ఒక్కసారి ఛార్జింగ్‌తో 469 కిమీలు ప్రయాణించే హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ

దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ అతి త్వరలో ప్రారంభం కానున్న 2018 జెనీవా మోటార్ షోలో ఆవిష్కరించనున్న కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని రివీల్ చేసింది.

By Anil Kumar

Recommended Video

Auto Expo 2018: Mahindra KUV100 Electric Launch Details, Specifications, Features - DriveSpark

దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ అతి త్వరలో ప్రారంభం కానున్న 2018 జెనీవా మోటార్ షోలో ఆవిష్కరించనున్న కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని రివీల్ చేసింది. కోనా ఎలక్ట్రిక్ సబ్‌కాపాంక్ట్ ఎస్‌యూవీ మరియు హ్యుందాయ్ యొక్క రెండవ ఎలక్ట్రిక్ వెహికల్.

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ

కోనా ఎలక్ట్రిక్ ఓవరాల్ డిజైన్ రెగ్యులర్ కోనా ఎస్‌యూవీ శైలిలో ఉంటుంది. కోనా ఎలక్ట్రిక్ అందరినీ ఆకట్టుకునే అంశం మైలేజ్. ఒక్కసారి ఛార్జింగ్ నిరంతరాయంగా 469కిలోమీటర్లు ప్రయాణించే అతి పెద్ద బ్యాటరీ ప్యాక్ ఉంది.

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఫ్రంట్ డిజైన్ అచ్చం రెగ్యులర్ వెర్షన్ కోనా ఎస్‌యూవీనే పోలి ఉంటుంది. అయితే, గాలి ద్వారా కలిగే ఘర్షణను తగ్గించడానికి ఫ్రంట్ డిజైన్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఇతర డిజైన్ ఎలిమెంట్లలో పలుచటి ఎల్ఇడి హెడ్‌ల్యాంప్స్, పగటి పూట వెలిగే లైట్లు మరియు రీడిజైన్ చేయబడిన బంపర్ ఉన్నాయి. ఫ్రంట్ గ్రిల్‌కు ప్రక్కనే ఛార్జింగ్ పోర్ట్ కలదు.

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ

కోనా ఎలక్ట్రిక్ సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, చాలా ఆకర్షణీయంగా మరియు ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ మరియు వాలుగా రూఫ్ లైన్ గమనించవచ్చు. బాడీ చుట్టూ బ్లాక్ ప్లాస్టిక్ క్లాడింగ్ మరియు 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. కోనా ఎలక్ట్రిక్ రియర్ డిజైన్‌లో ఇంటిగ్రేటెడ్ బ్రేక్ లైట్ స్పోర్టివ్ స్పాయిలర్, స్లిమ్ ఎల్ఇడి లైట్లు, ఇండికేటర్ మరియు రివర్స్ లైట్ల చుట్టూ క్లాడింగ్ మరియు పదునైన షార్క్ ఫిన్ యాంటెన్నా వంటివి ఉన్నాయి.

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ఇంటీరియర్‌లో అధునాతన 7-అంగుళాల పరిమాణం గల టచ్ స్క్రీన్‌ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, హీటెడ్ మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, మరియు ఆప్షనల్ హీటెడ్ స్టీరింగ్ వీల్ వంటివి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి.

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ

సౌలభ్యమైన డ్రైవింగ్ కోసం క్రూయిజ్ కంట్రోల్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ డిపార్చర్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, స్పీడ్ లిమిట్ సమాచారం ఇంకా ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ రెండు విభిన్న వేరియంట్లలో లభ్యం కానుంది. అందులో ఒకటి తక్కువ రేంజ్ గల 39.2kW బ్యాటరీ మరియు అధిక రేంజ్ గల 64kW బ్యాటరీలను కలిగి ఉంది.

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ

వీటిలో 39.2kW లిథియం-అయాన్ పాలిమర్ బ్యాటరీ వచ్చే వేరియంట్ 133బిహెచ్‌ పవర్ మరియు 395ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సింగల్ ఛార్జింగ్‌తో 299కిలోమీటర్లు ప్రయాణించే ఈ బ్యాటరీ 6 గంటల 10 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 54 నిమిషాల్లో 80 శాతం బ్యాటరీ ఛార్జ్ అవుతుంది.

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ

అదే విధంగా 64kW లిథియం-అయాన్ పాలిమర్ బ్యాటరీ ప్యాక్ గల వేరియంట్ 201బిహెచ్‌పి పవర్ మరియు 395ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఒక్కసారి ఛార్జింగ్‌తో 469కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ

64kW పూర్తి ఛార్జింగ్ కోసం 9 గంటల 40 నిమిషాల సమయం పడుతుంది. ఫాస్ట్ ఛార్జర్ ఉపయోగించి 54 నిమిషాల్లో 80 శాతం బ్యాటరీని ఛార్జ్ చేసుకోవచ్చు. ఇందులో పెద్ద ఎక్కువ కెపాసిటి గల బ్యాటరీ ఉండటంతో కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ గరిష్టంగా గంటకు 167కిమీల వేగాన్ని అందుకుంటుంది.

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ యూరోపియన్ మార్కెట్ యొక్క తొలి సబ్‌కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ. హ్యుందాయ్ ఇండియన్ మార్కెట్ కోసం ఖరారు చేసిన ఉత్పత్తుల్లో కోనా ఎలక్ట్రిక్ కూడా ఒకటి. మరియు హ్యుందాయ్ నుండి ఇండియన్ మార్కెట్లోకి వస్తున్న తొలి ఎలక్ట్రిక్ వెహికల్ కోనా ఎలక్ట్రిక్. అధిక డ్రైవింగ్ రేంజ్ మరియు అద్భుతమైన పనితీరుతో వస్తున్న కోనా ఎలక్ట్రిక్ దేశీయ మరియు అంతర్జాతీయ విపణిలో భారీ విజయాన్ని అందుకోనుంది.

Most Read Articles

English summary
Read In Telugu: Hyundai Kona Electric SUV Revealed Ahead Of Geneva Debut; Specifications, Features & Images
Story first published: Wednesday, February 28, 2018, 17:01 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X