ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన కొడుకు దగ్గర జరిమానా వసూలు చేసిన పోలీస్ అధికారి

ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న రామ్ మెహర్ సింగ్, ట్రాఫిక్ నియమాలను అతిక్రమించినందుకు కన్న కొడుక్కే జరిమానా విధించి పారదర్శకమైన వ్యవస్థకు ఆదర్శంగా నిలిచాడు.

By Anil Kumar

ప్రతి ద్విచక్ర వాహనదారుడు ఖచ్చితంగా ఐఎస్ఐ మార్కు హెల్మెట్ ధరించి ప్రయాణించేలా చేయడానికి ట్రాఫిక్ పోలీసులు పడుతున్న పాట్లు అన్నీ ఇన్ని కావు. ఎలాగైనా ప్రజల్లో గుర్తింపు పొందిన హెల్మెట్ గురించి చైతన్యపరచడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.

ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన కొడుకు దగ్గర జరిమానా వసూలు చేసిన పోలీస్

ప్రమాదాల నుండి కాపాడే హెల్మెట్ గురించి ప్రక్కన పెట్టి, పోలీసుల నుండి ఫైన్ తప్పించుకోవడానికి నాణ్యతలేని హెల్మెట్లను వాడుతున్నారు. పొరబాటున కఠినంగా వ్యవహరించే పోలీసులకు చిక్కితే కాళ్లావేళ్లపడి ఎంతో కొంత ఇచ్చి జారుకోవడానికి ప్రయత్నిస్తారు.

ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన కొడుకు దగ్గర జరిమానా వసూలు చేసిన పోలీస్

మరికొంత మంది అయితే, రహదారి నియమాలను ఉల్లంఘించి కూడా జరిమానా తప్పించుకోవడానికి, నేను పలానా పోలీసు అధికారి అబ్బాయిని, నాకు వాళ్లు తెలుసు వీళ్లు తెలుసు, నేనవరినో తెలుసా...? నాకు ఫైనా వేయడానికి ఎంత ధైర్యం అని విర్రవీగుతుంటారు. ఇలాంటి ఎన్నో సంఘటనలకు నిలయమైన మన వ్యవస్థలో ఆణిముత్యంలాంటి ట్రాఫిక్ పోలీసు ఒకరు మీడియాలో హైలైట్ అవుతున్నారు.

ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన కొడుకు దగ్గర జరిమానా వసూలు చేసిన పోలీస్

ఉత్తర ప్రదేశ్‌లోని సహరన్ పూర్ పోలీస్ స్టేషన్‌లో ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న రామ్ మెహర్ సింగ్, ట్రాఫిక్ నియమాలను అతిక్రమించినందుకు కన్న కొడుక్కే జరిమానా విధించి పారదర్శకమైన వ్యవస్థకు ఆదర్శంగా నిలిచాడు.

Recommended Video

Minor Motorcycle Rider Caught For Not Having A License - The Climax Of The Video Will Surprise You - DriveSpark
ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన కొడుకు దగ్గర జరిమానా వసూలు చేసిన పోలీస్

ట్రాఫిక్ నియమాలను ఉల్లఘించే వారి ఆటకట్టించడానికి ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ రామ్ మెహర్ సింగ్ నిర్వహిస్తుండగా శిరస్త్రాణం ధరించకుండా ట్రాఫిక్ రూల్స్ ఉల్లఘించినందుకు తన కుమారునికి రూ. 100 జరిమానా విధించాడు.

ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన కొడుకు దగ్గర జరిమానా వసూలు చేసిన పోలీస్

ఈ సంఘటన గురించి ట్రాఫిక్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ తేజ్ ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ, "సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బబ్లు కుమార్ సూచన మేరకు, ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించే వారి పట్ల ఎలాంటి పక్షపాతం లేకుండా కఠినంగా వ్యవహరించాలని సూచించారు."

ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన కొడుకు దగ్గర జరిమానా వసూలు చేసిన పోలీస్

ప్రభుత్వ ఉద్యోగులు, పోలీస్ అధికారులు మరియు వారి బంధువులైనా సరే ట్రాఫిక్ చట్టాలని అతిక్రమిస్తే వారి మీద చర్యలు తీసుకోవాలని క్రింది స్థాయి ఉద్యోగులకు సూచించినట్లు తెలిసింది. చట్టమనేది ఏ కొంత మందికో కాదు, చట్టాలని ప్రతి ఒక్కరూ పాటించాలనే మెసేజ్‌ను చాటేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెప్పుకొచ్చారు.

ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన కొడుకు దగ్గర జరిమానా వసూలు చేసిన పోలీస్

"సరహన్ పూర్‌ పట్టణంలో మహిళా పోలీస్ స్టేషన్ వద్ద వారినికి రెండు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాము. ఇక్కడ చుట్టు ప్రక్కల ప్రాంతంలో సుమారుగా 400 పోలీసు కుటుంబాలు నివశిస్తున్నాయి. గత బుధవారం నాడు ఒక్క రోజే 58 చలానాలు విధించి రూ. 10,800 లు జరిమానా వసూలు చేసినట్లు పోలీస్ అధికారి తెలిపాడు."

ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన కొడుకు దగ్గర జరిమానా వసూలు చేసిన పోలీస్

ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తున్న వారు పోలీసు ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులు అధికంగా ఉండటంతో ఇలా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాము. ఈ క్రమంలోనే ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ రామ్ మెహర్ సింగ్ విధుల్లో ఉండగా, ఆయన కుమారుడు హర్ష కుమార్ హెల్మెట్ లేకుండా బైక్ రైడ్ చేస్తుండటంతో అతనికి చలానా జారీ చేసి, జరిమానా విధించినట్లుఇన్‌స్పెక్టర్ మీడియాకు వెల్లడించాడు.

ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన కొడుకు దగ్గర జరిమానా వసూలు చేసిన పోలీస్

దీని గురించి మీడియా కానిస్టేబుల్ రామ్ మెహర్ సింగ్‌ను సంప్రదించగా, ఆయన మీడియాతో మాట్లాడుతూ, "నా కుమారుడికి ఫైన్ వేయడానికి ఆ సందర్భంలో నేను వెనకాడలేదు. పై అధికారుల సూచన మేరకు ప్రతి టూ వీలర్ రైడర్ ఖచ్చితంగా ధరించాలి. రూల్స్ అతిక్రమించే వారి పట్ల కఠినంగా ప్రవర్తించి నా కొడుకుని ఎలా వదిలేయగలను? అందుకే తనకు కూడా జరిమానా విధించానని చెప్పుకొచ్చాడు.

ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన కొడుకు దగ్గర జరిమానా వసూలు చేసిన పోలీస్

అంతే కాకుండా, ప్రతిసారీ హెల్మెట్ ధరించకుండా రోడ్డు మీదకు వస్తే, బైకును అందుబాటులో ఉంచకుండా సీజ్ చేస్తానని కుమారుడికి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఏదేమైనప్పటికీ, వ్యవస్థలో ఇలాంటి ఆఫీసర్లు అవసరం ఎంతైనా ఉంది. తన విధులను సక్రమంగా నిర్వర్తించిన హెడ్ కానిస్టేబుల్‌ పట్ల మీ అభిప్రాయాన్ని క్రింది కామెంట్ సెక్షన్ ద్వారా మాతో పంచుకోండి.

ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన కొడుకు దగ్గర ఫైన్ వసూలు చేసిన పోలీస్...

డ్రైవ్‌స్పార్క్ తెలుగులో ట్రెండింగ్ స్టోరీలు

1. ఇండియాలో రోడ్డుకు ఎడమవైపునే డ్రైవ్ చేయడం వెనకున్న సీక్రెట్స్

2.ట్రాఫిక్ పోలీసులు ఆపినపుడు ఏం చేయాలి, ఎలా వ్యవహరించాలి ?

3.ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్‌‌ను అనుమతించే ఇతర దేశాలు

4.అక్కడ ఆదివారాల్లో కార్లను కడగడం కూడా నేరమే...!!

5."ఆపరేషన్ చీతా" - రెండు గంటల్లో ఐదు లక్షలు వసూలు చేసిన ట్రాఫిక్ పోలీసులు

Source: The Hindu

Note: Traffic Police and signal images are use for representative/symbolic purpose.

Most Read Articles

English summary
Read In Telugu: Honest traffic cop fines own son for riding motorcycle without helmet
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X