ఇక్కడ 30 సెకండ్లలో డ్రైవింగ్ టెస్ట్ పాస్ అయిపోతారు

ఘజియాబాద్ నగరంలో ఆర్‌టిఓ కార్యాలయంలో డ్రైవింగ్ లైసెన్స్ కోసం వెళితే ఈ ప్రాసెస్ అంతా ఉండదు. ఆర్‌టిఓ అధికారి ముందుకు వెళితే కేవలం 30 సెకండ్లలో డ్రైవింగ్ టెస్ట్ పాస్ చేస్తారు.

By Anil Kumar

ప్రతి ఒక్కరికీ బైక్, కారు నడపడం అంటే చాలా ఇష్టం. కానీ లైసెన్స్ లేకుండా నడపడం తప్పు... సరే లైసెన్స్ చేయించుకుందామని ఆర్‌టిఓ కార్యాలయానికి వెళితే పెద్ద క్యూ లైన్లలో నిలబడుకొని అధికారులు వచ్చేంత వరకు వేచి ఉండాలి. దీనికి తోడు ఏజెంట్ల వాటా వేరేగా ఉంటుంది. అన్ని సక్రమంగా జరిగే చేతికి లైసెన్స్ వస్తుంది లేదంటే మళ్లీ మొదటికి రావాల్సిందే.

30 సెకండ్లలో డ్రైవింగ్ లైసెన్స్

ఈ ప్రక్రియ లేకుండా లైసెన్స్ కోరిన వారికి వెంటనే జారీ చేసే కొత్త పద్దతికి ఆర్‌టిఓ అధికారులు శ్రీకారం చుట్టారు. ఈ పద్దతి ప్రకారం కేవలం 30 సెకండ్లలోనే డ్రైవింగ్ టెస్ట్ పాస్ చేస్తారు. ఆశ్చర్యంగా ఉంది కదూ.... అయితే అసలు మ్యాటర్ ఏంటో చూద్దాం రండి...

30 సెకండ్లలో డ్రైవింగ్ లైసెన్స్

మీరు చదివింది అక్షరాలా నిజమే, ఆర్‌టిఓ ముందు వెహికల్ డ్రైవింగ్ టెస్ట్ పాస్ అవ్వాల్సిన అవసరం అస్సలు లేదు. ప్రస్తుతం చేతికి డ్రైవింగ్ లైసెన్స్ రావాలంటే డిఎల్ కోసం అప్లికేషన్ దరఖాస్తు చేసుకుని, అందులో ఉన్న తేదీ ప్రకారం, ఆర్‌టిఓ అధికారి ముందు వాహనం నడపాల్సి ఉంటుంది. ఆ పరీక్షలో పాస్ అయితే, లైసెన్స్ వస్తుంది లేదంటే చలనా కట్టి మళ్లీ టెస్ట్‌కు వెళ్లాల్సి ఉంటుంది.

30 సెకండ్లలో డ్రైవింగ్ లైసెన్స్

కానీ, ఘజియాబాద్ నగరంలో ఆర్‌టిఓ కార్యాలయంలో డ్రైవింగ్ లైసెన్స్ కోసం వెళితే ఈ ప్రాసెస్ అంతా ఉండదు. ఆర్‌టిఓ అధికారి ముందుకు వెళితే కేవలం 30 సెకండ్లలో డ్రైవింగ్ టెస్ట్ పాస్ చేస్తారు.

30 సెకండ్లలో డ్రైవింగ్ లైసెన్స్

ఘజియాబాద్ ఆర్‌టిఓ కార్యాలయం ఇందుకు బాగా ఫేమస్, ఇండియాలో అత్యంత వేగంగా డ్రైవింగ్ లైసెన్సులను జారీ చేసే ఆర్‌టిఓ కార్యాలయం కూడా ఇదే. ఎంత దారుణం అంటే, అధికారుల జేబులు నింపితే వాహనం ఎక్కి స్టార్ట్ చేయాల్సిన అవసరం కూడా లేకుండా డ్రైవింగ్ టెస్ట్ పాస్ అయిపోతారు.

30 సెకండ్లలో డ్రైవింగ్ లైసెన్స్

తెల్లారితే తన పరిధిలో ఏ ప్రమాదం జరుగుతుందో అని భయపడాల్సిన ఆర్‌టిఓ అధికారులు బుద్ది మన్ను తిన్న పనులు చేస్తున్నారు. డ్రైవింగ్ గురించి కనీసం అవగాహన లేని అభ్యర్థులకు అక్రమంగా లైసెన్సులను జారీ చేస్తున్నారు.

30 సెకండ్లలో డ్రైవింగ్ లైసెన్స్

ఏజెంట్ల ద్వారా మరియు లంచం ఇచ్చి డ్రైవింగ్ టెస్టుకు వచ్చే అభ్యర్థులకు కేవలం 30 సెకండ్లలోనే డ్రైవింగ్ టెస్ట్ పాస్ చేస్తారు. ఇతర ఆర్‍‌‌టిఓ కార్యాలయాల్లో టెస్టుకు హాజరయ్యే అభ్యర్థుల్లో 50 నుండి 60 శాతం పాస్ అయితే, ఇక్కడ మాత్రం 98 శాతం వరకు పాస్ చేసి డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేస్తున్నారు.

30 సెకండ్లలో డ్రైవింగ్ లైసెన్స్

ఘజియాబాద్ ఆర్టీఓ కార్యాలయానికి డ్రైవింగ్ టెస్ట్ కోసం వచ్చిన అభ్యర్థి కేవలం 30 సెకండ్లలోనే టెస్ట్ పాస్ అవుతారు. వాహనాన్ని కేవలం 10 మీటర్లు ముందుకు నడిపితే స్వయంగా అధికారులు మీరు టెస్ట్ పాసయ్యారని చెబుతున్నారు. డ్రైవింగ్ టెస్ట్‌కు వచ్చిన ఒక అభ్యర్థి, ఈ విధానంతో ఆశ్చర్యపోయాడు.

30 సెకండ్లలో డ్రైవింగ్ లైసెన్స్

డ్రైవింగ్ టెస్ట్ కోసం డ్రైవింగ్ క్లాసులకు వెళుతున్న అభ్యర్థి రెండు రోజుల క్రితం డ్రైవింగ్ టెస్ట్ కోసం ఆర్టీఓ కార్యాలయంలో హాజరయ్యాడు. అయితే, టెస్టింగ్ చాలా కఠినంగా ఉంటుందని భావించిన అతను, అక్కడ డ్రైవింగ్ టెస్ట్ పాస్ చేసే విధానం చూసి ఖంగుతిన్నాడు.

30 సెకండ్లలో డ్రైవింగ్ లైసెన్స్

డ్రైవింగ్ టెస్ట్ తీసుకున్న ఆ అబ్బాయి కేవలం 10 మీటర్ల మేర వాహనాన్ని ముందుకు డ్రైవ్ చేశాడు. అంతే, స్వయంగా ఆర్టీఓ అధికారే దగ్గరికి వచ్చి, డ్రైవింగ్ టెస్ట్ పాస్ అయ్యారు మీరు డ్రైవింగ్ లైసెన్సుకు మీరు అర్హహత పొందారు, మరో రెండు రోజుల్లో డ్రైవింగ్ లైసెన్స్ ఇంటికొస్తుందని చెప్పాడు.

30 సెకండ్లలో డ్రైవింగ్ లైసెన్స్

అరే...! డ్రైవింగ్ టెస్ట్ కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని, ఎన్ని సార్లు ప్రయత్నించినా డ్రైవింగ్ టెస్ట్ పాస్ కాలేకపోయినా అలాంటిది ఇంత సింపుల్‌గా డ్రైవింగ్ టెస్ట్ పాస్ అయిపోయానేంటి అని ఆసిస్ యాదవ్ సంభ్రమాశ్చర్యానికి గురైనట్లు సోషల్ మీడియా ద్వారా వివరించాడు.

30 సెకండ్లలో డ్రైవింగ్ లైసెన్స్

సామాజిక మాద్యమాన్ని వేదికగా చేసుకుని, డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఏజెంటును సంప్రదిస్తే చాలా సులభంగా డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు. కానీ, సరాసరి ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లి లైసెన్స్ కోసం అప్లికేషన్ పెట్టుకుంటే పాస్ కావడం ఎవరితరం కాదని తన అనుభవాన్ని పంచుకున్నాడు.

30 సెకండ్లలో డ్రైవింగ్ లైసెన్స్

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఢిల్లీ డ్రైవింగ్ లైసెన్స్ పొందడం సాధ్యం కాని మరియు ప్రతి సారీ ఫెయిల్ అవుతున్న అభ్యర్థులు ఘజియాబాద్‌కు వచ్చి డ్రైవింగ్ లైసెన్స్‌ను పొందుతున్నట్లు వెలుగులోకి వచ్చింది.

30 సెకండ్లలో డ్రైవింగ్ లైసెన్స్

డ్రైవింగ్ చేయడం వచ్చిన అభ్యర్థి ఒకరు ఘజియాబాద్ ఆర్టీఓ అధికారితో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో విరోధం పెట్టుకున్న అభ్యర్థికి సమాధానంగా అధికారులు ఎలాంటి సమాచారం ఇచ్చారో తెలుసా....?

30 సెకండ్లలో డ్రైవింగ్ లైసెన్స్

ఘజియాబాద్ ఆర్టీఓ కార్యాలయంలో డ్రైవింగ్ టెస్ట్ కోసం కావాల్సిన సరిపడా ఖాళీ ప్రదేశం లేకపోవడంతో ఇలా డ్రైవింగ్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు సమర్థించుకున్నారు. స్థలాభావం వలన వాహనం నడిపిన వ్యక్తులకు డ్రైవింగ్ వచ్చినట్లుగా భావించి లైసెన్స్ మంజూరు చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.

30 సెకండ్లలో డ్రైవింగ్ లైసెన్స్

రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకీ పెరిగిపోతుండటంతో అధికారులు చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేస్తున్నారు. చాలా కఠినంగా వ్యవహరించే కార్యాలయాల్లో నెలలు గడిచినా లభించని డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పుడు ఘజియాబాద్‌లో కేవలం 30 సెకండ్లలో డ్రైవింగ్ టెస్ట్ పాస్ అయ్యి, లైసెన్స్ పొందుతున్నారు. ఇప్పుడు ఆన్‌లైన్ మరియు సామాజిక మాధ్యమాల్లో ఈ వార్త చల్‌చల్ చేస్తోంది.

Most Read Articles

English summary
Read In Telugu: Ghaziabad pass driving test in 30 seconds
Story first published: Friday, May 11, 2018, 18:05 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X