మెట్రో కోచ్‌ల తయారీ ఇక మీదట భారత్‌లోనే

By Anil
Recommended Video - Watch Now!
What Does The ‘X’ On The Back Of Trains Mean? - DriveSpark

భారత్‌లో శరవేగంగా అభివృద్ది చెందుతున్నమెట్రో సిటీల్లో నగర ప్రయాణం రోజు రోజుకీ కష్టతరంగా మారుతోంది. ఈ సమస్య ఇటు నగర ప్రజలను, అటు ప్రభుత్వాలను తీవ్ర వేస్తోంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మెట్రో నగరాల్లో మెట్రో రైళ్లను అందుబాటులోకి తెస్తున్నారు.

భారత్‌లో మెట్రో కోచ్‌ల తయారీ

మెట్రో రైళ్లకు అవసరమయ్యే కోచ్‌లను మరియు ఇంజన్‌లను దిగుమతి చేసుకుంటున్నారు. దీంతో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మీద భారం అధికమవుతోంది. ఈ నేపథ్యంలో భారత్ అవసరాలకు అనుగుణంగా ఇండియాలోనే మెట్రో రైల్ కోచ్‌ల తయారీకి ఇండియన్ రైల్వే ముందుకొచ్చింది.

భారత్‌లో మెట్రో కోచ్‌ల తయారీ

దేశీయంగా మెట్రో రైల్ కోచ్‌ల తయారీ కోసం ఇండియన్ రైల్వే మరియు మహారాష్ట్ర ప్రభుత్వం మధ్య పరస్పర అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా ఇండియన్ రైల్వే మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో మెట్రో కోచ్ తయారీ ప్లాంటును ఏర్పాటు చేయనుంది.

భారత్‌లో మెట్రో కోచ్‌ల తయారీ

ఇండియా మొత్తం ఉన్న వివిధ మెట్రో నగరాల్లో మెట్రో రైళ్లు ఏర్పాటు చేసే ప్రభుత్వాలకు ఆర్థికంగా కలిసొచ్చేందుకు మేకిన్ ఇండియా చొరవతో మెట్రో కోచ్‌ల తయరీని భారత రైల్వే వ్యవస్థ చేపట్టనుంది. దీంతో విదేశాల నుంచి మెట్రో కోచ్‌ల దిగుమతి చేసుకునే అవసరం తీరిపోనుంది.

భారత్‌లో మెట్రో కోచ్‌ల తయారీ

తొలి దశ క్రింది ప్రొడక్షన్ ప్లాంటు ఏర్పాటు మరియు కోచ్‌ల తయారీ కోసం సుమారుగా 600 కోట్ల రుపాయలు పెట్టుబడి పెడుతోంది. తరువాత దశలో ఈ పెట్టుబడి 2,000 కోట్ల రుపాయల వరకు పెరగనుంది.

భారత్‌లో మెట్రో కోచ్‌ల తయారీ

ఈ ఒప్పందంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ప్రత్యక్షంగా 15,000 మంది దేశీయ యువతకు ఉపాధిని కల్పించనుంది. దిగుమతి చేసుకునే కోచ్‌ల కంటే తక్కువ ధరలోనే అందుబాటులోకి తీసుకురావడం మరియు ఇక్కడ తయారయ్యే మెట్రో కోచ్‌లను విదేశాలకు కూడా ఎగుమతి చేయనున్నారు.

భారత్‌లో మెట్రో కోచ్‌ల తయారీ

మహారాష్ట్ర ప్రభుత్వం సుమారుగా 370 ఎకరాలను రాయితీ ధరతో మెట్రో కోచ్ తయారీ ప్లాంటు ఏర్పాటు కోసం ఇండియన్ రైల్వేకు అందిస్తోంది. ఒప్పందంలో రైల్వే అనుసంధానంతో సహా నీరు మరియు విద్యుత్ మీద రాష్ట్ర ప్రభుత్వం విధించే ట్యాక్స్‌లో రాయితీ కల్పిస్తోంది.

భారత్‌లో మెట్రో కోచ్‌ల తయారీ

ముంబాయ్ నగరంలో జరిగిన మ్యాగ్నెటిక్ మహారాష్ట్ర సదస్సులో ఇండియన్ రైల్వేతో ఈ మెట్రో కోచ్ తయారీ ప్లాంటు ఏర్పాటు చేసే ఒప్పందాన్ని ఇండియన్ రైల్వేతో కుదుర్చుకుంది.

భారత్‌లో మెట్రో కోచ్‌ల తయారీ

మహారాష్ట్ర ప్రభుత్వం ఈ సదస్సులో ఇంకా ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకుంది. రాష్ట్ర ప్రయోజనాలు మరియు పెట్టుబడులను ఆకర్షించే దిశగా జరిగిన ఈ సదస్సులో ముంబాయ్-పూనే నగరాల మధ్య గంటకు 350కిమీల వేగంతో ప్రయాణించే హైపర్‌లూప్ రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు వర్జిన్ హైపర్‌లూప్ వన్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.

భారత్‌లో మెట్రో కోచ్‌ల తయారీ

గత 70 ఏళ్లలో ఇండియన్ రైల్వే మహారాష్ట్రలో ఫ్యాక్టరీ ఏర్పాటుకు పెట్టుబడి పెట్టడం ఇదే తొలిసారి. మరికొన్ని వారాల్లో మహారాష్ట్ర ప్రభుత్వం ఇండియన్ రైల్వేకు భూమి కేటాయిస్తే, అతి త్వరలోనే లాతూర్ జిల్లాలోని ఒస్మానాబాద్ మరియు నాందేడ్ సమీపంలో ప్లాంటు తయారీ పనులు ప్రారంభం కానున్నాయి.

భారత్‌లో మెట్రో కోచ్‌ల తయారీ

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియాలో ఉన్న మరియు రాబోతున్న పలు మెట్రో సంస్థలకు కావాల్సిన మెట్రో కోచ్‌ల తయారీ భారత్‌లోనే తయారు చేయడంతో దేశ మరియు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు మరింత పటిష్టం కానున్నాయి. ఆర్థికంగా బలపడటమే కాకుండా, విదేశాలకు నిధులను వెచ్చించడానికి కూడా అడ్డుకట్టు వేయవచ్చు. అంతే కాకుండా ప్రత్యక్షంగా 15,000 మందికి ఉపాధి లభించనుంది.

భారత్‌లో మెట్రో కోచ్‌ల తయారీ

మహారాష్ట్రలో ఇండియన్ రైల్వే నిర్మించనున్న మెట్రో రైల్ కోచ్ తయారీ ప్లాంటు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే, దేశవ్యాప్తంగా రద్దీతో కూడిన నగరాల్లో మెట్రో రైల్ రవాణాను వెంటనే అందుబాటులోకి తీసుకురావచ్చు.

భారత్‌లో మెట్రో కోచ్‌ల తయారీ

682 భోగీలు, 8 ఇంజన్‍‌‌లతో ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైలు

ఇండియన్ రైల్వే గురించి ప్రతి భారతీయుడు తెలుకోవాల్సిన నిజాలు

మన హైదరాబాదులో ప్రాణం పోసుకున్న భారత దేశపు తొలి మేడియన్ ఇండియా రైలు "మేథా"

Most Read Articles

English summary
Read In Telugu: Indian Railways Invests Rs 600 Crore In Maharashtra To Set Up Coach Factory And Generate Employment
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X