ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీలపై దిగొచ్చిన జీఎస్టీ

ఎలక్ట్రిక్ కార్లలో ఉపయోగించే బ్యాటరీల మీద ప్రభుత్వం ఎట్టకేలకు 10 శాతం జీఎస్టీ తగ్గించింది. భారత ప్రభుత్వ సూచన మేరకు, జీఎస్టీ మండలి ప్రస్తుతం లిథియం-అయాన్ బ్యాటరీల మీద ఉన్న 28 శాతం జీఎస్టీని 18 శాతాని

By Anil Kumar

ఎలక్ట్రిక్ కార్లలో ఉపయోగించే బ్యాటరీల మీద ప్రభుత్వం ఎట్టకేలకు 10 శాతం జీఎస్టీ తగ్గించింది. భారత ప్రభుత్వ సూచన మేరకు, జీఎస్టీ మండలి ప్రస్తుతం లిథియం-అయాన్ బ్యాటరీల మీద ఉన్న 28 శాతం జీఎస్టీని 18 శాతానికి తగ్గించింది. బ్యాటరీల మీద జీఎస్టీ రేట్లు తగ్గడంతో, దేశీయంగా ఉన్న అన్ని రకాల ఎలక్ట్రిక్ కార్ల ధరలు తగ్గుముఖం పడతాయి.

ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీలపై దిగొచ్చిన జీఎస్టీ

ఎలక్ట్రిక్ వాహనాలలో బ్యాటరీ అత్యంత కీలకమైన విడి భాగం. ఈ బ్యాటరీల మీద జీఎస్టీ తగ్గడంతో ఎలక్ట్రిక్ వాహనాల మొత్తం ధరలో సుమారుగా 8 నుండి 10 శాతం వరకు ధరలు తగ్గుతాయి. ప్రస్తుతం టాటా మోటార్స్ మరియు మహీంద్రా అండ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తున్నాయి.

ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీలపై దిగొచ్చిన జీఎస్టీ

ఎలక్ట్రిక్ కార్ల తయారీకి కావాల్సిన బ్యాటరీలను మరియు ఇతర విడి భాగాలను ముందుగానే సేకరించుకోవడం వలన ఎలక్ట్రిక్ కార్ల ధరలు వెంటనే తగ్గే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ కార్లు కొంత కాలం పాటు పాత ధరలకే అందుబాటులో ఉంటాయి.

ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీలపై దిగొచ్చిన జీఎస్టీ

అయితే, పాత స్టాక్ క్లియర్ అయిన తర్వాత కొత్త బ్యాచ్ ప్రొడక్షన్ ప్రారంభమయితే, బ్యాటరీల మీద తగ్గిన జీఎస్టీకి అనుగుణంగా ఎలక్ట్రిక్ కార్ల ధరలను తగ్గించే అవకాశం ఉంది. టాటా మరియు మహీంద్రా అండ్ మహీంద్రా ఇరు కంపెనీలు కూడా అతి త్వరలో తమ ఎలక్ట్రిక్ కార్ల ధరలను సవరించే అకాశం ఉంది.

ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీలపై దిగొచ్చిన జీఎస్టీ

లిథియం-అయాన్ బ్యాటరీల మీద 10 శాతం జీఎస్టీ తగ్గించడం వలన ఎలక్ట్రిక్ కార్లతో పాటు దేశీయ మార్కెట్లో ఉన్న పలు ఎలక్ట్రిక్ టూ వీలర్ల కంపెనీలు కూడా లబ్ధి పొందనున్నాయి. దీంతో అతి త్వరలో ఎలక్ట్రిక్ టూ వీలర్ల ధరలు కూడా కొద్ది వరకు తగ్గే అవకాశం ఉంది.

ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీలపై దిగొచ్చిన జీఎస్టీ

ఎలక్ట్రిక్ బ్యాటరీల మీద జీఎస్టీ తగ్గింపు పరంగా తీసుకున్న నిర్ణయం, కంపెనీలు స్వచ్ఛదంగా తమకు కావాల్సిన బ్యాటరీలను దిగుమతి చేసుకోకుండా పూర్తి స్థాయిలో దేశీయంగా తయారు చేసుకునేందుకు సహాయపడనుంది. ప్రస్తుతం, దిగుమతి చేసుకుంటున్న ఎలక్ట్రిక్ బ్యాటరీల మీద దిగుమతి సుంకం 20 శాతంగా ఉంది.

ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీలపై దిగొచ్చిన జీఎస్టీ

ఎలక్ట్రిక్ కార్లు మరియు టూ వీలర్లు పూర్తి స్థాయిలో దిగుమతి చేసుకునే లిథియం-అయాన్ బ్యాటరీల మీదనే ఆధారపడ్డాయి. ఒకవేళ ఈ బ్యాటరీల తయారీ దేశీయంగా మొదలైతే ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి.

ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీలపై దిగొచ్చిన జీఎస్టీ

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

భవిష్యత్ ప్రజా రవాణాలో ఎలక్ట్రిక్ వాహనాలదే పైచేయి కానుంది. దీంతో ఇప్పటికే పలు కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను అభివృద్ది చేసుకుంటున్నాయి. అయితే, పెట్రోల్ మరియు డీజల్ వాహనాలతో పోల్చుకుంటే ఎలక్ట్రిక్ కార్ల ధరలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, ఎలక్ట్రిక్ వాహనాలలో ఉపయోగించే బ్యాటరీల మీద 10 శాతం వరకు జీఎస్టీ తగ్గడంతో ఇక మీదట ఎలక్ట్రిక్ వాహనాల ధరలు దిగివచ్చి సామాన్యులకు చౌకగా లభించనున్నాయి.

Most Read Articles

English summary
Read In Telugu: GST On Electric Car Batteries Reduced By Ten Percent
Story first published: Wednesday, July 25, 2018, 12:50 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X