ఇండియన్ మార్కెట్ కోసం మరో ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీని ఖరారు చేసిన జీప్

అమెరికాకు చెందిన దిగ్గజ లగ్జరీ ఎస్‌యూవీల తయారీ దిగ్గజం జీప్ ఇండియా విపణిలోకి సరికొత్త సబ్-ఫోర్ మీటర్ ఎస్‌యూవీని ఖరారు చేసింది. జీప్ ఇండియా విపణిలో రెనిగేడ్ ఎస్‌యూవీ క్రింది స్థానాన్ని భర్తీ చేయనుంది.

By Anil Kumar

అమెరికాకు చెందిన దిగ్గజ లగ్జరీ ఎస్‌యూవీల తయారీ దిగ్గజం జీప్ ఇండియా విపణిలోకి సరికొత్త సబ్-ఫోర్ మీటర్ ఎస్‌యూవీని ఖరారు చేసింది. జీప్ ఇండియా విపణిలో రెనిగేడ్ ఎస్‌యూవీ క్రింది స్థానాన్ని భర్తీ చేయనుంది.

జీప్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

ఈ సరికొత్త ఎంట్రీ-లెవల్ జీప్ ఎస్‌యూవీ కొత్త తరానికి చెందిన ఫియట్ పాండా మరియు 500 మోడళ్లను అభివృద్ది చేసిన ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా నిర్మించనుంది. ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ దిగ్గజం భాగస్వామ్యంలో ఎస్‌‌యూవీ బాడీ మరియు ఇంటీరియర్‌ డెవలప్ చేస్తోంది. అదే విధంగా పాండా 4X4 ఆధారంగా నూతన సబ్ ఫోర్ మీటర్ ఎస్‌యూవీని అభివృద్ది చేస్తోంది.

జీప్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

నాలుగు ఎలక్ట్రిక్ ఉత్పత్తులను మరియు పది ప్లగ్-ఇన్-హైబ్రిడ్ ఎస్‌యూవీలను 2020 నాటికి ప్రపంచ మార్కెట్లలోకి ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది. అంతే కాకుండా, వ్రాంగ్లర్ పికప్-ట్రక్కును మరియు గ్రాండ్ వ్యాగనీర్ ఎస్‌యూవీలను 2022 నాటికి పరిచయం చేయనుంది.

జీప్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

ఇండియన్ మార్కెట్లో సబ్ ఫోర్ మీటర్ ఎస్‌యూవీలకు డిమాండ్ అధికంగా ఉంది. జీప్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి సరికొత్త ఎంట్రీ లెవల్ స్మాల్ ఎస్‌యూవీని ప్రవేశపెట్టడానికి సిద్దమైంది.

జీప్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం, స్మాల్ కాంపాక్ట్ ఎస్‌యూవీతో పాటు మూడు వరుసల సీటింగ్ గల మిడ్-సైజ్ యుటిలిటి వెహికల్‌ను కూడా లాంచ్ చేయాలనే అలోచనలో ఉంది. ఎగుమతి కేంద్రంగా భారతదేశం యొక్క స్థానాన్ని బలోపేతం చేయటానికి ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ యోచిస్తోంది.

జీప్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

మహారాష్ట్రలోని జీప్ ఇండియా ప్రొడక్షన్ ప్లాంటులో ప్రస్తుతం ఉన్న 1,60,000 ఉత్పత్తి సామర్థ్యాన్ని 2,40,000 యూనిట్లకు పెంచే ఆలోచనలో జీప్ ఇండియా సిఇఒ మైకే మేన్లీ చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా, దేశవ్యాప్తంగా ఉన్న డీలర్ల సంఖ్యను సర్వీస్ నెట్‌వర్క్‌ను రెండు రెట్లు పెంచుకోవాలని భావిస్తోంది.

జీప్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

ప్రతి ఎస్‌యూవీ సెగ్మెంట్లో కూడా 100 శాతం మార్కెట్‌ను సొంతం చేసుకునేందుకు నూతన ఉత్పత్తులను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. రానున్న ఐదేళ్లలోపు సరికొత్త సబ్ ఫోర్ మీటర్ కాంపాక్ట్ ఎస్‌‌యూవీ మరియు గ్రాండ్ వ్యాగనీర్ యుటిలిటి వెహికల్ ఆధారిత పెద్ద ఎస్‌యూవీని కూడా లాంచ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Most Read Articles

Read more on: #jeep #జీప్
English summary
Read In Telugu: Jeep Confirms New Entry-Level Compact SUV For India
Story first published: Saturday, June 2, 2018, 12:37 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X