ఆటో ఎక్స్‌పో 2018: హోండా సివిక్ ఆవిష్కరణ

By Anil

ఆటో ఎక్స్‌పో 2018: హోండా మోటార్స్ సరికొత్త సివిక్ సెడాన్ కారును ఆవిష్కరించింది. ఆటో ఎక్స్‌పో 2018 ద్వారా డి-సెగ్మెంట్‌కు సివిక్ సెడాన్ కారు ఎట్టకేలకు మళ్లీ ఇండియన్ మార్కెట్ వైపుకు వచ్చింది.

పదవ తరానికి చెందిన సివిక్ కారును 2018-19 ఆర్థిక సంవత్సరంలో పూర్తి స్థాయిలో ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు జపాన్ దిగ్గజం హోండా వెల్లిడించింది. పదవ తరాని చెందిన హోండా సివిక్ గురించి మరిన్ని వివరాలు మరియు ఫోటోల కోసం....

హోండా సివిక్

హోండా సివిక్ స్పెసిఫికేషన్స్

పదవ తరానికి చెందిన హోండా సివిక్ లగ్జరీ సెడాన్ అంతర్జాతీయ విపణిలో మూడు విభిన్న పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లతో లభ్యమవుతోంది. అవి, 1.0-లీటర్ మూడు సిలిండర్ల టుర్బో, 1.5-లీటర్ నాలుగు సిలిండర్ల టుర్బో మరియు 2.0-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ నాలుగు సిలిండర్ల ఇంజన్ మరియు 1.6-లీటర్ నాలుగు సిలిండర్ల డీజల్ ఇంజన్‌తో కూడా లభ్యమయ్యే అవకాశం ఉంది.

Recommended Video - Watch Now!
Mahindra TUV Stinger Concept First Look; Details; Specs - DriveSpark
హోండా సివిక్

హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ ఇండియన్ వెర్షన్ సివిక్‌ను 2.0-లీటర్ పెట్రోల్ మరియు 1.6-లీటర్ డీజల్ ఇంజన్ వెర్షన్‌లతో ప్రవేశపెట్టింది. పెట్రోల్ ఇంజన్ 6,500ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 158బిహెచ్‌పి పవర్ మరియు 4,200ఆర్‌పిఎమ్ వద్ద 187గరిష్ట టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనిని 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా సివిటి ట్రాన్స్‌మిషన్‌తో ఎంచుకోవచ్చు.

హోండా సివిక్

అదే విధంగా డీజల్ వెర్షన్ హోండా సివిక్ 4,000ఆర్‌పిఎమ్ వద్ద 118బిహెచ్‌పి పవర్ మరియు 2,000ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 300ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే, డీజల్ సివిక్ కేవలం 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభ్యమవుతోంది.

హోండా సివిక్

హోండా సివిక్ సెడాన్ పొడవు 4,630ఎమ్ఎమ్, వెడల్పు 1,799ఎమ్ఎమ్, ఎత్తు 1,416ఎమ్ఎమ్ మరియు ఈ పదవ తరానికి చెందిన సివిక్ వీల్ బేస్ 2,700ఎమ్ఎమ్‌గా ఉంది. హోండా సివిక్ మొత్తం బరువు 1.3-టన్నులుగా ఉంది.

హోండా సివిక్

హోండా సివిక్ డిజైన్ మరియు ఫీచర్లు

గతంలో ఇండియన్ మార్కెట్లో ఉన్న సివిక్ తరహా ఈ కొత్త తరం సివిక్ అందరి దృష్టిని ఆకర్షించడం ఖాయం. అదే మునుపటి వెర్షన్ సివిక్ డిజైన్ తరహా కాకుండా, చాలా విభిన్నంగా ఉంది. అత్యాధునిక డిజైన్ అంశాల జోడింపుతో ఉన్న సివిక్ ఫ్రంట్ లుక్ అగ్రెసివ్‌గా ఉంటుంది.

హోండా సివిక్

ఫ్రంట్ డిజైన్‌లో పెద్ద పరిమాణంలో ఉన్న క్రోమ్ పట్టీకి ఇరువైపులా పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్ల జోడింపుతో ఉన్న యాంగులర్ ఎల్ఇడి హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. క్రింది బంపర్‌లో పెద్ద పరిమాణంలో ఉన్న ఎయిర్ ఇంటేకర్ మరియు బంపర్‌లో ఇరువైపులా గుండ్రటి ఆకారంలో ఉన్న ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి.

హోండా సివిక్

సివిక్ సైడ్ ప్రొఫైల్‌లో ఆకర్షణీయమైన క్యారెక్టర్ లైన్స్, వీల్ ఆర్చెస్ మరియు అల్లాయ్ వీల్స్ వంటివి సివిక్‌కు విభిన్న లుక్ తీసుకొచ్చాయి. హోండా సివిక్ రియర్ డిజైన్‌ మొత్తం సి-ఆకారంలో ఉన్న ఎల్ఇడి టెయిల్ లైట్లు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

హోండా సివిక్

హోండా సివిక్ ఇంటీరియర్ విషయానికి వస్తే, కొద్దిగా హోండా అకార్డ్‌ను పోలి ఉంటుంది. డ్యూయల్-టోన్ బ్లాక్ మరియు బీజి ఫినిషింగ్‌లో ఉన్న ఇంటీరియర్ థీమ్, పెద్ద పరిమాణంలో ఉన్న టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు అట్రాక్టివ్ లుక్‌లో ఉన్న సెంటల్ కన్సోల్ హైలైట్‌గా నిలిచాయి.

హోండా సివిక్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హోండా సివిక్ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నన ఇండియన్ కస్టమర్లను ఉద్దేశించి హోండా కొత్త తరం సివిక్ కారును ఎట్టకేలకు భారత్ మార్కెట్ కోసం సిద్దం చేసింది. హోండా సివికి వచ్చే ఏడాది ప్రారంభం నాటికి పూర్తి స్థాయిలో విపణిలోకి విడుదల కానుంది.

Most Read Articles

English summary
Read In Telugu: Auto Expo 2018: Honda Civic Showcased - Expected Price, Launch Date, Specs, Features & Images
Story first published: Wednesday, February 14, 2018, 10:20 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X