భార్య భర్తల గొడవతో ప్రమాదానికి గురైన మారుతి స్విఫ్ట్ కారు: నలుగురు మృతి

ఇటీవల మారుతి సుజుకి స్విఫ్ట్ మరియు ప్రయాణికులతో వెళుతున్న ఆటో రిక్షా మధ్య ఘోర ప్రమాదం జరిగింది.

By Anil Kumar

ఇటీవల మారుతి సుజుకి స్విఫ్ట్ మరియు ప్రయాణికులతో వెళుతున్న ఆటో రిక్షా మధ్య ఘోర ప్రమాదం జరిగింది. రాజస్థాన్‌లోని బికనీర్ సమీపంలో అనుకోకుండా చోటు చేసుకున్న దురదృష్టకరమైన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.

భార్య భర్తల గొడవతో ప్రమాదానికి గురైన మారుతి స్విఫ్ట్ కారు: నలుగురు మృతి

రాజస్థాన్ పత్రిక మరియు ఇతర రిపోర్ట్స్ ప్రకారం, 28 ఏళ్ల ఇండియన్ నావల్ ఆఫీసర్ డేవ్ ప్రతాప్ మారుతి స్విఫ్ట్ కారును డ్రైవ్ చేస్తున్నాడు. ఆయన భార్య 25 ఏళ్ల ప్రయాంక ప్రతాప్ కూడా అదే కారులో ప్రయాణిస్తున్నారు.

భార్య భర్తల గొడవతో ప్రమాదానికి గురైన మారుతి స్విఫ్ట్ కారు: నలుగురు మృతి

అయితే, కారులో ప్రయాణిస్తున్న ఈ జంట మధ్య చిన్న వాగ్వాదం చోటు చేసుకుంది. చిలికి చిలికి గాలివానలా... ఈ వాగ్వాదం కాస్తా తారా స్థాయికి చేరుకుంది. కోపోద్రిక్తుడైన డ్రైవర్ దేవ్ ప్రతాప్ కారును ఇంకా వేగంతో డ్రైవ్ చేశాడు. దీంతో అధిక వేగం మీద ఉన్న కారును కంట్రోల్ కాకపోవడంతో రోడ్డు మీద అటు ఇటు వంకరటింకరా వెళ్లింది.

భార్య భర్తల గొడవతో ప్రమాదానికి గురైన మారుతి స్విఫ్ట్ కారు: నలుగురు మృతి

అలా కొద్ది దూరం వెళ్లిన తరువాత సుమారుగా పది మంది ప్రయాణికులతో వస్తున్న ఆటో రిక్షాను ఢీకొట్టింది. దురదృష్టకరం ఏమిటంటే... ఈ ప్రమాదంలో భార్య భర్తలు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 50 ఏళ్ల మిరా దేవి మరియు 45 ఏళ్ల వయసున్న చుకా దేవి మరణించారు.

భార్య భర్తల గొడవతో ప్రమాదానికి గురైన మారుతి స్విఫ్ట్ కారు: నలుగురు మృతి

మారుతి స్విఫ్ట్ కారు వెంట వస్తున్న అంబులెన్స్ డ్రైవర్ ప్రమాదాన్ని గుర్తించి, ప్రమాదంలో గాయపడిన మిగతా ఎనిమిది మందిని సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించాడు.

భార్య భర్తల గొడవతో ప్రమాదానికి గురైన మారుతి స్విఫ్ట్ కారు: నలుగురు మృతి

ప్రాంతీయ పోలీస్ ఇన్‌స్పెక్టర్, సవాయ్ సింగ్ గోదార ప్రమాద వివరాలను వెల్లడిస్తూ, కారులో ప్రయాణిస్తున్న భార్య భర్తల గొడవ కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు వెల్లడించాడు. డ్రైవింగ్ పట్ల అలసత్వం వహించి, ర్యాష్ డ్రైవింగ్ చేసినట్లుగా కారు డ్రైవర్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ, ఈ ప్రమాదానికి కారణమైన డ్రైవర్ కూడా మరణించాడు.

భార్య భర్తల గొడవతో ప్రమాదానికి గురైన మారుతి స్విఫ్ట్ కారు: నలుగురు మృతి

ప్రమాదానికి గురైన కారు ఇటీవల మారుతి సుజుకి విడుదల చేసిన కొత్త మారుతి స్విఫ్ట్‌లోని విఎక్స్ఐ వేరియంట్ పెట్రోల్ మోడల్‌గా గుర్తించడం జరిగింది. ఈ కారును శ్రీ రామ్ మిల్క్ చిల్లింగ్ సెంటర్, ఫరీదాబాద్, హర్యానా పేరు మీదుగా రిజిస్టర్ చేయించారు.

భార్య భర్తల గొడవతో ప్రమాదానికి గురైన మారుతి స్విఫ్ట్ కారు: నలుగురు మృతి

మార్చి 2018లో కొనుగోలు చేసిన ఈ కారులో 1.2-లీటర్ కెపాసిటి గల పెట్రోల్ ఇంజన్ ఉంది. భద్రత పరంగా మారుతి సుజుకి ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు మరియు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్లను స్టాండర్డ్‌గా అందించింది.

భార్య భర్తల గొడవతో ప్రమాదానికి గురైన మారుతి స్విఫ్ట్ కారు: నలుగురు మృతి

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మారుతి స్విఫ్ట్ మార్కెట్లోకి విడుదలైనప్పటి నుండి చోటు చేసుకున్న ప్రమాదాల్లో మొదటి యాక్సిడెంట్ ఇదే. అనుకోకుండా జరిగిన ఈ ఘటనలో నాలుగురు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు వివిధ రకాల కారణాలతో రోడ్డు ప్రమాదాలు జరగడాన్ని మనం గమనించి ఉంటాం. కానీ, డ్రైవింగ్‌లో భార్య భర్తల గొడవ కారణంగా ఇలాంటి ప్రమాదం జరిగడం బహుశా ఇదే మొదటిది కావచ్చు.

మన తప్పిదాల వలన అమాయక ప్రజల ప్రాణాలు బలికావడం చాలా దారుణం. దయచేసి, డ్రైవింగ్‌లో ఉన్నపుడు నిశ్శబ్దంగా ద్యాసను డ్రైవింగ్ మీదనే ఉంచండి. ఇతరులతో మాట్లాడితే ద్యాసను కోల్పోయి యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది.

Source: Team-BHP

భార్య భర్తల గొడవతో ప్రమాదానికి గురైన మారుతి స్విఫ్ట్ కారు

1.రాంగ్ పార్కింగ్ చేశాడని 3 కోట్లు ఖరీదైన కారును నుజ్జు నుజ్జు చేశారు

2.2018 ఎడిషన్ మారుతి వితారా బ్రిజా విడుదలకు సర్వం సిద్దం

3.ఫోర్డ్ ఇకోస్పోర్ట్ ఇప్పుడు మరో రెండు కొత్త వేరియంట్లలో

4.మోడిఫైడ్ సైలెన్సర్లతో పట్టుబడితే ఏకంగా RC రద్దు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు

5.విడుదలకు ముందే హోండా అమేజ్ వేరియంట్లు లీక్

Most Read Articles

English summary
Read In Telugu: Husband and wife fight while driving car results in accident – 4 dead
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X