అతి త్వరలో విడుదలవుతున్న హ్యుందాయ్ కొత్త కారును పూర్తి ఉచితంగా సొంతం చేసుకోండి

By Anil Kumar

హ్యుందాయ్ మోటార్స్ దేశీయ ప్యాసింజర్ కార్ల మార్కెట్లోకి సరికొత్త స్మాల్ హ్యాచ్‌బ్యాక్ కారును విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. కొత్త తరం శాంట్రో కారుగా భావిస్తున్న కారును ఏహెచ్2 కోడ్ పేరుతో తొలి ఫోటోను ఆవిష్కరించింది. దీంతో పాటు ఈ చిన్నకారుకు పేరు పెట్టండి అంటూ... హ్యుందాయ్ నామకరణ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది.

హ్యుందాయ్ కొత్త కారుకు పేరు పెట్టండి

హ్యుందాయ్ నామకరణ్ కార్యక్రమం ద్వారా తమ చిన్న కారుకు కొత్త పేర్లను సూచించే సలహాలను స్వీకరిస్తోంది. 18 ఏళ్లు అంత కంటే ఎక్కువ వయస్సున్న భారతీయులు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. సెప్టెంబర్ 25, 2018 నుండి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని హ్యుందాయ్ పేర్కొంది.

హ్యుందాయ్ కొత్త కారుకు పేరు పెట్టండి

ఈ ఏడాది పండుగ సీజన్‌ ప్రారంభం నాటికి విడుదలకానున్న హ్యుందాయ్ స్మాల్ కారుకు మీరు ఏదైనా పేరు సూచించాలనుకుంటున్నారా..? అయితే, హ్యుందాయ్ ప్రారంభించిన నామకరణ్ మైక్రో వెబ్‌సైట్ లేదా (8652000377, 8652000388 లేదా 8652000399 వాట్సాప్‌ నెంబర్ల ద్వారా సలహాలు ఇవ్వగలరు.

హ్యుందాయ్ కొత్త కారుకు పేరు పెట్టండి

హ్యుందాయ్ నామకరణ్ కార్యక్రమం ముగిసిన అనంతరం సలహాల రూపంలో వచ్చిన పాపులర్ పేర్లను సేకరించి వాటిని వివిధ దశలలో పరిశీలించి ఓ లిస్టును తయారు చేస్తారు. వాటిలో ఒక పేరును హ్యుందాయ్ ఎంచుకుంటుంది. ఆ పేరును సూచించిన పోటీదారుడు ఈ కొత్త కారును గెలుచుకుంటాడు.

హ్యుందాయ్ కొత్త కారుకు పేరు పెట్టండి

హ్యుందాయ్ ఏహెచ్2 కోడ్ పేరుతో అభివృద్ది చేసిన ఈ స్మాల్ హ్యాచ్‌బ్యాక్ కారును శాంట్రో పేరుతోనే విడుదల చేస్తుందని ఎన్నో కథనాలు వెలువడ్డాయి. అయితే, తాజాగా ఈ నామకరణ్ కార్యక్రమాన్ని ప్రారంభించడంతో హ్యుందాయ్ మోటార్స్ ఇతర ఆలోచనల్లో ఉన్నట్లు తెలుస్తోంది.

హ్యుందాయ్ కొత్త కారుకు పేరు పెట్టండి

హ్యుందాయ్ ఇటీవల విడుదల చేసిన స్మాల్ హ్యాచ్‌బ్యాక్ పేపర్ స్కెచ్ ఫోటోను పరిశీలిస్తే పదునైన డిజైన్ అంశాలను గుర్తించవచ్చు. విపణిలో ఉన్న మారుతి సుజుకి సెలెరియో మరియు టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్ కార్లకు సరాసరి పోటీని సృష్టించిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

హ్యుందాయ్ కొత్త కారుకు పేరు పెట్టండి

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ప్యాసింజర్ కార్ల పరిశ్రమంలో దేశీయ కస్టమర్ల ఆదరాభిమానాలు పొందాలంటే ఉన్న ఏకైక మార్గం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో రాణించడమే. ఈ విషయాన్ని పసిగట్టిన హ్యుందాయ్ తమ పాపులర్ శాంట్రో ఆధారంగా సరికొత్త హ్యాచ్‌బ్యాక్ కారును పూర్తి స్థాయిలో విడుదల చేసేందుకు కసరత్తులు ప్రారంభించింది. ఈ పండుగ సీజన్ నాటికే దీనిని లాంచ్ చేయనున్నట్లు సమాచారం.

మరి ఈ హ్యుందాయ్ ఏహెచ్2 హ్యాచ్‌బ్యాక్ కారుకు మీరు ఏ పేరును సూచిస్తారో... క్రింది కామెంట్ సెక్షన్ ద్వారా మాతో పంచుకోండి.

Most Read Articles

English summary
Read In Telugu: Hyundai Announces Naming Campaign For The AH2 Hatchback
Story first published: Friday, August 17, 2018, 13:31 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X