ఒక్కసారి ఈ వీడియో చూడండి హెల్మెట్ విలువేంటో తెలుస్తుంది!

ఇరుకైన రోడ్డులో ప్రయాణిస్తున్న బైక్ రైడర్ అదుపుతప్పి రోడ్డు మీద పడిపోయాడు. ఆ వెంటనే కంటైనర్‌తో వెళుతున్న లారీ అతని తలను తొక్కించుకుంటూ వెళ్లింది. అదృష్టవశాత్తు ఆ రైడర్ అక్కడి నుండి లేచి నడుచుకుంటూ పక్

By Anil Kumar

జీవితం మీద ఆశ ఎవరికి ఉండదు? ప్రాణం మీదకు వచ్చినపుడు... లేదా చచ్చిబ్రతికినపుడు మాత్రమే దాని విలువ తెలుస్తుంది. బాధ్యతారహితంగా సాగే జీవన విధానంలో అలా రాసిపెట్టి ఉంది కాబట్టి కాలం చేశాడు, ఇలా రాసిపెట్టి ఉంది కాబట్టి ప్రాణాలతో బయటపడ్డాడు అనే వాదనలు చాలా సహజం.

హెల్మెట్ ప్రాముఖ్యత

కానీ, ఈ ప్రమాదం జరిగిన తీరు చూస్తే, మన పట్ల మనం తీసుకునే జాగ్రత్తలు నుదుటి రాతలను కూడా తారుమారు చేస్తాయని నమ్మక తప్పదు. అనుకోకుండా జరిగిన తప్పిదంలో ఓ బైక్ రైడర్ ఊహించని విధంగా ప్రాణాలతో బయటపడ్డాడు. దాని గురించిన వివరాలు ఇవాళ్టి కథనంలో వివరంగా....

హెల్మెట్ ప్రాముఖ్యత

ఇరుకైన రోడ్డులో ప్రయాణిస్తున్న బైక్ రైడర్ అదుపుతప్పి రోడ్డు మీద పడిపోయాడు. ఆ వెంటనే కంటైనర్‌తో వెళుతున్న లారీ అతని తలను తొక్కించుకుంటూ వెళ్లింది. అదృష్టవశాత్తు ఆ రైడర్ అక్కడి నుండి లేచి నడుచుకుంటూ పక్కకు వెళ్లిపోయాడు.

హెల్మెట్ ప్రాముఖ్యత

నమ్మశక్యంగా లేదు కదూ... కారు ఫ్రంట్ కెమెరాలో రికార్డుయిన ఈ వీడియో ఫుటేజ్ ఇప్పుడు వైరల్ అయ్యింది. భారీ బరువున్న లారీ తల మీద నుండి వెళ్లినా కూడా ప్రాణాలతో బయటపడం అంత ఆశామాషీ కాదు. కానీ, అత్యంత నాణ్యమైన, ఉత్తమ నాణ్యతా ప్రమాణాలు పాటించిన శిరస్త్రాణం ధరించడంతో చిన్న గాయం కూడా లేకుండా సురక్షితంగా బయటపడ్డాడు.

హెల్మెట్ ప్రాముఖ్యత

నిజానికి, ఈ ప్రమాదం హెల్మెట్‌ ధరించడాన్ని తేలికగా కొట్టిపారేసే రైడర్లకు ఒక చక్కటి గుణపాఠం అని చెప్పవచ్చు. అంతే కాకుండా, నాణ్యమైన మరియు గుర్తింపు పొందిన హెల్మెట్లను మాత్రమే వినియోగించడం పట్ల ఉన్న ప్రాముఖ్యతను వివరిస్తుంది.

హెల్మెట్ ప్రాముఖ్యత

చాలా మంది ఇండియన్ రైడర్లు, పోలీసులు విధించే జరిమానా తప్పించుకునేందుకు నామమాత్రపు నాణ్యత ఉన్న హెల్మెట్లను వినియోగిస్తున్నారు. నిజానికి నాణ్యత ప్రమాణాలు పాటించని హెల్మెట్ మన ప్రాణాలను రక్షించడంలో ఏ విధంగాను ఉపయోగపడవు.

హెల్మెట్ ప్రాముఖ్యత

ఏదేమైనప్పటికీ, కేంద్ర ప్రభుత్వం ఈ నాన్-ఐఎస్ఐ మరియు గుర్తింపు పొందని హెల్మెట్ల తయారీ, సేల్స్ మరియు వినియోగం పట్ల చాలా కఠినమైన చర్యలు తీసుకోనుంది. అంతే కాకుండా ఇక్కడ పేర్కొన్న అంశాలను ఉల్లంఘనను మోటార్ వెహికల్ చట్టం ప్రకారం నేరంగా పరిగణించనుంది.

హెల్మెట్ ప్రాముఖ్యత

గతంలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ మరియు ధర్మేంద్ర ప్రధాన్ సుఖద్ యాత్రా మొబైల్ యాప్ మరియు నేషనల్ హైవే ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నెంబర్ 1033 ప్రారంభించిన కార్యక్రమలో ఈ నాణ్యత రహితమైన హెల్మెట్ వినియోగం గురించి చర్చించారు.

హెల్మెట్ ప్రాముఖ్యత

ఈ ఏడాది చివరి నాటికి నాణ్యమైన ఐఎస్ఐ గుర్తింపు ఉన్న హెల్మెట్లను మాత్రమే కేంద్ర అనుమతించే విధంగా కేంద్రం నూతన విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఈ నియాన్ని చాలా కఠినంగా 6 నెలల్లోపు పూర్తి స్థాయిలో అమలు చేయాలనే లక్ష్యంతో ఉన్నారు.

ఈ వీడియా చూసిన తరువాత రైడర్లు ఇప్పుటికైనా కళ్లు తెరవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చావు రాసి పెట్టి ఉంటే చస్తాం లేదంటే ఏ ఆపద వచ్చిన బ్రతికేస్తాం అని మొండి ఆలోచనల నుండి బయటపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నాణ్యమైన ఐఎస్ఐ మార్కు కలిగిన హెల్మెట్ సగటు ధర 500 నుండి 1,000 మధ్య ఉంటుంది. కానీ, ఈ చిన్న మొత్తం ఎంతో విలువైన మీ ప్రాణాలను కాపాడుతుందని గుర్తించండి.

హెల్మెట్ ప్రాముఖ్యత

ఐఎస్ఐ హెల్మెట్ తయారీదారుల సంఘం అధ్యక్షుడు రాజీవ్ కపూర్ మాట్లాడుతూ, "ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారం 75 నుండి 80 మంది ఇండియన్ రైడర్లు ఉపయోగించే హెల్మెట్లు ఐఎస్ఐ ప్రమాణాలు పాటించడం లేదు. మార్కెట్లోకి నకిలీ హెల్మెట్లు తక్కువ ధరలో లభిస్తుండటంతో పోలీసుల నుండి తప్పించుకునేందుకు రైడర్లు వాటిని ఆశ్రయిస్తున్నారు. ద్విచక్ర వాహనదారుల భద్రత దృష్ట్యా హెల్మెట్ల విషయంలో కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు హర్షించదగినవని చెప్పుకొచ్చాడు."

Most Read Articles

English summary
Read In Telugu: Biker has a lucky escape after truck runs over his head – Helmet Saves
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X