ముంబాయ్ - పూనే మధ్య భారతదేశపు తొలి హైపర్ లూప్ రవాణా వ్యవస్థ

By Anil
Recommended Video - Watch Now!
New Maruti Swift Launch: Price; Mileage; Specifications; Features; Changes

భారతదేశపు తొలి హైపర్‌లూప్ రవాణా వ్యవస్థను పూనే - ముంబాయ్ నగరాల మధ్య నిర్మించనున్నారు. ఇందుకు హైపర్‌లూప్ వన్ సంస్థ మరియు మహారాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర ఒప్పందం కుదుర్చుకున్నాయి.

ముంబాయ్-పూనే మధ్య హైపర్‌లూప్

వర్జిన్ హైపర్‍‌లూప్ వన్ సంస్థ వ్యవస్థాపకుడు బ్రిటన్ దిగ్గజం రిచర్డ్ బ్రాన్సన్ భారత్‌లో సూపర్ ఫాస్ట్ రవాణా వ్యవస్థను నిర్మించడానికి ప్రత్యేక ప్రతిపాదనలతో ముందుకొచ్చాడు.

ముంబాయ్-పూనే మధ్య హైపర్‌లూప్

ముంబాయ్‌లోని నూతన ఎయిర్‌పోర్ట్ నుండి పూనే నగరాలను ఈ హైపర్‌లూప్ కలుపుతుంది. కేవలం 25 నిమిషాల్లో ప్రయాణించే ఈ మార్గంలో హైపర్‌లూప్ ద్వారా సుమారుగా మూడు గంటల సమయం ఆదా అవుతుంది.

ముంబాయ్-పూనే మధ్య హైపర్‌లూప్

రెండు నగరాల మధ్య హైపర్‌లూప్ ఫ్రేమ్‌వర్క్ కోసం ఆదివారం నాడు ముంబాయ్‌లో జరిగిన మ్యాగ్నెట్ ముంబాయ్ వేదికలో వర్జిన్ గ్రూప్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్ మహారాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన ప్రాథమిక ఒప్పందం మీద సంతకం చేశారు.

ముంబాయ్-పూనే మధ్య హైపర్‌లూప్

వర్జిన్ గ్రూప్ విడుదల చేసిన ఓ ప్రకటన ప్రకారం, తుది ఒప్పందం జరిగిన అనంతరం తొలి రెండు లేదా ముడేళ్లలో నిర్మాణం పరంగా ఉన్న కీలక అంశాలను పర్యవేక్షించి, తరువాత ఐదు నుండి ఏడేళ్లలోపు పూనే-ముంబాయ్ మధ్య హైపర్‌లూప్ ట్యూబుల నిర్మాణాన్ని పూర్తి చేయనుంది.

ముంబాయ్-పూనే మధ్య హైపర్‌లూప్

రిచర్డ్ బ్రాన్సన్ ఈ సందర్భంగా హైపర్‌లూప్ గురించి మాట్లాడుతూ, తొలుత ఈ హైపర్‌లూప్ రవాణా వ్యవస్థకు బిలియనీర్ ఎలన్ మస్క్ 2013లో బీజం వేశాడు. శరవేగంగా పెరిగిపోతున్న నగరీకరణతో తలమునకలైన భారత్‌కు రవాణా పరంగా మౌలిక సదుపాయ సమస్యలను పరిష్కరించేందుకు హైపర్‌లూప్ రవాణా వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నాడు.

ముంబాయ్-పూనే మధ్య హైపర్‌లూప్

ముంబాయ్-అహ్మదాబాద్ వాణిజ్య నగరాలను కలిపేందుకు 316 మైళ్ల మేర బుల్లెట్ రైలు మార్గం కోసం మరియు దేశ రైల్వే వ్యవస్థను అభివృద్దిపరిచేందుకు ప్రధాని నరేంద్ర మోడీ గత ఏడాది సుమారుగా 155బిలియన్ డాలర్లను కేటాయించారు.

ముంబాయ్-పూనే మధ్య హైపర్‌లూప్

వర్జిన్ హైపర్‌లూప్ వన్ ప్రాథిమిక దర్యాప్తు మేరకు30 సంవత్సరాల పాటు సామాజిక మరియు ఆర్థిక ప్రయోజనాల కోసం పూనే-ముంబాయ్ నగరాల మధ్య నిర్మించతలపెట్టిన హైపర్‌లూప్ ప్రాజెక్ట్ కోసం సుమారుగా 55 బిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నారు.

ముంబాయ్-పూనే మధ్య హైపర్‌లూప్

20వ శతాబ్దంలో రైల్వే వ్యవస్థ కీలకపాత్ర పోషించినట్లు, 21వ శతాబ్దంలో వర్జిన్ హైపర్‌లూప్ వన్ వ్యవస్థ ప్రభావం ఎక్కువగా ఉంటుందని రిచర్జ్ తెలిపాడు. భారతదేశపు హైపర్‌లూప్ వ్యవస్థలో పూనే-ముంబాయ్ కారిడార్ తొలి ఆదర్శ హైపర్‌లూప్‌గా నిలవనుందని చెప్పుకొచ్చాడు.

ముంబాయ్-పూనే మధ్య హైపర్‌లూప్

వర్జిన్ హైపర్‌లూప్ వన్ సంస్థ నెవడాలో హైపర్‌లూప్ మీద పరీక్షలు జరుపుతోంది. గంటకు 240 మైళ్ల వేగాన్ని అందుకునేలా హైపర్‌లూప్ రవాణాను అభివృద్ది చేశారు. 2021 నాటికి మూడు హైపర్‌లూప్ ప్రొడక్షన్ సిస్టమ్స్‌ను నిర్మించే లక్ష్యంతో పనిచేస్తోంది.

ముంబాయ్-పూనే మధ్య హైపర్‌లూప్

గుండ్రటి ట్యూబుల్లో తక్కువ ఒత్తిడితో మ్యాగ్నెటిక్ లెవిటేషన్ ఫోర్స్ టెక్నాలజీ ద్వారా విమానాల తరహా వేగంతో ప్రజలను మరియు గూడ్స్ రవణా చేయడానికి హైపర్‌లూప్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థ మీద అకుర సంస్థ వర్జిన్ హైపర్‌లూప్ వన్ పనిచేస్తోంది.

Most Read Articles

English summary
Read In Telugu: Hyperloop One In India — Futuristic High-Speed Transportation Coming To India
Story first published: Tuesday, February 20, 2018, 16:02 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X