జాజ్ ఫేస్‌లిఫ్ట్ విడుదల ఖాయం చేసిన హోండా: ఎప్పుడో తెలుసా...?

హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ దేశీయ విపణిలోకి జాజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను లాంచ్ చేయాలని భావిస్తోంది.

By Anil Kumar

హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ దేశీయ విపణిలోకి జాజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను లాంచ్ చేయాలని భావిస్తోంది. హోండా మోటార్స్ సరికొత్త 2018 హోండా జాజ్ ఫేస్‌లిఫ్ట్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌‌ను ఈ జూలై నెలలోనే విడుదల చేసేందుకు కసరత్తులు ప్రారంభించింది.

హోండా జాజ్ ఫేస్‌లిఫ్ట్

హోండా మోటార్స్ ఈ జాజ్ ఫేస్‌లిఫ్ట్ కారును 2017 ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షోలో తొలిసారిగా ఆవిష్కరించింది. ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఇప్పటికే అంతర్జాతీయ విపణిలో అందుబాటులోకి వచ్చింది.

హోండా జాజ్ ఫేస్‌లిఫ్ట్

సరికొత్త 2018 హోండా జాజ్ కారులో పలు కాస్మొటిక్ అప్‌డేట్స్ జరిగాయి. ఇందులో ప్రత్యేకించి, రీస్టైల్ చేయబడిన ఫ్రంట్, అప్‌డేటెడ్ గ్రిల్ మరియు బంపర్లు ఉన్నాయి. నూతన జాజ్ కారులో 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ కూడా ఉన్నాయి.

హోండా జాజ్ ఫేస్‌లిఫ్ట్

అంతే కాకుండా, కొత్త తరం జాజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారులో పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు ఉన్నాయి. ఇంటీరియర్‌లో సరికొత్త టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు పలు అదనపు ఫీచర్లు వస్తున్నాయి.

హోండా జాజ్ ఫేస్‌లిఫ్ట్

2018 హోండా జాజ్ హ్యాచ్‌బ్యాక్‌లో సాంకేతికంగా ఎలాంటి మార్పులు జరగడం లేదు, అవే మునుపటి 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజన్‌లతో లభ్యం కానుంది. వీటిలో పెట్రోల్ వెర్షన్ 89బిహెచ్‌పి-110ఎన్ఎమ్ అదే విధంగా డీజల్ వెర్షన్ 98బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

హోండా జాజ్ ఫేస్‌లిఫ్ట్

ట్రాన్స్‌మిషన్ పరంగా పెట్రోల్ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అదే విధంగా డీజల్ ఇంజన్ కేవలం 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానంతో మాత్రమే లభ్యం కానుంది.

హోండా జాజ్ ఫేస్‌లిఫ్ట్

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హోండా జాజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ పెట్రోల్ వేరియంట్ల ధరల శ్రేణి రూ. 6 లక్షల నుండి రూ. 8.46 లక్షలు మరియు డీజల్ వేరియంట్ల ధరల శ్రేణి రూ. 7.44 లక్షల నుండి రూ. 9.31 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

హోండా జాజ్ ఫేస్‌లిఫ్ట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కొత్త తరం 2018 హోండా జాజ్ విపణిలో ఉన్న హ్యుందాయ్ ఐ20 మరియు మారుతి సుజుకి బాలెనో వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది. ప్రస్తుతం ఉన్న హోండా జాజ్ సేల్స్ క్రమక్రమంగా తగ్గిపోవడంతో, విక్రయాలను పెంచుకునేందుకు కొత్త తరం జాజ్ కారును ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.

Most Read Articles

English summary
Read In Telugu: New Honda Jazz Facelift To Be Launched In July — Details Revealed
Story first published: Thursday, July 5, 2018, 19:43 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X