Just In
- 3 hrs ago త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- 6 hrs ago హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- 7 hrs ago JNCAP క్రాష్ టెస్ట్‌లో అదరగొట్టిన స్విఫ్ట్.. స్కోర్ ఎంతో తెలుసా?
- 7 hrs ago కొత్త మారుతి స్విఫ్ట్ బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా? ఇక్కడ చూడండి!
Don't Miss
- Sports IPL 2024: చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్!
- News చంద్రబాబు బచ్చా కామెంట్ కు జగన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇలా...!
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Movies పిఠాపురంలో బెట్టింగుల జోరు.. పవన్ కల్యాణ్‌పై కాయ్ రాజా కాయ్.. కోట్లలో పందాలు!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
జాగ్వార్ ఎక్స్ఇ మరియు ఎక్స్ఎఫ్ ఇంజీనియం పెట్రోల్ వెర్షన్ విడుదల: ధర రూ. 35.99 లక్షలు
జాగ్వార్ విపణిలోకి ఎక్స్ఇ మరియు ఎక్స్ఎఫ్ లగ్జరీ సెడాన్ కార్లను సరికొత్త ఇంజీనియం పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లో లాంచ్ చేసింది. ఇంజీనియం పెట్రోల్ ఇంజన్ గల జాగ్వార్ ఎక్స్ఇ ధర రూ. 35.99 లక్షలు
జాగ్వార్ విపణిలోకి ఎక్స్ఇ మరియు ఎక్స్ఎఫ్ లగ్జరీ సెడాన్ కార్లను సరికొత్త ఇంజీనియం పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లో లాంచ్ చేసింది. ఇంజీనియం పెట్రోల్ ఇంజన్ గల జాగ్వార్ ఎక్స్ఇ ధర రూ. 35.99 లక్షలు మరియు జాగ్వార్ ఎక్స్ఎఫ్ ధర రూ. 49.80 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి.
Recommended Video
జాగ్వార్ ఎక్స్ఇ మరియు ఎక్స్ఎఫ్ మోడళ్లను ఇంజీనియం డీజల్ ఇంజన్ ఆప్షన్లో మే 2017లో ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. జాగ్వార్ ఇండియా లైనప్‌లో తమ ఉత్పత్తుల సామర్థ్యాన్ని పెంచుకునే లక్ష్యంతో ఎక్స్ఇ మరియు ఎక్స్ఎఫ్ మోడళ్లను ఇంజీనియం పెట్రోల్ ఇంజన్లతో ప్రవేశపెట్టింది.
ఖరీదైన ప్రీమియమ్ సెడాన్ కార్ల సెగ్మెంట్లో డీజల్ కార్ల కంటే పెట్రోల్ కార్లను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. దీనిని గమనించిన జాగ్వార్ తమ ఎక్స్ఇ మరియు ఎక్స్ఎఫ్ మోడళ్లలో పెట్రోల్ ఇంజన్‌ను పరిచయం చేసింది. జాగ్వార్ ఇంజీనియం పెట్రోల్ ఇంజన్ అంతర్జాతీయ మార్కెట్లో ఇది వరకే అందుబాటులోకి వచ్చింది.
సాంప్రదాయ పెట్రోల్ ఇంజన్లలో అత్యధికంగా క్యాస్ట్-ఐరన్ బ్లాక్స్ ఉపయోగిస్తారు. కానీ, జాగ్వార్ అభివృద్ది చేసిన ఇంజీనియం ఇంజన్లు నిజానికి అల్యూమినియంతో తయారు చేస్తారు. అల్యూమినియం లోహం ఐరన్ కంటే తక్కువ బరువైనది. దీంతో ఇది కారు బరువు తగ్గడంలో మెరుగ్గా సహాయపడుతుంది.
అదనంగా, ఇంజీనియం ఇంజన్ల లోపల సిలిండర్ గోడల మీద ఘర్షణ లక్షణాలు చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించడం జరిగింది. ఇంజన్ లోపల కదిలే విడి భాగాల మీద ఘర్షణ ప్రభావం తక్కువగా ఉండటంతో అత్యుత్తమ మైలేజ్ మరియు పవర్ సాధ్యమవుతుంది.
ఇంజీనియం పెట్రోల్ ఇంజన్లలో పేటెంట్ పొందిన వేరిబుల్ వాల్వ్ టైమింగ్ టెక్నాలజీని ఉపయోగించారు. ఇంజీనియం ఇంజన్లలో థర్మల్ లక్షణాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి.
సాంకేతికంగా ఇందులో ఉన్న 2.0-లీటర్ ఇంజీనియం పెట్రోల్ ఇంజన్ 197బిహెచ్పి మరియు 247బిహెచ్పి రెండు రకాల పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. జాగ్వార్ సీక్వెన్షియల్ షిఫ్ట్ మరియు ఆల్ సర్ఫేస్ ప్రొగ్రెస్ కంట్రోల్ కోసం ఇంజన్‌కు 8-స్పీడ్ ఎలక్ట్రానిక్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అనుసంధానం చేయడం జరిగింది. అన్ని రకాల ఇంజన్ వేగం(RPM) వద్ద అత్యుత్తమ టార్క్ ప్రొడ్యూస్ చేయడానికి ఎక్స్ఇ మరియు ఎక్స్ఎఫ్లోని ఇంజన్లో ట్విన్-స్క్రోల్ ట్యూబులు ఉన్నాయి.
జాగ్వార్ ఎక్స్ఇ ప్రెస్టీజ్, ఎక్స్ఇ ప్యూర్ మరియు ఎక్స్ఎఫ్ ప్రెస్టేజ్ వేరియంట్లలో 197బిహెచ్ ఉత్పత్తి చేసే ఇంజన్ అదే విధంగా జాగ్వార్ ఎక్స్ఇ మరియు జాగ్వార్ ఎక్స్ఎఫ్ పోర్ట్‌పోలియో వేరియంట్లలో 247బిహెచ్పి ప్రొడ్యూస్ చేసే ఇంజన్ కలదు.
జాగ్వార్ ఇండియా లైనప్‌లో ప్రస్తుతం ఐదు మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. అవి,
- ఎక్స్ఇ - ప్రారంభ ధర రూ. 35.99 లక్షలు
- ఎక్స్ఎఫ్ - ప్రారంభ ధర రూ. 46.60 లక్షలు
- ఎఫ్-పేస్ - ప్రారంభ ధర రూ. 60.02 లక్షలు
- ఎక్స్‌జె - ప్రారంభ ధర రూ. 1.01 కోట్లు
- ఎఫ్-టైప్ - ప్రారంభ ధర రూ. 1.34 కోట్లు అన్ని ధరలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి.
ఫీచర్లు మరియు ఆప్షన్ల పరంగా చూస్తే, ఇంజీనియం వేరియంట్లలో లభించే జాగ్వార్ ఎక్స్ఇ మరియు జాగ్వార్ ఎక్స్ఎఫ్ మోడళ్ల మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదు.