హోండా అమేజ్ ఖాతాలో మరో రికార్డ్

ఇటీవల విడుదలైన 2018 హోండా అమేజ్ మే నెల విక్రయాలతో హోండా కార్స్ ఇండియా లిమిటెడ్‌కు అత్యంత అరుదైన రికార్డు సాధించిపెట్టింది. అయితే, జూలై 2018 నెల అమేజ్ విక్రయాలతో తన పాత రికార్డును మళ్లీ చెరిపేసింది.

By Anil Kumar

ఇటీవల విడుదలైన 2018 హోండా అమేజ్ మే నెల విక్రయాలతో హోండా కార్స్ ఇండియా లిమిటెడ్‌కు అత్యంత అరుదైన రికార్డు సాధించిపెట్టింది. అయితే, జూలై 2018 నెల అమేజ్ విక్రయాలతో తన పాత రికార్డును మళ్లీ చెరిపేసింది. గత రెండు నెలలుగా నమోదవుతున్న సేల్స్‌తో మారుతు డిజైర్ కాంపాక్ట్ సెడాన్‍‌‌కు హోండా అమేజ్ తన అద్భుతమైన చుక్కలు చూపిస్తోంది.

హోండా అమేజ్ సేల్స్

హోండా మోటార్స్ గడిచిన మే 2018లో 9,789 యూనిట్ల అమేజ్ కార్లను విక్రయించగా, జూలై నెలలో ఏకంగా 10,180 యూనిట్ల అమేజ్ కార్లను విక్రయించి అరుదైన రికార్డును నెలకొల్పింది. హోండా మోటార్స్ ఇండియా చరిత్రలో ఒక్క మోడల్ మీద ఇలాంటి ఫలితాలు సాధ్యం కావడం ఇదే మొదటిసారి.

హోండా అమేజ్ సేల్స్

హోండా మోటార్స్ అమేజ్ కాంపాక్ట్ సెడాన్ కారును విడుదల చేసినప్పటి నుండి ఇప్పటి వరకు మొత్తం 20,608 యూనిట్లను విక్రయించింది. వీటిలో, దేశయంగా 19,970 కార్లను డెలివరీ ఇవ్వగా, 638 యూనిట్లను ఎగుమతి చేసింది.

హోండా అమేజ్ సేల్స్

హోండా తమ సెకండ్ జనరేషన్ అమేజ్ కారును హోండా సిటీ ప్రేరణతో డిజైన్ చేసింది. ఇంటీరియర్ ఒక్క ఇంజన్ మినహాయిస్తే, ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ డిజైన్‌తో పాట ఫీచర్ల పరంగా రెండవ తరం హోండా అమేజ్‌లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి.

హోండా అమేజ్ సేల్స్

సరికొత్త హోండా అమేజ్ మొత్తం నాలుగు వేరియంట్లలో లభ్యమవుతోంది. అవి, ఇ,ఎస్, వి మరియు విఎక్స్. హోండా అమేజ్‌లో పగటి పూట వెలిగే ఎల్ఈడీ లైట్లు, ప్యాసివ్ కీ లెస్ ఎంట్రీ, ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటన్, 15-అంగుళాల అల్లాయ్ వీల్స్, క్రూయిజ్ కంట్రోల్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

హోండా అమేజ్ సేల్స్

ఇంటీరియర్‌లో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే అప్లికేషన్లను సపోర్ట్ చేయగల 7-అంగుళాల పరిమాణంలో ఉన్న టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. భద్రత పరంగా రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, రియర్ పార్కింగ్ కెమెరా, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ మరియు డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు వంటివి స్టాండర్డ్ ఫీచర్లుగా వచ్చాయి.

హోండా అమేజ్ సేల్స్

కొత్త తరం హోండా అమేజ్ సాంకేతికంగా అవే పాత ఇంజన్ ఆప్షన్‌లతో లభ్యమవుతోంది. వీటిలో, 1.2-లీటర్ పెట్రోల్ వెర్షన్ 89బిహెచ్‌పి-110ఎన్ఎమ్ మరియు 1.5-లీటర్ డీజల్ వెర్షన్ 99బిహెచ్‌పి-200ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి. రెండు ఇంజన్‌లను 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా సివిటి ట్రాన్స్‌మిషన్‌తో ఎంచుకోవచ్చు.

హోండా అమేజ్ సేల్స్

ఏఆర్ఏఐ మేరకు, అన్ని వేరియంట్ల మైలేజ్ వివరాలు ఇలా ఉన్నాయి.

  • అమేజ్ పెట్రోల్ మ్యాన్యువల్ - 19.5 కిమీ/లీ
  • అమేజ్ పెట్రోల్ ఆటోమేటిక్ - 19.0 కిమీ/లీ
  • అమేజ్ డీజల్ మ్యాన్యువల్ - 27.4 కిమీ/లీ
  • అమేజ్ డీజల్ ఆటోమేటిక్ - 23.8 కిమీ/లీ
  • హోండా అమేజ్ సేల్స్

    డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

    హోండా మోటార్స్ 2018 హోండా అమేజ్ కారును రూ. 5,59,900 ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ) పరిచయాత్మక ధరతో విడుదలతో ప్రవేశపెట్టింది. అయితే, ఈ పరిచయాత్మక ధర జూలై 31, 2018 వరకు మాత్రమే అందుబాటులో ఉంది. ఆగష్టు 1, 2018 నుండి ఇప్పుడా ప్రారంభ ధర రూ. 5,80,500 లకు చేరుకుంది. కాబట్టి, ఈ మార్పు కొద్దివరకూ అమేజ్ సేల్స్ మీద ప్రభావం చూపే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Read In Telugu: 2018 Honda Amaze creates another monthly sales record at HCIL
Story first published: Friday, August 3, 2018, 10:37 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X