తీవ్ర దుమారం రేపుతున్న హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్

కొత్త తరం హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ రూ. 9.44 లక్షల ప్రారంభ ధరతో మే 2018లో విడుదలయ్యింది. కేవలం రెండు నెలల్లో 40,000 లకు పైగా బుకింగ్స్ నమోదయ్యాయి.

హ్యుందాయ్ క్రెటా ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్‌యూవీలలో ఒకటి. 2015లో విడుదలైనప్పటి నుండి క్రెటా ఎస్‍‌యూవీ భారీ విజయాన్ని అందుకొంది. అయితే, కంపెనీ ఇటీవల క్రెటా ఎస్‌యూవీని ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో లాంచ్ చేసింది. క్రెటా ఫేస్‌లిఫ్ట్ మునుపటి మోడల్ కంటే రెట్టింపు ఫలితాలు సాధిస్తోంది.

తీవ్ర దుమారం రేపుతున్న హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్

కొత్త తరం హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ రూ. 9.44 లక్షల ప్రారంభ ధరతో మే 2018లో విడుదలయ్యింది. కేవలం రెండు నెలల్లో 40,000 లకు పైగా బుకింగ్స్ నమోదయ్యాయి.

తీవ్ర దుమారం రేపుతున్న హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్

ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ ఫ్రంట్ డిజైన్‌లో పెద్ద పరిమాణంలో ఫ్రంట్ గ్రిల్, బంపర్, న్యూ ఫాగ్ ల్యాంప్స్ వచ్చాయి. అదే విధంగా క్రెటా ఫేస్‌లిఫ్ట్ వెనుక వైపున రీడిజైన్ చేయబడిన బంపర్, న్యూ టెయిల్ ల్యాంప్స్ అదే విధంగా 17-అంగుళాల డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

తీవ్ర దుమారం రేపుతున్న హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్

హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ ఆరు విభిన్నవేరియంట్లలో లభ్యమవుతోంది. అవి, ఇ, ఇ+, ఎస్, ఎస్ఎక్స్, ఎస్ఎక్స్ డ్యూయల్ టోన్, మరియు ఎస్ఎక్స్(ఒ). ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ క్రెటా ఎస్‌యూవీలో స్మార్ట్ కీ బ్యాండ్, ఆరు రకాలుగా అడ్జెస్ట్ చేసుకునే వీలున్న డ్రైవర్ సీటు, ఎలక్ట్రిక్ సన్‍‌‌రూఫ్, వైర్-లెస్ ఛార్జింగ్ మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటి అదనపు ఫీచర్లు పరిచయం అయ్యాయి.

తీవ్ర దుమారం రేపుతున్న హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్

క్రెటా ఫేస్‌లిఫ్ట్ రెండు అదనపు కలర్ ఆప్షన్‌లలో పరిచయం అయ్యింది. అవి, ప్యాసన్ ఆరేంజ్ మరియు మెరైన్ బ్లూ. సరికొత్త ప్యాసన్ ఆరేంజ్ కలర్ బ్లాక్ రూఫ్ గల డ్యూయల్ టోన్ ఆప్షన్‌లో కూడా లభ్యమవుతోంది.

తీవ్ర దుమారం రేపుతున్న హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్

2018 హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ ఎస్‌యూవీలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అన్ని వేరియంట్లలో తప్పనిసరిగా వచ్చాయి. అయితే, టాప్ ఎండ్ వేరియంట్లలో ఆరు ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, రియర్ వ్యూవ్ కెమెరా, రియర్ పార్కింగ్ సెన్సార్లు మరియు ఐఎస్ఒఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ ఉన్నాయి.

తీవ్ర దుమారం రేపుతున్న హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్

క్రెటా ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ సాంకేతికంగా, 1.4-లీటర్ మరియు 1.6-లీటర్ డీజల్ ఇంజన్‌లు, అదే విధంగా 1.6-లీటర్ పెట్రోల్ యూనిట్‌లో లభ్యమవుతోంది. 1.6-లీటర్ ఇంజన్‌లు 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అదే విధంగా 1.4-లీటర్ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభ్యమవుతోంది.

తీవ్ర దుమారం రేపుతున్న హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

పాత తరం క్రెటాతో పోల్చుకుంటే కొత్త తరం హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌లో అత్యాధునిక మరియు ప్రీమియం ఫీచర్లు వచ్చాయి. ధరకు తగ్గ విలువలతో, ప్రీమియం లక్షణాలను కలిగి ఉండటంతో హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ భారీ సక్సెస్ అందుకుంది.

Most Read Articles

English summary
Read In Telugu: Hyundai Creta Facelift Receives Over 40,000 Bookings In Two Months
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X