హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 మీద భారీగా పెరిగిన ధర

హ్యుందాయ్ తమ బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 ధర పెంచినట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 అన్ని వేరియంట్ల మీద 3 శాతం మేర ధరలు పెంచినట్లు పేర్కొంది.

By Anil Kumar

హ్యుందాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ తమ బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 ధర పెంచినట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 అన్ని వేరియంట్ల మీద 3 శాతం మేర ధరలు పెంచినట్లు పేర్కొంది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 మీద భారీగా పెరిగిన ధర

పెట్టుబడి మరియు తయారీ ఖర్చులు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ధరల పెంపు తప్పనిసరి అయ్యిందని చెప్పుకొచ్చింది. ధరలు పెంపు అనంతరం గ్రాండ్ ఐ10 లోని ప్రతి వేరియంట్ మీద సుమారుగా రూ. 21,000 వరకు పెరిగింది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 మీద భారీగా పెరిగిన ధర

ధరల పెంపు తర్వాత సవరించబడిన కొత్త ధరలు ఆగష్టు 1, 2018 నుండి అమల్లోకి వస్తాయి. గ్రాండ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్ హ్యుందాయ్ ఇండియా లైనప్‌లోని ఐ20 మోడల్ క్రింది స్థానాన్ని భర్తీ చేస్తుంది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 మీద భారీగా పెరిగిన ధర

హ్యుందాయ్ మోటార్స్ గ్రాండ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్ కారును సెప్టెంబర్ 2013లో తొలిసారిగా లాంచ్ చేసింది. సరిగ్గా ఏడాది క్రితం ఫిబ్రవరిలో గ్రాండ్ ఐ10 పలు మార్పులు చేర్పులతో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో విడుదలయ్యింది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 మీద భారీగా పెరిగిన ధర

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 కంపెనీ యొక్క బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా నిలిచింది. విశాలమైన ఇంటీరియర్ మరియు గల హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్‌లలో మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌తో లభ్యమవుతోంది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 మీద భారీగా పెరిగిన ధర

గ్రాండ్ ఐ10 లోని 1.2-లీటర్ పెట్రోల్ యూనిట్ 83బిహెచ్‌పి పవర్ మరియు 114ఎన్ఎమ్ టార్క్, అదే విధంగా 1.2-లీటర్ డీజల్ యూనిట్ 75బిహెచ్‌పి పవర్ మరియు 190ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 మీద భారీగా పెరిగిన ధర

మారుతి గ్రాండ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్ కారులో 7-అంగుళాల పరిమాణంలో ఉన్న టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటో ఫోల్డింగ్ అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్, మల్టీ మీడియా కోసం 1జీబీ ఇన్-బిల్ట్ మెమొరీ స్టోరేజ్ సిస్టమ్, రియర్ ఏ/సి వెంట్స్, రియర్ పార్కింగ్ సెన్సార్లు మరియు కెమెరా, కూల్డ్ గ్లూవ్ బాక్స్, డ్యూయల్ టోన్ ఇంటీరియర్, 14-అంగుళాల అల్లాయ్ వీల్స్, స్టార్ట్/స్టాప్ బటన్, స్మార్ట్ కీ, ఎయిర్ బ్యాగులు మరియు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 మీద భారీగా పెరిగిన ధర

2018 హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 ఫేస్‌లిఫ్ట్ విపణిలో ఉన్న మారుతి సుజుకి స్విఫ్ట్, హోండా బ్రియో మరియు ఫిగో వంటి మోడళ్లకు పోటీనిస్తుంది. హ్యుందాయ్ మోటార్స్ అతి త్వరలో శాంట్రో హ్యాచ్‌బ్యాక్ కారును విడుదల చేసి, ఇది పూర్తి స్థాయిలో విడుదలైతే ఇయాన్ మరియు గ్రాండ్ ఐ10 మధ్య స్థానాన్ని భర్తీ చేస్తుంది.

Most Read Articles

English summary
Read In Telugu: 2018 Hyundai Grand i10 price increased in India by up to Rs 21,000
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X