అక్టోబరులో తమ చిన్న కారు పేరును వెల్లడించనున్న హ్యుందాయ్

హ్యుందాయ్ మోటార్స్ ఇండియా ఈ ఏడాదిలో తమ స్మాల్ హ్యాచ్‌బ్యాక్ కారును విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. తాజాగా అందిన సమాచారం మేరకు, దక్షిణ కొరియా దిగ్గజం హ్యుందాయ్ ఈ ఏడాది దేశీయంగా విడుదల చేయన

By Anil Kumar

హ్యుందాయ్ మోటార్స్ ఇండియా ఈ ఏడాదిలో తమ స్మాల్ హ్యాచ్‌బ్యాక్ కారును విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. తాజాగా అందిన సమాచారం మేరకు, దక్షిణ కొరియా దిగ్గజం హ్యుందాయ్ ఈ ఏడాది దేశీయంగా విడుదల చేయనున్న స్మాల్ హ్యాచ్‌బ్యాక్ కారు పేరును ఆక్టోబర్ 4, 2018 న అధికారికంగా వెల్లడించనున్నట్లు తెలిసింది.

స్మాల్ హ్యాచ్‌బ్యాక్ కారు విడుదల ఖరారు చేసిన హ్యుందాయ్

హ్యుందాయ్ మోటార్స్ తమ శాంట్రో కారునే మళ్లీ విడుదల చేస్తోంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. అయితే, ఈ కొత్త శాంట్రో పేరుకే ముందు లేదా వెనుక మరో పేరును జోడించే అవకాశం ఉంది. గతంలో పాత శాంట్రో కారుకు జింగ్ అనే పేరు పెట్టినట్లు, ఈ సారి మరో ఇట్రెస్టింగ్ పేరును ఖరారు చేయనుంది.

స్మాల్ హ్యాచ్‌బ్యాక్ కారు విడుదల ఖరారు చేసిన హ్యుందాయ్

హ్యందాయ్ మోటార్స్ ఆగష్టు నెలలో ఓ కాంటెస్ట్ నిర్వహించనుంది. ఇందులో కస్టమర్లు మరియు ఔత్సాహికులు పాల్గొని నూతన స్మాల్ కారుకు తాము ఒక పేరును పెట్టవచ్చు. దేశవ్యాప్తంగా అత్యంత పాపులారిటీ దక్కించుకున్న శాంట్రో కారును రీలాంచ్ చేసే క్రమంలో కస్టమర్లతో అనుసంధానమై ఉండేందుకు ఈ ప్రయత్నం చేస్తోంది.

స్మాల్ హ్యాచ్‌బ్యాక్ కారు విడుదల ఖరారు చేసిన హ్యుందాయ్

సమాచార వర్గాల కథనం మేరకు, నూతన హ్యుందాయ్ శాంట్రో హ్యాచ్‌బ్యాక్ విపణిలో ఉన్న హ్యుందాయ్ ఇయాన్ స్థానాన్ని భర్తీ చేయబోతుందని తెలుస్తోంది. సరికొత్త హ్యుందాయ్ శాంట్రో ఒక్కసారి విడుదలైతే ఖరీదైన ప్రీమియం ఫీల్ కలిగించే క్యాబిన్ మరియు విలాసవంతమైన ఫినిషింగ్ కలిగి ఉండనుంది.

స్మాల్ హ్యాచ్‌బ్యాక్ కారు విడుదల ఖరారు చేసిన హ్యుందాయ్

ఈ ఏడాది పండుగ సీజన్ నేపథ్యంలో విడుదలకు సిద్దమవుతున్న కొత్త తరం హ్యుందాయ్ శాంట్రోలో సాంకేతికంగా పాత శాంట్రో నుండి సేకరించిన 1.1-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్ వచ్చే అవకాశం ఉంది. బిఎస్-6 ఉద్గార ప్రమాణాలను పాటించే ఈ ఇంజన్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లతో లభ్యం కానుంది.

స్మాల్ హ్యాచ్‌బ్యాక్ కారు విడుదల ఖరారు చేసిన హ్యుందాయ్

అప్‍‌కమింగ్ హ్యుందాయ్ శాంట్రో ఇంటీరియర్ విషయానికి వస్తే, బహుశా డ్యూయల్ టోన్ ఇంటీరియర్ వచ్చే అవకాశం ఉంది. అత్యంత సౌకర్యవంతమైన సీటింగ్, విశాలమైన క్యాబిన్ మరియు టాప్ ఎండ్ వేరియంట్లో అత్యంత కీలకమైన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు మల్టీ-ఫంక్షన్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు వచ్చే అవకాశం ఉంది.

స్మాల్ హ్యాచ్‌బ్యాక్ కారు విడుదల ఖరారు చేసిన హ్యుందాయ్

ఆల్ న్యూ హ్యుందాయ్ శాంట్రో హ్యాచ్‌‌బ్యాక్ పూర్తి స్థాయిలో విడుదలైతే విపణిలో ఉన్న మారుతి ఆల్టో, ఆల్టో కె100, రెనో క్విడ్ మరియు డాట్సన్ రెడి-గో వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

స్మాల్ హ్యాచ్‌బ్యాక్ కారు విడుదల ఖరారు చేసిన హ్యుందాయ్

డిజైన్ మరియు ఎన్నో అంశాల పరంగా భారీ మార్పులు చేర్పులతో విడుదలకు సిద్దమైన కొత్త తరం హ్యుందాయ్ శాంట్రో అదే నమ్మకాన్ని మరియు విశ్వాసాన్ని ముందుకు తీసుకెళుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. చిన్న కార్లను ఎంచుకునే కస్టమర్లను చేరుకునేందుకు అవసరమయ్యే అన్ని అస్త్రాలను హ్యుందాయ్ తమ శాంట్రో ద్వారా ప్రయోగించనుంది.

నూతన హ్యుందాయ్ శాంట్రో కారుకు మరో కొత్త పేరును పెట్టాలంటే మీరు ఏ పేరు సూచిస్తారు. క్రింది కామెంట్ బాక్సు ద్వారా మాతో పంచుకోండి....

Source: Autocar India

Most Read Articles

English summary
Read In Telugu: Hyundai To Reveal Their New Small Car's Name On October 4 — Will It Be The Santro
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X