Just In
- 6 hrs ago
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- 7 hrs ago
డిసెంబర్లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..
- 7 hrs ago
మారుతి సుజుకి కంపెనీ తలమానికం 'మారుతి స్విఫ్ట్' ; ఎందుకో తెలుసా?
- 9 hrs ago
భారత్‌లో స్ట్రీట్ 750, స్ట్రీట్ రాడ్ డిస్కంటిన్యూ; హ్యార్లీ కథ ముగిసినట్లేనా?
Don't Miss
- News
43 లక్షల మంది ఇళ్లకు బీజేపీ కార్యకర్తలు.. హస్తిన పురవీధుల్లో.. ఎందుకంటే
- Movies
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
తెలంగాణ కారును సీజ్ చేసిన బెంగళూరు పోలీసులు: కారణమేంటో తెలుసా...?
బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తి తన హ్యుందాయ్ ఐ20 కారులో హైదారాబాద్‌కు బయలుదేరాడు. వెళుతున్నది ఒక్కడినే కదా, తనతో పాటు మరో ఇద్దురు లేదా ముగ్గురుని కార్ పూలింగ్ పద్దతి ద్వారా హైదారాబాద్‌కు తీసుకెళ్లాలనుకున్నాడు. అనుకున్నట్లుగానే, కార్ రైడ్ షేరింగ్ యాప్ ద్వారా బెంగళూరులో ముగ్గురు వ్యక్తులు రూ. 1600 లకు తనతో పాటు ప్రయాణించడానికి సిద్దమయ్యారు.

ఆ నలుగురు ప్రయాణించాల్సిన రోజు వచ్చేసింది. అయితే, ఇక్కడే అసలైన ట్విస్ట్ మొదలైంది. అదును చూసి పట్టుకున్న బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు కార్ పూలింగ్ చట్టరీత్యా నేరం అంటూ, ఆ కారు యజమానికి రూ. 2,000 జరిమానా విధించి, కారును సీజ్ చేశారు.
అసలు కార్ పూలింగ్ అంటే ఏమిటి..? భారత రవాణా చట్టం ప్రకారం ఇది ఎందుకు నేరం..? మరియు ఈ కేసు నమోదు చేయడానికి పోలీసులు పన్నిన పథకం ఏంటో చూద్దాం రండి...

కార్ పూలింగ్ అనగా...?
కార్ పూలింగ్ అంటే మీ కారులో ప్రయాణాన్ని ఇతరులతో పంచుకోవటమే. సింపుల్‌గా చెప్పాలంటే.. మీరు ప్రతిరోజూ ఆఫీసుకు వెళ్లటానికి ఒకే రూట్లో ట్రావెల్ చేస్తున్నట్లయతే, అదే రూట్లో ట్రావెల్ చేసే మీ స్నేహితులు లేదా మీకు తెలిసిన వ్యక్తులను మీ కారులో పికప్, డ్రాపింగ్ చేయటం ద్వారా వారి నుండి కొంత మొత్తాన్ని కలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా చేయటం వలన ఇంధన ఖర్చును అందరూ సమానంగా పంచుకున్నట్లు అవుతుంది. ఈ పద్ధతిని కార్ పూలింగ్ (కార్ షేరింగ్ కూడా అనొచ్చు) అంటారు.

నగరంలో కార్ పూలింగ్ సేవలు అధికమవుతుండటంతో బెంగళూరు సిటీ ట్రాఫిక్ పోలీసులు ఇలాంటి కేసులను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. తొలుత కొంత పోలీసులు కార్ పూలింగ్ సేవలు అందించే మొబైల్ యాప్స్ డౌన్లోడ్ చేసుకుని సాధారణ ప్రయాణికుల్లా కారు యజమానిని నమ్మించారు.

అందులో భాగంగానే బెంగళూరు నుండి హైదరాబాద్ వెళుతున్న తెలంగాణ స్టేట్ రిజిస్ట్రేషన్ గల కారును బుక్ చేసుకున్నారు. అయితే, మఫ్టీలో ఉన్న పోలీసులను పికప్ చేసుకోవడానికి వచ్చి అడ్డంగా బుక్కయ్యాడు.

డ్యూటీలో ఉన్న పోలీసులు కారు రిజిస్ట్రేషన్ ప్రకారం, వ్యక్తిగత అవసరాల కోసం మాత్రమే ఉపయోగించాలి, కానీ మీరు కమర్షియల్ అవసరాలకు ఉపయోగిస్తున్నారు, కార్ పూలింగ్ చట్టరీత్యా నేరం మరియు ఇన్సూరెన్స్ కూడా ల్యాప్స్ అయిపోయిందని రూ. 2,000 జరిమానా విధించి, కారు సీజ్ చేశారు.

హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి పనిమీద బెంగళూరుకు వచ్చాడు. అయితే, తిరుగు ప్రయాణంలో తనతో పాటు మరికొంత మందిని తీసుకెళ్తే ఇంధన ఆదా అవుతుందని ఒక కార్ పూలింగ్ మొబైల్ అప్లికేషన్లో కారు రిజిస్ట్రేషన్ వివరాలు మరియు తాను ప్రయాణిస్తున్న మార్గం, తేదీ మరియు ఇతర వివరాలను నమోదు చేశాడు.

అప్పటికే ప్లాన్ ప్రకారం, కాలి పూలింగ్ చేస్తున్న యజమానుల కోసం మాటుగా మొబైల్ అప్లికేషన్ ద్వారా హైదారాబాద్‌కు ముగ్గురు ప్రయాణించడానికి రూ. 1600 లతో రైడ్ షేరింగ్ సర్వీస్ బుక్ చేసుకున్నారు.

బెంగళూరూలోని జయనగర్ మెట్రో స్టేషన్ వద్ద కలుసుకునేలా ముందుగానే ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ముగ్గురుని పికప్ చేసుకోవడానికి వచ్చిన కారు యజమానితో మీ కారును సీజ్ చేసి, అతనికి జరిమానా విధించారు.

ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి రైడ్ ఆఫర్ చేసే అవకాశం కేవలం యెల్లో బోర్డు ఉన్న అద్దె వాహనాలకు మాత్రమే ఉంది. కానీ, వైట్ బోర్డు ఉన్న కారు యజమానులు ఈ సర్వీసులు నిర్వహించకూడదు. "యజమానిని ఈ రూల్ గురించి ప్రశ్నిస్తే, ఈ రూల్ ఉన్నట్లు తనకు తెలియదని చెప్పినట్లు" అధికారులు తెలిపారు.

ఇలాంటి మరో రెండు ఘటనల్లో, బెంగళూరు నుండి చెన్నైకి రైడ్ షేర్ చేసినందుకు రూ. 1,000 మరియు బెంగళూరు నుండి హసన్‌కు రైడ్ షేర్ చేసినందుకు రూ. 360 లు జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు.
కార్ పూలింగ్ చట్టరీత్యా ఎందుకు నేరం...?

"కారు పూలింగ్ ద్వారా ప్రైవేట్ కార్లలో ప్రయాణించడం ఎంతో రిస్క్‌తో కూడుకున్నది. కారు పూలింగ్ పద్దతిలో ప్రయాణిస్తున్నపుడు ఏదైనా ప్రమాదం జరిగితే, ప్రైవేట్ కారు ఇన్సూరెన్స్ ప్రకారం వారికి ఇన్సూరెన్స్ వర్తించదు. కానీ, యెల్లో బోర్డ్ ఉన్న వాహనాలలో ఇన్సూరెన్స్ వర్తిస్తుందని" అధికారులు తెలిపారు.

అద్దె కార్ల నిర్వహణ సంస్థలైన ఓలా మరియు ఉబెర్ అందిస్తున్న ట్యాక్సీ సేవలు చట్టబద్దమైనవి. ఇవి భారత మోటార్ వెహికల్ చట్టాన్ని పాటిస్తూ సేవలందిస్తున్నాయి. కానీ, వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించే వైట్ బోర్డు ఉన్న వాహనాలు ఇందుకు పూర్తిగా విరుద్దం.

వాణిజ్యపరమైన అవశాల కోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొన్ని రైడ్ షేరింగ్ మొబైల్ అప్లికేషన్లు కార్ పూలింగ్ పట్ల ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నాయని తెలిపారు. ఎవరైనా పర్సనల్ కార్లను కమర్షియల్ అవసరాల కోసం ఉపయోగిస్తే చట్టపరగంగా శిక్షార్హులు.
ఈ కథనం పట్ల మీ అభిప్రాయాన్ని క్రింది కామెంట్ బాక్స్ ద్వారా మాతో పంచుకోండి...
Source: The Hindu