ఇసుజు ఎమ్‌యు-ఎక్స్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని పరీక్షిస్తున్న జపాన్ దిగ్గజం

Isuzu గత ఏడాది మే నెలలో విపణిలోకి సరికొత్త ఎమ్‌యు-ఎక్స్ ఎస్‌యూవీని లాంచ్ చేసింది. జపాన్ దిగ్గజం ఇసుజు తమ మునుపటి ఎమ్‌యు-7 స్థానాన్ని భర్తీ చేస్తూ ఎమ్‌యు-ఎక్స్ ‌ఎస్‌యూవీని ప్రవేశపెట్టింది. అయితే, ఇప్పు

By Anil Kumar

ఇసుజు మోటార్స్ ఇండియా గత ఏడాది మే నెలలో విపణిలోకి సరికొత్త ఎమ్‌యు-ఎక్స్ ఎస్‌యూవీని లాంచ్ చేసింది. జపాన్ దిగ్గజం ఇసుజు తమ మునుపటి ఎమ్‌యు-7 స్థానాన్ని భర్తీ చేస్తూ ఎమ్‌యు-ఎక్స్ ‌ఎస్‌యూవీని ప్రవేశపెట్టింది.

ఇసుజు ఎమ్‌యు-ఎక్స్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని పరీక్షిస్తున్న జపాన్ దిగ్గజం

అయితే, ఇప్పుడు తాజాగా ఇసుజు ఎమ్‌యు-ఎక్స్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని రహస్యంగా పరీక్షిస్తోంది. దీని తాలూకు ఫోటోలు మరియు ఇతర వివరాలు లీక్ అయ్యాయి. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు మరికొన్ని నెలల్లో దీనిని ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉంది. ఇసుజు ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ గురించి పూర్తి వివరాలు...

ఇసుజు ఎమ్‌యు-ఎక్స్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని పరీక్షిస్తున్న జపాన్ దిగ్గజం

ఎక్ట్సీరియర్ డిజైన్ ఏ మాత్రం గుర్తించడానికి వీల్లేకుండా నలుపు మరియు తెలుపు రంగు చారలున్న పేపరుతో బాడీ మోత్తాన్ని కప్పేసి ఇండియన్ రోడ్ల మీద పరీక్షించారు. అయితే, ప్రస్తుతం పరీక్షిస్తున్న ఈ ఇసుజుకి ఎమ్‌యు-ఎక్స్ ఎస్‌యూవీని అగ్నేయాసియాలో 2017లోనే ఆవిష్కరించారు.

ఇసుజు ఎమ్‌యు-ఎక్స్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని పరీక్షిస్తున్న జపాన్ దిగ్గజం

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మోడల్‌తో పోల్చితే, ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఇసుజు ఎమ్‍‌యు-ఎక్స్ ఎస్‌యూవీ ఎక్ట్సీరియర్‌లో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ప్రత్యేకించి పగటి పూట వెలిగే ఎల్ఈడీ లైట్ల జోడింపుతో ఉన్న సరికొత్త ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ మరియు కొద్దిగా మార్పులు జరిపిన ఫ్రంట్ బంపర్ ఉన్నాయి.

ఇసుజు ఎమ్‌యు-ఎక్స్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని పరీక్షిస్తున్న జపాన్ దిగ్గజం

ఎస్‌యూవీ రియర్ డిజైన్‌లో కూడా పలు మార్పులు చోటు చేసుకున్నాయి. టెయిల్ ల్యాంప్ క్లస్టర్ మీద ఎల్ఈడీ ఎలిమెంట్స్ మరియు రీడిజైన్ చేయబడిన రియర్ బంపర్ ఉన్నాయి. ఎమ్‌యు-ఎక్స్ ఎస్‌యూవీలో సరికొత్త అల్లాయ్ వీల్స్ కూడా ఉన్నాయి.

ఇసుజు ఎమ్‌యు-ఎక్స్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని పరీక్షిస్తున్న జపాన్ దిగ్గజం

ఇసుజు ఎమ్‌యు-ఎక్స్ ఇంటీరియర్‌లో రీడిజైన్ చేయబడిన బ్లాక్ మరియు బీజీ కలర్ కాంబినేషన్‌లో ఉన్న డ్యూయల్-టోన్ డ్యాష్‌బోర్డ్ ఉంది. విలాసవంతమైన ఫీల్ కలిగించేందుకు అక్కడక్కడ కలప సొబగులు కూడా చేర్చారు. సెంటర్ కన్సోల్ మీద నూతన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇసుజు ఎమ్‌యు-ఎక్స్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని పరీక్షిస్తున్న జపాన్ దిగ్గజం

ఇసుజు ఎమ్‌యు-ఎక్స్ ఫేస్‌లిఫ్ట్ సాంకేతకంగా 3-లీటర్ డీజల్ ఇంజన్‌తో లభ్యం కానుంది. 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 174బిహెచ్‌పి పవర్ మరియు 380ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంతర్జాతీయ విపణిలో ఇది 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభ్యమవుతోంది.

ఇసుజు ఎమ్‌యు-ఎక్స్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని పరీక్షిస్తున్న జపాన్ దిగ్గజం

అంతే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్లో ఎమ్‌యు-ఎక్స్ ఎస్‌యూవీలో 1.9-లీటర్ కెపాసిటి గల టుర్భోఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్‌తో కూడా లభిస్తోంది. ఈ చిన్న ఇంజన్ గరిష్టంగా 148బహెచ్‌పి పవర్ మరియు 350ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

ఇసుజు ఎమ్‌యు-ఎక్స్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని పరీక్షిస్తున్న జపాన్ దిగ్గజం

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇసుజు ఎమ్‌యు-ఎక్స్ ఫేస్‌లిఫ్ట్ ఫ్రంట్ మరియు రియర్ డిజైన్‌తో పాటు ఇంటీరియర్‌లో కూడా గుర్తించదగిన పలు మార్పులు చోటు చేసుకున్నాయి. మెకానికల్‌గా మునుపటి మోడల్‌తో పోల్చుకుంటే ఎలాంటి మార్పులు జరగలేదు. ఇసుజు ఎమ్‌యు-ఎక్స్ ఫేస్‌లిఫ్ట్ పూర్తి స్థాయిలో విపణిలోకి విడుదలైతే ఫోర్డ్ ఎండీవర్, టయోటా ఫార్చ్యూనర్ మరియు అప్‌కమింగ్ మహీంద్రా బ్రాండ్ రెక్ట్సాన్ ఎస్‌యూవీలకు గట్టి పోటీనివ్వనుంది.

Source: GaadiWaadi

Most Read Articles

English summary
Read In Telugu: Isuzu MU-X Facelift Spotted Testing In India
Story first published: Wednesday, July 4, 2018, 13:29 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X