జీప్ కంపాస్ ట్రయల్‌హాక్ విడుదలకు కసరత్తులు పూర్తి

జీప్ ఇండియా విభాగం తమ కంపాస్ మిడ్ సైజ్ ఎస్‌యూవీ టాప్ ఎండ్ వేరియంట్ సరికొత్త ట్రయల్‌హాక్‌ను విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.

By Anil

Recommended Video

New Maruti Swift Launch: Price; Mileage; Specifications; Features; Changes

జీప్ ఇండియా విభాగం తమ కంపాస్ మిడ్ సైజ్ ఎస్‌యూవీ టాప్ ఎండ్ వేరియంట్ సరికొత్త ట్రయల్‌హాక్‌ను విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ఇండియన్ రోడ్లకు అనువుగా మార్చేందుకు జీప్ ఇప్పటికే పలుమార్లు కంపాస్ట్ ట్రయల్‌హాక్ వెర్షన్‌ను ఇండియన్ రోడ్ల మీద రహస్యంగా పరీక్షించింది.

జీప్ కంపాస్ ట్రయల్‌హాక్

తాజాగా, ముంబాయ్‌లో కంపాస్ ట్రయల్‌హాక్‌ను పరీక్షిస్తుండగా తీసిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్లో తేలాయి. కంపాస్ యొక్క ఆఫ్-రోడ్ వెర్షన్‌ను టాప్ ఎండ్ వేరియంట్‌గా ట్రయల్‌హాక్ పేరుతో జీప్ ఇండియా ప్రవేశపెట్టనుంది.

జీప్ కంపాస్ ట్రయల్‌హాక్

పూనే సమీపంలో ఉన్న ఫియన్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ రంజన్‌గావ్ ప్లాంటులో సెప్టెంబర్-అక్టోబర్ 2017 మధ్య కాలంలోనే జీప్ తమ కంపాస్ ట్రయల్‌హాక్ వేరియంట్ ప్రొడక్షన్‌ను ప్రారంభించింది.

జీప్ కంపాస్ ట్రయల్‌హాక్

జీప్ ఇండియా ఇప్పటికే ట్రయల్‌హాక్ వెర్షన్ కంపాస్ ఎస్‌యూవీని ట్రయల్‌రేటెడ్ పేరుతో ఆస్ట్రేలియాకు ఎగుమతి చేస్తోంది. అంతే కాకుండా, కుడివైపు స్టీరింగ్ సిస్టమ్ ఉండే అన్నిదేశాలకు ఈ కంపాస్ ట్రయల్‌హాక్‌ను ఎగుమతి చేస్తోంది.

జీప్ కంపాస్ ట్రయల్‌హాక్

జీప్ కంపాస్ ట్రయల్‌హాక్ ఇప్పటికే పలు అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాల్లోకి వచ్చింది. భారత్‌లో ఏ సమయంలోనైనా విడుదల కావచ్చు. అయితే, ఇప్పటి వరకు కంపాస్ ట్రయల్‌హాక్ వేరియంట్ విడుదల గురించి ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ ఎలాంటి ప్రకటన చేయలేదు. బహుశా 2018 మధ్య భాగంలో విడుదలయ్యే అవకాశం ఉంది.

జీప్ కంపాస్ ట్రయల్‌హాక్

రహస్యంగా లీక్ అయిన ట్రయల్‌హాక్ ఫోటోలను పరిశీలిస్తే, ట్విన్ స్పోక్ అల్లాయ్ వీల్స్ ఉన్న ఎస్‌యూవీ డిజైన్ పరంగా చూడటానికి అచ్చం రెగ్యులర్ వెర్షన్ కంపాస్ ఎస్‌యూవీనే పోలి ఉంటుంది.

జీప్ కంపాస్ ట్రయల్‌హాక్

అయితే, కంపాస్ ట్రయల్‌హాక్ ఎస్‌యూవీ బానెట్ మీద అన్ని ట్రయల్‌హాక్ మోడళ్లలో వచ్చే మ్యాట్ బ్లాక్ డీకాల్స్ మిస్సయ్యాయి. ట్రయల్‌హాక్ ఎస్‌యూవీలు విభిన్నంగా ఉండేందుకు సైడ్ ఫెండర్స్ మీద ట్రయల్ రేటెడ్ లెటర్స్, టు-టోన్ అల్లాయ్ వీల్స్ మరియు టెయిల్‌గేట్ వద్ద ట్రయల్‌హాక్ బ్యాడ్జ్ ఉంటాయి.

జీప్ కంపాస్ ట్రయల్‌హాక్

ప్రస్తుతం, జీప్ కంపాస్ డీజల్ టాప్ ఎండ్ వేరియంట్లో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌‌బాక్స్ లేదు. అయితే, కనీసం ట్రయల్‌హాక్ వేరియంట్లోనైనా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ పరిచయం చేసే అవకాశాలు ఉన్నాయి.

జీప్ కంపాస్ ట్రయల్‌హాక్

ఆస్ట్రేలియాకు ఎగుమతి అవుతున్న జీప్ కంపాస్ ట్రయల్‌హాక్ వేరియంట్లో 2.4-లీటర్ కెపాసిటి గల మల్టీజెట్ డీజల్ ఇంజన్ కలదు. 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల ఇది 168బిహెచ్‌పి పవర్ మరియు 360ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

జీప్ కంపాస్ ట్రయల్‌హాక్

జీప్ కంపాస్ ట్రయల్‌హాక్ వేరియంట్ డిజైన్‌ పరంగా రీడిజైన్ చేయబడిన బంపర్లు, అధిక గ్రౌండ్ క్లియరెన్స్‌తో వస్తోంది. రెగ్యులర్ వెర్షన్ శక్తివంతమైన డ్రైవ్ ట్రైన్ కోసం 4X4 డ్రైవ్‌ట్రైన్ అందిస్తోంది.

జీప్ కంపాస్ ట్రయల్‌హాక్

ఇంటీరియర్‌లో ఆల్-బ్లాక్ ఇంటీరియర్, రెడ్-హైలైట్స్, ఫ్రంట్ ప్యాసింజర్ మరియు డ్రైవర్ సీటు మీద ట్రయల్‌హాక్ బ్యాడ్జింగ్, లెథర్ తొడుగులు గల స్టీరింగ్ వీల్, గేర్ లీవర్ మరియు ప్యానల్స్ ఉన్నాయి. భద్రత కోసం ఇది వరకే ఉన్న సేఫ్టీ ఫీచర్లతో పాటు, హిల్ డిసెంట్ కంట్రోల్, వెనుక వైపున ఆరు పార్కింగ్ సెన్సార్లు వంటివి స్టాండర్డ్‌గా వచ్చాయి.

జీప్ కంపాస్ ట్రయల్‌హాక్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

జీప్ ఇండియా తమ కంపాస్ ట్రయల్‌హాక్ వేరియంట్లో మరిన్ని ఆఫ్-బీట్ సామర్థ్యాలను జోడించనుంది. ప్రత్యేకించి శక్తివంతమైన ట్రయల్‌హాక్ టాప్ ఎండ్ వేరియంట్లో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ రానుంది. పూర్తి స్థాయిలో విపణిలోకి విడుదలైతే, జీప్ కంపాస్ ట్రయల్‌హాక్ అంచనా ధర రూ. 24 లక్షల నుండి 25 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్‌తో లభ్యం కానుంది.

Most Read Articles

Read more on: #jeep #జీప్
English summary
Read In Telugu: Jeep Compass Trailhawk All Set To Be Launched In India; Expected Launch Date & Price, Specs & Images
Story first published: Friday, February 16, 2018, 16:03 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X