జాగ్వార్ ఎఫ్-టైప్‌లో మరో కొత్త వేరియంట్ విడుదల: ధర రూ. 90.93 లక్షలు

By Anil Kumar

జాగ్వార్ ఎఫ్-టైప్ ఇంజీనియం పెట్రోల్ వేరియంట్‌ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఇంజీనియం పెట్రోల్ ఇంజన్ విడుదలతో జాగ్వార్ తమ ఎఫ్-టైప్ లైనప్‌ను విస్తరించింది. సరికొత్త నాలుగు సిలిండర్ల టుర్భో-పెట్రోల్ ఇంజన్ కూపే మరియు కన్వర్టిబుల్ రెండు బాడీ స్టైల్స్‌లో లభ్యమవుతోంది.

జాగ్వార్ ఎఫ్-టైప్‌లో మరో కొత్త వేరియంట్ విడుదల: ధర రూ. 90.93 లక్షలు

జాగ్వార్ ఎఫ్-టైప్ ఇంజీనియం పెట్రోల్ కూపే మోడల్ ధర రూ. 90.93 లక్షలు మరియు ఎఫ్-టైప్ ఇంజీనియం పెట్రోల్ కన్వర్టిబుల్ మోడల్ ధర రూ. 1.01 కోట్లు. రెండు ధరలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి.

జాగ్వార్ ఎఫ్-టైప్‌లో మరో కొత్త వేరియంట్ విడుదల: ధర రూ. 90.93 లక్షలు

జాగ్వార్ ఎఫ్-టైప్‌లో ఉన్న ఇంజీనియం పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 300బిహెచ్‌పి పవర్ మరియు 400ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికి అనుసంధానం చేసిన 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా పవర్ మరియు టార్క్ రియర్ వీల్స్‌కు అందుతుంది.

జాగ్వార్ ఎఫ్-టైప్‌లో మరో కొత్త వేరియంట్ విడుదల: ధర రూ. 90.93 లక్షలు

జాగ్వార్ కథనం మేరకు, సరికొత్త ఇంజీనియం ఇంజన్ 52కిలోలు వరకు తక్కువ బరువు ఉంది. దీంతో ఇది జాగ్వార్ ఎఫ్-టైప్ గరిష్టంగా గంటకు 250కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతుంది మరియు 0 నుండి 100కిలోమీటర్ల వేగాన్ని కేవలం 5.7 సెకండ్ల వ్యవధిలోనే అందుకుంటుందని పేర్కొంది

జాగ్వార్ ఎఫ్-టైప్‌లో మరో కొత్త వేరియంట్ విడుదల: ధర రూ. 90.93 లక్షలు

జాగ్వార్ ఎఫ్-టైప్ కారులోని ఫ్రంట్ యాక్సిల్ మీద వీలైనంత వరకు బరువును తగ్గించారు. దీంతో స్టీరింగ్ రెస్పాన్స్, బాడీ కంట్రోల్ మరియు రైడ్ కంఫర్ట్ గణనీయంగా మెరుగయ్యాయి. అంతే కాకుండా జాగ్వార్ ఎఫ్-టైప్‌లో స్విచ్చబుల్ ఎగ్జాస్ట్ సిస్టమ్ ఉంది, ఇది డ్రైవింగ్ అనుభూతిని మరింత పెంచుతుంది

జాగ్వార్ ఎఫ్-టైప్‌లో మరో కొత్త వేరియంట్ విడుదల: ధర రూ. 90.93 లక్షలు

జాగ్వార్ ల్యాండ్ రోవర్(JLR) ఇండియా లిమిటెడ్ ప్రెసిడెంట్ మరియు మేనేజింగ్ డైరక్టర్, రోహిత్ సూరి మాట్లాడుతూ, "జాగ్వార్ ఎఫ్-టైప్‌లో 2.0-లీటర్ ఇంజీనియం ఇంజన్ పరిచయం చేయడం పట్ల ఎంతో సంతోషంగా ఉంది. దీని పరిచయంతో స్పోర్ట్స్ కార్ ప్రేమికులకు మరింత చేరువకానున్నామని చెప్పుకొచ్చాడు.

జాగ్వార్ ఎఫ్-టైప్‌లో మరో కొత్త వేరియంట్ విడుదల: ధర రూ. 90.93 లక్షలు

ఇంజీనియం ఇంజన్‌ను తేలికపాటి బరువున్న అల్యూమినియం లోహంతో తయారు చేశారు. తేలికపాటి బరువు ఉండటంతో కారు యొక్క మొత్తం బరువు ఓ మెస్తారు తగ్గింది. కారు యొక్క భౌతిక అంశాలు మరింత మెరుగయ్యాయి.

జాగ్వార్ ఎఫ్-టైప్‌లో మరో కొత్త వేరియంట్ విడుదల: ధర రూ. 90.93 లక్షలు

జాగ్వార్ ఇండియా లైనప్‌లో ప్రస్తుతం ఐదు మోడళ్లు ఉన్నాయి. అవి,

ఎక్స్ఇ ధర రూ. 39.73 లక్షలు

ఎక్స్ఎఫ్ ధర రూ. 49.58 లక్షలు

ఎఫ్-పేస్ ధర రూ. 62.99 లక్షలు

ఎక్స్‌జె ధర రూ. 1.10 కోట్లు

ఎఫ్-టైప్ ధర రూ. 90.93 లక్షలు

జాగ్వార్ ఎఫ్-టైప్‌లో మరో కొత్త వేరియంట్ విడుదల: ధర రూ. 90.93 లక్షలు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

జాగ్వార్ ఇండియా ఇటీవల 2018 ఎఫ్-టైప్ ఎస్‌విఆర్ మోడల్‌ను విడుదల చేసింది. దీని ధర రూ. 2.65 కోట్లు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది. జాగ్వార్ ఎఫ్-టైప్ స్పోర్ట్స్ కారు విపణిలో ఉన్న పోర్షే కయిన్ మరియు బాక్ట్సర్ వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

Most Read Articles

English summary
Read In Telugu: Jaguar F-Type Ingenium Petrol Launched In India; Prices Start At Rs 90.93 Lakh
Story first published: Tuesday, July 17, 2018, 10:21 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X