హ్యుందాయ్ శాంట్రో విడుదల వివరాలు

భారతదేశపు రెండవ అతి పెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ తమ బడ్జెట్ ఫ్రెండ్లీ శాంట్రో హ్యాచ్‌బ్యాక్ కారును అత్యంత సరసమైన ధరతో విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.

By Anil

Recommended Video

కఠినమైన ఇండియన్ రోడ్లకు ఫోర్డ్ సమధానం: ఫ్రీస్టైల్ క్రాసోవర్ | Ford Freestyle Unveiled - DriveSpark

భారతదేశపు రెండవ అతి పెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ తమ బడ్జెట్ ఫ్రెండ్లీ శాంట్రో హ్యాచ్‌బ్యాక్ కారును అత్యంత సరసమైన ధరతో విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.

హ్యుందాయ్ శాంట్రో విడుదల

హ్యుందాయ్ ఎంట్రీ లెవల్ మరియు అతి చిన్న హ్యాచ్‌బ్యాక్ శాంట్రో ఫేస్‌లిఫ్ట్‌ను ఏహెచ్2 కోడు పేరుతో హ్యుందాయ్ ఇంజనీరింగ్ బృందం అంతర్గతంగా అభివృద్ది చేసింది. దీనిని ఈ ఏడాది దీపావళి నాటికి దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లోకి ఒకేసారి ప్రవేశపెట్టనుంది.

హ్యుందాయ్ శాంట్రో విడుదల

ఇండియాలో న్యూ శాంట్రో విడుదలకు ముందుగానే, ఢిల్లీలో ఫిబ్రవరి 7 నుండి 14 వరకు జరగబోయే భారతదేశపు అతి పెద్ద వాహన ప్రదర్శన వేదిక 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో ఈ చిన్న కారును ప్రజా సందర్శనకు తీసుకొస్తోంది.

హ్యుందాయ్ శాంట్రో విడుదల

తాజాగా అందిన సమాచారం మేరకు, భారత్‌లో 2018 నుండి 2020 మధ్య హ్యుందాయ్ విడుదల చేసే మొదటి తొమ్మిది కార్లలో శాంట్రో కూడా ఉందని తెలిసింది.

హ్యుందాయ్ శాంట్రో విడుదల

హ్యుందాయ్ మోటార్స్ కూడా తమ ఇండియా శ్రేణిలోకి సరికొత్త కాంపాక్ట్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ వెర్షన్ హ్యాచ్‌బ్యాక్‌ను ప్రవేశపడుతున్న ఖాయం చేసింది. అయితే, కస్టమర్ల నుండి శాంట్రో మీద వస్తున్న ఆధారంగా డీలర్లు కూడా శాంట్రో పేరుతోనే ఆ కొత్త కారును విడుదల చేయాలని హ్యుందాయ్‌ను కోరినట్లు తెలిసింది.

హ్యుందాయ్ శాంట్రో విడుదల

హ్యుందాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరక్టర్ మరియు సిఇఒ వైకె కూ మాట్లాడుతూ, "ఈ ఏడాది దీపావళి కల్లా శాంట్రో బ్యాడ్జ్ పేరుతో మీ ముందుకు వస్తామని తెలిపాడు. శాంట్రో బ్రాండ్ పేరును మళ్లీ వెనక్కి తీసుకురావాలని కస్టమర్ల నుండి మరియు డీలర్ల నుండి ఒత్తిడి ఎక్కువ అయ్యిందని చెప్పుకొచ్చాడు."

2018 కొత్త మారుతి స్విఫ్ట్ ధరల వివరాలు!!

ఇండియాలో అత్యంత దూరం ప్రయాణించే బస్సు సర్వీసు ఇదే!!

హ్యుందాయ్ శాంట్రో విడుదల

హ్యుందాయ్ మోటార్స్ భారత్‌లో ప్యాసింజర్ కార్ల పరిశ్రమలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి రానున్న మూడేళ్లలో సుమారుగా 6,300 కోట్ల రుపాయలు పెట్టనుంది. ఈ మొతాన్ని భారత విపణి కోసం కొత్త ఇంజన్‌ల అభివృద్ది, గుర్గావ్ మరియు ఢిల్లీలో సంస్థ కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి వినియోగించనుంది.

హ్యుందాయ్ శాంట్రో విడుదల

కొత్త తరం శాంట్రో గురించి వివరిస్తూ, సరికొత్త స్మాల్ హ్యాచ్‌బ్యాక్ హ్యుందాయ్ లైనప్‌లో ఉన్న ఐ10 కంటే కాస్త ఎక్కువ పొడవు, ఎత్తు మరియు వెడల్పుగా ఉంటుంది. అదే విధంగా పెట్రోల్ ఇంజన్ మరియు ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి వేరియంట్లో మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చే అవకాశం ఉందని చెప్పుకొచ్చాడు.

హ్యుందాయ్ శాంట్రో విడుదల

హ్యుందాయ్ తీసుకురానున్న తొమ్మిది మోడళ్లలో, రెండు కొత్త ఉత్పత్తులు మోడళ్లు, ఒకటి ఎలక్ట్రిక్ వెహికల్(కోనా ఇవి లేదా ఇయానిక్ ఇవి), రెండు ఫేస్‌లిఫ్ట్ కార్లు(ఐ20 మరియు క్రెటా) మరియు హ్యుందాయ్ అంతర్జాతీయ లైనప్‌లో ఉన్న నాలుగు ఉత్పత్తులు(ఇంకా ఖరారు చేయలేదు) ఉండనున్నాయి.

హ్యుందాయ్ శాంట్రో విడుదల

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హ్యుందాయ్ శాంట్రో ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో ఉన్నట్లయితే, సరిగ్గా ఇప్పటికి 20 ఏళ్లు పూర్తి చేసుకునేది. తొలినాళ్లలో భారత విపణిలో హ్యుందాయ్‌కి గుర్తింపు తీసుకొచ్చిన మోడల్ శాంట్రో కారు.

హ్యుందాయ్ శాంట్రో విడుదల

విశాలమైన క్యాబిన్, అత్యుత్తమ మైలేజ్ మరియు పోటీదారులతో పోల్చుకుంటే అత్యంత సరసమైన ధర వంటివి హ్యుందాయ్ ఇండియాకు శాంట్రో బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిపాయి. కాబట్టి, హ్యుందాయ్ తమ అప్ కమింగ్ శాంట్రో ఫేస్‌‌లిఫ్ట్‌లో కూడా అంశాలను పొందుపరిచే అవకాశం ఉంది.

హ్యుందాయ్ శాంట్రో ఫేస్‌లిఫ్ట్ అంచనాగా రూ. 4 లక్షల నుండి రూ. 5 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్ ధరతో విడుదలయ్యే అవకాశం ఉంది.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

Source: ET Auto

Most Read Articles

English summary
Read In Telugu: All-New Hyundai Santro Launch Details Revealed — Will Be The First Among Nine Product Launches
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X