స్పాట్ టెస్టింగ్ జరుపుతుండగా పట్టుబడిన హ్యుందాయ్ ఐ30

హ్యుందాయ్ మోటార్ ఇండియా సరికొత్త ఐ30 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారును దేశీయ మార్కెట్లోకి లాంచ్ చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది. తాజాగా, పూనేలోని ఏఆర్ఏఐ కార్యాలయానికి సమీపంలో రహదారి పరీక్షలు నిర్వహిస్త

By Anil Kumar

హ్యుందాయ్ మోటార్ ఇండియా సరికొత్త ఐ30 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారును దేశీయ మార్కెట్లోకి లాంచ్ చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది. తాజాగా, పూనేలోని ఏఆర్ఏఐ కార్యాలయానికి సమీపంలో రహదారి పరీక్షలు నిర్వహిస్తుండగా పట్టుబడింది.

ఐ30 కారును పరీక్షిస్తున్న హ్యుందాయ్

అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఐ30 ప్రీమియం కారును ఇండియన్ రోడ్ల మీద అత్యంత చురుకుగా పరీక్షిస్తోంది. టెస్టింగ్ సందర్భంలో తీసిన ఫోటోలు ఇప్పుడు అందరినీ విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.

ఐ30 కారును పరీక్షిస్తున్న హ్యుందాయ్

హ్యుందాయ్ ఐ30 కారుకు వెనుక వైపున ఉద్గారాలను పరీక్షించే పరికరాన్ని అమర్చి పరీక్షిస్తూ పూనేలోని ఏఆర్ఏఐ కార్యాలయం వద్ద పట్టుబడింది. బహుశా దీనిని 2019 ప్రారంభంలో విడుదల చేసే సూచనలు కనిపిస్తున్నాయి.

ఐ30 కారును పరీక్షిస్తున్న హ్యుందాయ్

ఇండియన్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్ల విభాగంలో మారుతి బాలెనో, హ్యుందాయ్ ఎలైట్ ఐ20 మరియు హోండా జాజ్ కార్లు ఉన్నాయి. అయితే, ఐ30 వీటి కంటే ఓ మెట్లు పై స్థానంలో నిలుస్తుంది. హ్యుందాయ్ ఐ30 విడుదలైతే మార్కెట్లో ఉన్న ఎలైట్ ఐ20 మరియు క్రెటా మధ్య స్థానాన్ని భర్తీ చేస్తుంది.

ఐ30 కారును పరీక్షిస్తున్న హ్యుందాయ్

సరికొత్త హ్యుందాయ్ ఐ30 పొడవు 4340ఎమ్ఎమ్, వెడల్పు 1795ఎమ్ఎమ్ మరియు ఎత్తు 1455ఎమ్ఎమ్‌గా ఉంది. ఐ30 మొత్తం బరువు 1,316 కిలోలుగా ఉంది మరియు ఇందులో 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఈ కొలతలతో సాధారణ హ్యాచ్‌బ్యాక్ కార్ల కంటే మరింత పెద్దగా కనిపిస్తుంది.

ఐ30 కారును పరీక్షిస్తున్న హ్యుందాయ్

అంతర్జాతీయ విపణి నుండి తీసుకొస్తున్న హ్యుందాయ్ ఐ30 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ కారును హ్యుందాయ్ డిజైన్ స్కల్ప్‌చర్ 2.0 ఫిలాసఫీ ఆధారంగా డిజైన్ చేశారు. ఇందులో హెక్సాగోనల్ ఫ్రంట్ గ్రిల్, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు మరియు ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, నిలువుటాకారంలో ఉన్న ఎల్ఇడి టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి.

ఐ30 కారును పరీక్షిస్తున్న హ్యుందాయ్

హ్యుందాయ్ ఐ30 ప్రస్తుతం యూరోపియన్ మరియు అమెరికా మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ రెండు మార్కెట్లలో లభ్యమయ్యే ఐ30 కారులో పూర్తిగా యూరో-6 ఉద్గార నియమాలను పాటించే ఇంజన్‌లు ఉన్నాయి.

ఐ30 కారును పరీక్షిస్తున్న హ్యుందాయ్

అయితే భారత్‌లో విడుదలవుతున్న 2018 హ్యుందాయ్ ఐ30 వెర్నా సెడాన్‌లో ఉన్న అవే 1.4-లీటర్ మరియు 1.6-లీటర్ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లతో లభించనుంది. హ్యుందాయ్ ఐ30 కారుకు ఇండియాలో సరైన పోటీ అంటూ ఏదీ లేదు. అయితే, దీని విడుదల భారీ మార్పులకు వేదిక అవుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు.

ఐ30 కారును పరీక్షిస్తున్న హ్యుందాయ్

ఇదే లక్షణాలతో టాటా మోటార్స్ 45ఎక్స్ కోడ్ పేరుతో ఓ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారును అభివృద్ది చేస్తోంది. దీనికి కూడా రహస్యంగా రోడ్ టెస్ట్ నిర్వహించింది. అప్పుడు విడుదలైన ఫోటోల బహుశా భవిష్యత్తులో ఈ రెండింటి మధ్య గట్టి పోటీ ఏర్పడవచ్చు.

ఐ30 కారును పరీక్షిస్తున్న హ్యుందాయ్

అంతే కాకుండా, వోక్స్‌వ్యాగన్ గ్రూప్ ఇటీవల గోల్ఫ్ హ్యాచ్‌బ్యాక్ కారును ఇండియన్ రోడ్ల మీద పరీక్షించింది. ఈ పరిణామాల నేపథ్యంలో వచ్చే ఏడాది పెద్ద పరిమాణంలో ఉన్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్ల విడుదలకు కార్ల తయారీ సంస్థలు కసరత్తులు ప్రారంభించాయని తెలుస్తోంది.

Source: forum.autocarindia

Most Read Articles

English summary
Read In Telugu: Hyundai i30 spied near ARAI in Pune – Could be launched in India?
Story first published: Wednesday, June 27, 2018, 12:57 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X