకుండా, కస్టమర్లు 24 గంటల్లో ఎప్పుడైనా అమెజాన్ ఇండియావ వెబ్‌సైట్లో ఫ్రీస్టైల్ కారును బుక్ చేసుకోవచ్చు.

ఈ రోజు (ఏప్రిల్ 14, 2018) మద్యాహ్నం 2 గంటల నుండి బుకింగ్స్ అందుబాటులో ఉండనున్నట్లు ఫోర్డ్ పేర్కొంది.

అమెజాన్ ఇండియాలో ఫోర్డ్ ఫ్రీస్టైల్ బుకింగ్స్

అమెజాన్ వేదికగా పరిమిత సంఖ్యలో కేవలం 100 కార్లను మాత్రమే బుకింగ్స్‌కు అందుబాటులో ఉంచారు. రూ. 10,000 చెల్లించి ఫ్రీస్టైల్‌ను బుక్ చేసుకోవచ్చు. తరువాత కూడా అమెజాన్లో బుక్ చేసుకున్న కస్టమర్లకు ప్రాధాన్యతనిచ్చి ముందస్తు డెలివరీ ఇవ్వనున్నారు.

అమెజాన్ ఇండియాలో ఫోర్డ్ ఫ్రీస్టైల్ బుకింగ్స్

అమెజాన్ ఇండియా ఫోర్డ్ ఫ్రీస్టైల్ కోసం ప్రత్యేకంగా బ్రాండ్ పేజ్‌ను రూపొందించింది. ఈ పేజీ ద్వారా ఫ్రీస్టైల్ లభించే వేరియంట్లు, ఇంజన్, మరియు కలర్ ఆప్షన్స్ వంటివి గమనించి నచ్చిన వేరియంట్లో ఫ్రీస్టైల్ క్రాసోవర్ కారును ఎంచుకోవచ్చు.

అమెజాన్ ఇండియాలో ఫోర్డ్ ఫ్రీస్టైల్ బుకింగ్స్

ప్రత్యేకంగా రూపొందించిన ఫోర్డ్ ఫ్రీస్టైల్ బ్రాండ్ పేజీలోని అమెజాన్ పేమెంట్ ఆప్షన్, లేదా అమెజాన్ మొబైల్ యాప్ ద్వారా ఫోర్డ్ ఫ్రీస్టైల్ బుకింగ్ అమౌంట్ పేమెంట్‌ చేయవచ్చు.

Recommended Video

Ford Freestyle Review | Test Drive | Interior, Top Features & More - DriveSpark
అమెజాన్ ఇండియాలో ఫోర్డ్ ఫ్రీస్టైల్ బుకింగ్స్

ఈ సందర్భంగా ఫోర్డ్ ఇండియా మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గౌతమ్ మాట్లాడుతూ, "యువత కోసం మరియు వ్యక్తిగత కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని ఫ్రీస్టైల్‌ను రూపొందించినట్లు తెలిపాడు. మొబైల్ ఫోన్ల నుండి ఎక్కువ విలువ చేసే వస్తువుల వరకు ఎన్నో ఉత్పత్తులకు ఆన్‌లైన్ అంగట్లో డిమాండ్ అధికంగా ఉంది. ఈ తరుణంలో తమ నూతన మోడల్ ఫ్రీస్టైల్‌ మీద అమెజాన్ ఈ-కామర్స్ వెబ్‌సైట్లో అమ్మకానికి ఉంచినట్లు చెప్పుకొచ్చాడు."

అమెజాన్ ఇండియాలో ఫోర్డ్ ఫ్రీస్టైల్ బుకింగ్స్

భారతదేశపు తొలి కాంపాక్ట్ యుటిలిటి వెహికల్ ఫోర్డ్ ఫ్రీస్టైల్ కారును కస్టమర్లు తమ ఇళ్లు, ఆఫీసులు మరియు ఎక్కడి నుండైనా సౌకర్యవంతంగా మరియు సులభంగా బుక్ చేసుకునే అవకాశాన్ని ఫోర్డ్ ఇండియా అమెజాన్ భాగస్వామ్యంతో ప్రత్యేక అవకాశాన్ని కల్పించింది.

అమెజాన్ ఇండియాలో ఫోర్డ్ ఫ్రీస్టైల్ బుకింగ్స్

ఫోర్డ్ ఇండియా భారతదేశపు తొలి కాంపాక్ట్ యుటిలిటి వెహికల్‌ను ఫిగో హ్యాచ్‌బ్యాక్ ఆధారంతో ఫ్రీస్టైల్ కారును రూపొందించింది. ఎత్తైన డ్రైవింగ్ పొజిషన్‌తో ఇటు ఆఫ్ రోడింగ్, అటు ఆన్ రోడ్ డ్రైవింగ్ పరిస్థితులకు బాగా సెట్ అవుతుంది. కొలతల పరంగా దాదాపు ఫిగోనే పోలి ఉన్నప్పటికీ యువ కొనుగోలుదారుల రియల్ లైఫ్ అవసరాలకు చాలా దగ్గరగా ఉంటుంది.

అమెజాన్ ఇండియాలో ఫోర్డ్ ఫ్రీస్టైల్ బుకింగ్స్

ఫోర్డ్ ఫ్రీస్టైల్ క్రాసోవర్ కారులో సాంకేతికంగా 1.2-లీటర్ కెపాసిటి గల న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది, 95బిహెచ్‌పి పవర్ మరియు 120ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

అమెజాన్ ఇండియాలో ఫోర్డ్ ఫ్రీస్టైల్ బుకింగ్స్

అదే విధంగా ఫోర్డ్ ఫ్రీస్టైల్ క్రాసోవర్ 1.5-లీటర్ టిడిసిఐ డీజల్ ఇంజన్, అత్యుత్తమ 100బిహెచ్‌పి పవర్ మరియు 250ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. రెండు ఇంజన్ వేరియంట్లు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభ్యమవుతున్నాయి.

అమెజాన్ ఇండియాలో ఫోర్డ్ ఫ్రీస్టైల్ బుకింగ్స్

ఫోర్డ్ ఫ్రీస్టైల్ నాలుగు విభిన్న వేరియంట్లలో లభ్యమవుతున్నాయి. అవి, ఆంబియంట్, ట్రెండ్, టైటానియం మరియు టైటానియం ప్లస్. భద్రత పరంగా ఫ్రీస్టైల్ కారులో, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, రివర్స్ పార్కింగ్ సెన్సార్, అప్రోచ్ సెన్సార్లు, పెరిమీటర్ థెఫ్ట్ అలారమ్, ఇంజన్ ఇమ్మొబిలైజర్, కీలెస్ ఎంట్రీ మరియు గంటకు 15 కిమీ వేగం వద్ద డోర్లు ఆటోమేటిక్‌గా రీలాక్ అవుతాయి.

టైటానియం ప్లస్ వేరియంట్లో అదనంగా, యాక్టివ్ రోల్ఓవర్ ప్రొటెక్షన్ మరియు ఎమర్జెన్సీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

అమెజాన్ ఇండియాలో ఫోర్డ్ ఫ్రీస్టైల్ బుకింగ్స్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఫోర్డ్ ఫ్రీస్టైల్ ఫిగో హ్యాచ్‌బ్యాక్ మరియు ఇకోస్పోర్ట్ ఎస్‌యూవీ మధ్య స్థానాన్ని భర్తీ చేస్తుంది. ఫోర్డ్ ఫ్రీస్టైల్ ధరలు అంచనాగా రూ. 6 లక్షల నుండి 9 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఉండే అవకాశం ఉంది. ఫ్రీస్టైల్ విడుదల అనంతరం జూన్ 2018 నుండి డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

ఫోర్డ్ ఫ్రీస్టైల్

1. కస్టమర్‌ను మోసం చేసినందుకు 9.23 లక్షలు జరిమానా విధించిన కోర్టు

2.ఫోర్డ్ ఫ్రీస్టైల్ రివ్యూ: ఒక కొత్త అధ్యయనానికి నాంది!!

3.విడుదలకు సర్వం సిద్దం చేసుకున్న మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఫేస్‌లిఫ్ట్

4.దిగ్గజాలను వణికిస్తోన్న టాటా కొత్త ఎస్‌యూవీలు

5.మారుతి నుండి బడ్జెట్ ఫ్రెండ్లీ సోలియో 7-సీటర్

Most Read Articles

Read more on: #ford #ఫోర్డ్
English summary
Read In Telugu: Ford Freestyle Available On Amazon India — Skip The Queue, Book Online!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X